Operation Ajay: ఇజ్రాయిల్ లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక ఫ్లైట్

ఎక్కడ చూసినా సరే హింస కనిపిస్తోంది. ఇప్పటికీ రష్యా యుక్రేన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హమ్మస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడిని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ […]

Share:

ఎక్కడ చూసినా సరే హింస కనిపిస్తోంది. ఇప్పటికీ రష్యా యుక్రేన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హమ్మస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడిని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకమైన ఆపరేషన్ అజయ్(Operation Ajay) అనే పేరుతో ఇజ్రాయిల్ (Israel) లో చిక్కుకున్న భారతీయులను భారతదేశ తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

భారతీయులకు ప్రత్యేక ఫ్లైట్ (Flight): 

ఇజ్రాయెల్-హమాస్(Hamas) యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి విమానం ఈ రాత్రి టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరుతుంది. సహాయం కోరుతూ రాయబార కార్యాలయంలో నమోదు చేసుకున్న వారిలో, చాలా మంది ఇజ్రాయెల్ విద్యాసంస్థల్లో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. 

విదేశాంగ మంత్రిత్వ శాఖ టెల్ అవీవ్ నుండి ఢిల్లీకి చార్టర్డ్ విమానాన్ని నడుపుతుందని విద్యార్థులకు మెయిల్ ద్వారా సమాచారం అందించడం జరిగింది. ఈ విమానం ఈరోజు ఇజ్రాయెల్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 9 గంటలకు బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరుతుంది – భారతదేశం ఇజ్రాయెల్ కంటే రెండున్నర గంటలు ముందు ఉంటుంది. ఈ రాత్రి విమానంలో దాదాపు 230 మంది భారతీయులు ఎక్కుతారని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. భారతదేశానికి తిరిగి వచ్చే వారు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు..వారు తిరిగి రావడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.

భారతీయ విద్యార్థులకు పంపిన మెయిల్ లోని Google ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వారు నమోదు చేసుకున్నట్లు తిరిగి కన్ఫర్మేషన్ మెయిల్ అనేది అందుకుంటారు. ఒక చెక్-ఇన్ సామాన్లు మాత్రమే, 23 కిలోల కంటే ఎక్కువ బరువు లేనిది, ఒక క్యాబిన్ లగేజీ అనుమతించబడుతుందని మెయిల్ పేర్కొంది. అయితే ఈ ప్రత్యేకించి ఫ్లైట్(Flight) ద్వారా భారతీయులను ఇజ్రాయిల్(Israel) నుంచి భారతదేశ దేశానికి తీసుకువచ్చే ఆపరేషన్ అంటూ, దీనికి ఆపరేషన్ అజయ్(Operation Ajay) అంటూ పేరు పెట్టారు. దీని గురించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసామని, ముఖ్యంగా ప్రతి ఒక్కరిని సురక్షితంగా భారతదేశంలో తీసుకురావడమే ఆపరేషన్ అజయ్(Operation Ajay) ముఖ్య ఉద్దేశమని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 

హమ్మస్ దాడి: 

దశాబ్దాలుగా జరుగుతున్న సంఘర్షణ రక్తపాతంగా మారుతుంది.. కారణంగా హమాస్ భారీ రాకెట్లతో, ఇజ్రాయిల్ పై  (Israel) దాడిని చేపట్టింది, నివేదికలు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఎంతో మంది ఇజ్రాయెల్‌ వాసులు చనిపోగా సుమారు, 3,000 మందికి పైగా గాయపడ్డాయని పేర్కొంది. తీరప్రాంత ఎన్‌క్లేవ్‌పై తీవ్రమైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కారణంగా, పాలస్తీనియన్ల మరణాల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది, వేలాది మంది గాయపడ్డారని గాజా అధికారులు తెలిపారు.  లెబనాన్, ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో, ఇజ్రాయెల్ స్థానాలపై పెద్ద సంఖ్యలో ఫిరంగిల్లు, గైడెడ్ క్షిపణుల ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. హమాస్ ప్రారంభించిన దాడికి సంఘీభావంగా ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. 

ఎంతో మంది సైనికులు మరియు పౌరులను హమాస్ కిడ్నాప్ చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు విధ్వంసం చేసి ఇళ్లలోకి చొరబడ్డారని, పౌరులను ఊచకోత కోశారని.. వందలాది మంది దేశంపై దాడి చేశారని, ఇంకా వందల మంది ఇజ్రాయెల్ లోపల సైనికులతో పోరాడుతున్నారు అని ఆర్మీ ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. బందీలుగా ఉన్న అనేక మంది ఇజ్రాయిలీల ఫోటోలను ప్రస్తుతానికి హమాస్ విడుదల చేసింది.