ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ రాజకీయ నిర్ణయం: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఈ సందర్బంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ  నేపథ్యంలో ఉచిత రాజకీయాల గురించి వివరిస్తూ, అది  “భవిష్యత్తు పెట్టుబడి” అని పిలవడానికి ఇష్టపడతానని చెప్పారు. అదే విధంగా బీజేపీతో తనకున్న సంబంధాల గురించి తెలుపుతూ.. తాను ప్రధానితో మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని మరోసారి పునరుద్ఘాటించారు. రాబోయే పెట్టుబడిదారుల సదస్సులో తొలిసారిగా అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు. సంపద, ఉద్యోగ కల్పనలో వారికి మద్దతుగా […]

Share:

ఈ సందర్బంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ  నేపథ్యంలో ఉచిత రాజకీయాల గురించి వివరిస్తూ, అది  “భవిష్యత్తు పెట్టుబడి” అని పిలవడానికి ఇష్టపడతానని చెప్పారు. అదే విధంగా బీజేపీతో తనకున్న సంబంధాల గురించి తెలుపుతూ.. తాను ప్రధానితో మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని మరోసారి పునరుద్ఘాటించారు.

రాబోయే పెట్టుబడిదారుల సదస్సులో

తొలిసారిగా అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు. సంపద, ఉద్యోగ కల్పనలో వారికి మద్దతుగా మేము ఇక్కడ ఉన్నామని.. మా నాయకత్వం, మా ప్రభుత్వం ఇచ్చిన హామీ వల్లే వాళ్లకి ఈ నమ్మకం వచ్చిందన్నారు. ప్రతి రాష్ట్రం పెట్టుబడిదారుల సదస్సులను నిర్వహిస్తుంది. వ్యాపారవేత్తలకు ఒకే రకమైన ఆఫర్‌లను అందిస్తారు. మనకు 974 కిలోమీటర్ల తీరప్రాంతం, ఆరు ఓడరేవులు ఉన్నాయి. మరో నాలుగు నిర్మాణంలో ఉన్నాయి. తగిన ల్యాండ్ బ్యాంక్, ఖనిజ వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా ఏపీలో లభ్యమవుతాయి. గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వేలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. రాష్ట్రంలో సున్నపు రాయి అందుబాటులో ఉన్నందున సిమెంట్ రంగంలో పెట్టుబడులు రావచ్చు.

రాష్ట్రంలో పెరుగుతున్న అప్పులు, ఆర్థిక నిర్వహణ

మేము అధికారంలోకి వచ్చాక ..2014 నుండి 2019 మధ్య 19.05% CAGR నుండి 139% అప్పులతో 2,71,000 కోట్ల రూపాయల అప్పును వారసత్వంగా పొందాము. గత నాలుగు సంవత్సరాల్లో, 13.5% CAGR వద్ద అప్పు కేవలం 68% మాత్రమే పెరిగింది. గతప్రభుత్వంతో పోలిస్తే మేము తీసుకున్న ఋణం తక్కువ. ప్రస్తుత ఋణం రూ.4.42 లక్షల కోట్లుగా ఉంది. 

నగదు పథకాలు, ఉచితాల కోసం బడ్జెట్‌లో 50% కంటే ఎక్కువ ఖర్చు చేయడాన్ని

మీరు దీన్ని ఫ్రీబీస్ అంటారు, కానీ నేను దానిని భవిష్యత్తు పెట్టుబడి అంటాను. ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి కొత్త CBSE ఇంగ్లీష్-మీడియం పాఠ్యాంశాలతో పాఠశాలలు, కళాశాలల్లో భారీ మౌలిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

పిల్లలను పాఠశాలకు పంపినందుకు తల్లులకు సంవత్సరానికి 15,000 ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నాము. ప్రతిదీ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా జరుగుతుంది, కాబట్టి అవినీతికి ఆస్కారం లేదు. ఈ పథకాలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో (SDGలు) అనుసంధానించబడ్డాయి. మాది మానవ వనరులపై పెట్టుబడి. ఇదంతా ఫ్రీబీ అయితే.. 11.43% వృద్ధి ఎక్కడ నుండి వచ్చింది అని విపక్షాలని ప్రశ్నించారు.

గతంలో అమరావతి రాజధాని ప్రాజెక్టును రద్దు చేయడం

రాష్ట్రం ముందుకు వెళుతున్న కొద్దీ, దిద్దుబాట్లు, కొత్త ప్రారంభాలు ఉంటాయి. విద్య, వైద్యం, వ్యవసాయ మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడం నా ప్రాధాన్యత. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని ప్రాజెక్టును రద్దు చేయడం జరిగిందన్నారు. 

బీజేపీతో పొత్తు పెట్టుకోవడం

కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతివ్వాలి. ఒక్కోసారి మనం కొన్నింటిని వ్యతిరేకిస్తాం. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రావాలంటే.. వారికి మద్దతిస్తేనే మనకు లాభం అనేది నా అభిప్రాయం.  మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏది మంచిదో దాన్ని మాత్రమే ఫాలో అవుతానన్నారు. అయితే అవును నిజమే.. నేను ప్రధాని మోదీతో మంచి  సంబంధాన్ని కోరుకుంటున్నాని అన్నారు..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యాసాధ్యాలపై

ఇది ఆర్థిక నిర్ణయం కాదు, రాజకీయ నిర్ణయం, దీనికి ఏదో ఒక రోజు సమయం వస్తుంది అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.