సౌత్ కొరియా అమ్మాయి- భారతీయ అబ్బాయి ప్రేమ కథ

ఈమధ్య కాలంలో తమని ప్రేమించిన వారి కోసం దేశాలు దాటి వస్తున్నారు ప్రేమికులు. పెద్దలను ఎదిరించైనా సరే తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమ, ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్లిన అంజు దీనికి ఉదాహరణలు. ఇటీవల సౌత్ కొరియాలో పరిచయం అయిన ఇండియన్ యువకుడి కోసం సౌత్ కొరియా నుంచి యువకుడిని పెళ్లి చేసుకొనేందుకు వచ్చేస్తుంది యువతి. కాఫీ షాప్ లో తమ పరిచయాన్ని పెళ్లి తో ఒకటి చేసుకున్నారు ప్రేమికులు.  సౌత్ కొరియన్ […]

Share:

ఈమధ్య కాలంలో తమని ప్రేమించిన వారి కోసం దేశాలు దాటి వస్తున్నారు ప్రేమికులు. పెద్దలను ఎదిరించైనా సరే తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమ, ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్లిన అంజు దీనికి ఉదాహరణలు. ఇటీవల సౌత్ కొరియాలో పరిచయం అయిన ఇండియన్ యువకుడి కోసం సౌత్ కొరియా నుంచి యువకుడిని పెళ్లి చేసుకొనేందుకు వచ్చేస్తుంది యువతి. కాఫీ షాప్ లో తమ పరిచయాన్ని పెళ్లి తో ఒకటి చేసుకున్నారు ప్రేమికులు. 

సౌత్ కొరియన్ యువతి-ఇండియన్ యువకుడు: 

నాలుగు సంవత్సరాల క్రితం కాఫీ షాపులో పరిచయమైన సుఖిజిత్ సింగ్ అనే యువకుడిని పెళ్లి చేసుకొనేందుకు సౌత్ కొరియా నుంచి కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి ఉత్తరప్రదేశ్ కు చేరుకుంది యువతి. ఉత్తర ప్రదేశ్ కి చెందిన సుఖిజిత్ సింగ్ సౌత్ కొరియాలోని ఒక కాఫీ షాప్ లో పనిచేస్తూ ఉండగా పరిచయమైంది కిమ్. కిమ్ కూడా అదే కాఫీ షాప్ లో బిల్లింగ్ కౌంటర్ ఎగ్జిక్యూటివ్ గా జాయిన్ అవ్వడం జరిగింది. వారు సుమారు నాలుగు సంవత్సరాలు లివింగ్ రిలేషన్ షిప్ లో కొనసాగించారు. ఇటీవల తాను ఆరు నెలలకుగాను, సుఖిజిత్ సింగ్ ఇండియా రావాల్సి ఉండగా, తాను ఇండియా వచ్చిన రెండు నెలల తర్వాత తన గురించి సౌత్ కొరియా యువతి కిమ్ కూడా ఇండియా రావడం జరిగింది. 

తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించారు. సుఖిజిత్ సింగ్ ఒక సిక్ గనుక సిక్ సాంప్రదాయాల ప్రకారం లోకల్ గురుద్వారాలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సుఖిజిత్ సింగ్ తన పరిచయం పెళ్లి వరకు వెళ్లినందుకు సంతోషపడుతూ, తాను వివాహం చేసుకున్న కిమ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడం జరిగింది. సౌత్ కొరియా యువతి కిమ్ కూ తమ భారతీయ భాష రానప్పటికీ, తనకి పంజాబీ సాంప్రదాయాల పట్ల ఆసక్తి ఎంతగానో ఉంది అని, తను ఎక్కువగా పంజాబీ మ్యూజిక్ ఇష్టపడుతుంది అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా, తాము తిరిగి సౌత్ కొరియా వెళ్ళబోతున్నట్లు అక్కడే సెటిల్ అవ్వబోతున్నట్లు వెల్లడించాడు. 

ఇలాంటివి మరెన్నో బోర్డర్ ప్రేమ కథలు: 

ఇటీవల భారత దేశంలో దృష్టిని ఆకట్టిన జంట సిమా- సచిన్ కథ. పాకిస్తాన్ కి చెందిన మహిళ సీమ తన నలుగురు పిల్లలతో సహా నోయిడాలో ఇల్లీగల్గా ఉంటుంది. అయితే పబ్జి ద్వారా పరిచయమైన నోయిడా వ్యక్తి సచిన్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ మహిళకు ఆశ్రయం కల్పించాడు. మహిళతో 4 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం, పబ్జి ద్వారా పరిచయమే ఆ ఫేమను భారతదేశానికి రప్పించినట్లు వెల్లడించారు.  అంతేకాకుండా వారిద్దరూ కొన్ని రోజుల క్రితం ఆన్లైన్ గేమ్ ‘పబ్జి’ ద్వారా పరిచయమైనట్టు తెలిసింది. ప్రస్తుతం సీమ మరియు సచిన్ పెళ్లి బంధంతో ఒకటై, ప్రస్తుతం యూపీ లోని ఒక ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. 

అంజు-నస్రుల్లా:

34 ఏళ్ల అంజు అనే గృహిణి, జైపూర్ వెళ్తున్న అని తన భర్తకు చెప్పి, 29 సంవత్సరాల నస్రుల్లా అనే వ్యక్తిని కలవడానికి పాకిస్తాన్ బోర్డర్ దాటింది. అయితే ఆమె పాకిస్తాన్లో అడుగుపెట్టిన అనంతరం పాకిస్తాన్ పోలీస్ కస్టడీలో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తనకి లీగల్ గా పాస్పోర్ట్ కూడా ఉండడం వల్ల అక్కడ పాకిస్తాన్ పోలీసులు ఆమెను విడిచిపెట్టారు.  అంజు కలవడానికి వెళ్ళిన తన ప్రియుడు నస్రుల్లా వైద్య రంగంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇద్దరూ కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ఫేస్ బుక్ ఫ్లాట్ ఫామ్ ద్వారా పరిచయం అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల అంజు ఇస్లాం మతం తీసుకున్నందువలన పాకిస్తాన్ కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారి అంజు-నస్రుల్లా జంటకి ల్యాండ్ ని బహుమతిగా కూడా ఇచ్చారు.