మణిపూర్‌‌లో అల్లర్లపై మహిళా మాజీ న్యాయమూర్తులతో కమిటీ

అల్లర్లతో అట్టుకుతున్న మణిపూర్‌‌లో శాంతి నెలకొల్పేందుకు సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని జాతుల వైరానికి సంబంధించిన కేసుల్లో దర్యాప్తుతో పాటు పునరావాసం, ఇతర అంశాలను పరిశీలించేందుకు ముగ్గురు మహిళా మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని వేసింది. ఈ కమిటీ కేవలం హింసాత్మక ఘటనలపై విచారణ చేయడం మాత్రమే కాకుండా దాని పరిధి విస్తృతంగా ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. పునరావాసం, ఇతర ఉపశమన చర్యలతో పాటు రాష్ట్రంలో హింసకు సంబంధించిన సుమారు 10 పిటిషన్లను సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ […]

Share:

అల్లర్లతో అట్టుకుతున్న మణిపూర్‌‌లో శాంతి నెలకొల్పేందుకు సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని జాతుల వైరానికి సంబంధించిన కేసుల్లో దర్యాప్తుతో పాటు పునరావాసం, ఇతర అంశాలను పరిశీలించేందుకు ముగ్గురు మహిళా మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని వేసింది. ఈ కమిటీ కేవలం హింసాత్మక ఘటనలపై విచారణ చేయడం మాత్రమే కాకుండా దాని పరిధి విస్తృతంగా ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. పునరావాసం, ఇతర ఉపశమన చర్యలతో పాటు రాష్ట్రంలో హింసకు సంబంధించిన సుమారు 10 పిటిషన్లను సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ సిన్హాతో కూడిన బెంచ్ సోమవారం విచారించింది. 

‘‘రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకే ముగ్గురు హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ కేవలం దర్యాప్తు కాకుండా రిలీఫ్, నివారణ చర్యలు, పునరావాసం, ఇళ్లు, ప్రార్థనా స్థలాల పునరుద్ధరణ వంటి అంశాలను పరిశీలిస్తుంది” అని సుప్రీంకోర్టు చెప్పింది. జస్టిస్‌ గీతా మిట్టల్‌ (జమ్మూకాశ్మీర్‌‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ షాలినీ జోషి (బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి), జస్టిస్‌ ఆషా మీనన్‌ (ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి)తో కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు, మాజీ ఐపీఎస్‌ అధికారి దత్తాత్రేయ పడ్సల్గికర్ సీబీఐ దర్యాప్తును పర్యవేక్షిస్తారని కోర్టు చెప్పింది. వివిధ రాష్ట్రాల నుంచి సీబీఐలోకి తీసుకొచ్చిన కనీసం డీఎస్పీ స్థాయి ఐదుగురు అధికారులు ఈయన టీమ్‌లో ఉంటారని పేర్కొంది. 

42 సిట్‌లు ఏర్పాటు చేశాం.

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటరీ జనరల్ తుషార్‌‌ మెహతా వాదనలు వినిపించారు. మణిపూర్ సీఎస్ వినీత్‌ జోషి, రాష్ట్ర డీజీపీరాజీవ్‌ సింగ్‌ కూడా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.వెంకటరమణి వాదిస్తూ.. సీబీఐకి బదిలీ చేయని కేసులను 42  స్పెషల్ ఇన్వెస్టిగేషణ్ టీమ్(సిట్‌)లను ఏర్పాటు చేసి, విచారిస్తున్నామని కోర్టుకు తెలిపారు. అయితే, ఈ సిట్‌లకు మణిపూర్‌‌ కాకుండా వేరే రాష్ట్రాల నుంచి డీఐజీ ర్యాంక్ అధికారులు దర్యాప్తు ఆఫీసర్లుగా  ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి అధికారి ఆరు సిట్‌లను పర్యవేక్షించాలని, ఈ సిట్‌లో ఉండే అధికారులు కూడా వేరే రాష్ట్రాలకు చెందిన వారు ఉండాలని చెప్పింది. హింసాకాండకు సంబంధించిన కేసులను విచారించేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక దర్యాప్తు బృందాలను కూడా ఏర్పాటు చేయాలని తెలిపింది. రాష్ట్రంలో హింసకు సంబంధించి శాంతి భద్రతల విషయలో ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి ఈ రాష్ట్ర డీజీపీ సుప్రీంకోర్టుకు వివరించారు. 

11 ఎఫ్‌ఐఆర్‌‌లు సీబీఐకి బదిలీ

మణిపూర్‌‌లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు సంబంధించి నమోదైన 11 ఎఫ్‌ఐఆర్‌‌లను సీబీఐకి బదిలీచేస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసుల దర్యాప్తునకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు చెందిన డీఎస్పీ ర్యాంకు అధికారుల నేతృత్వంలో విచారణ చేయాలని ఆదేశించింది. కనీసం ఐదుగురు అధికారులను డిప్యూటేషన్‌పై సీబీఐలోకి తీసుకోవాలని సూచించింది.ఈ అధికారులు సీబీఐ అడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తారని తెలిపింది.మాజీ డీజీపీ దత్తాత్రేయ పడ్సల్గికర్‌‌ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తారని వెల్లడించింది.

మరోవైపు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరాపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర సంస్థ ఉండాలని సీనియర్‌‌ లాయర్‌‌ ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చాలా  పరిణితి చెందిన స్థాయిలో దర్యాప్తు చేస్తోందని, కేసుల విభజనతో అఫిడవిట్‌ దాఖలు చేసిందని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల న్యాయవాది వాదిస్తూ, కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. మహిళలపై హింసకు సంబంధించి 16 ఎఫ్‌ఐఆర్‌‌లు నమోదయ్యాయని తెలిపారు. ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న బృందాలను ప్రభుత్వం సిట్‌లుగా పేర్కొంటున్నారని చెప్పింది. రాష్ట్ర కేడర్‌‌ అధికారుల దర్యాప్తు సరికాదని, ఇతర  రాష్ట్రాల అధికారులతో దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు కోర్టు స్పందిస్తూ, ముగ్గురు మహిళా మాజీ న్యాయమూర్తుతో కమిటీని ప్రకటించింది.