బౌద్ధమత అమ్మాయిని లేపుకెళ్లిన‌ కొడుకు, తండ్రికి శిక్ష

ఓ వ్య‌క్తి బౌద్ధ‌మ‌త అమ్మాయితో పారిపోయి పెళ్లి చేసుకున్నందున, 74 ఏళ్ల ముస్లిం నాయకుడిని పార్టీ నుండి లడఖ్‌లోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) బహిష్కరించింది. షేక్ నజీర్ అహ్మద్‌ను బిజెపి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరించి, అంతేకాకుండా రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యతల నుండి షేక్ నజీర్ ను తొలగిస్తున్నట్లు, బిజెపి లడఖ్ యూనిట్ ఆగస్టు 16న విడుదల చేసిన అధికారిక నోటీసులో పేర్కొంది. తండ్రి ప్రమేయం ఉంది అంటున్న పార్టీ:  తన కొడుకు వేరే […]

Share:

ఓ వ్య‌క్తి బౌద్ధ‌మ‌త అమ్మాయితో పారిపోయి పెళ్లి చేసుకున్నందున, 74 ఏళ్ల ముస్లిం నాయకుడిని పార్టీ నుండి లడఖ్‌లోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) బహిష్కరించింది. షేక్ నజీర్ అహ్మద్‌ను బిజెపి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరించి, అంతేకాకుండా రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యతల నుండి షేక్ నజీర్ ను తొలగిస్తున్నట్లు, బిజెపి లడఖ్ యూనిట్ ఆగస్టు 16న విడుదల చేసిన అధికారిక నోటీసులో పేర్కొంది.

తండ్రి ప్రమేయం ఉంది అంటున్న పార్టీ: 

తన కొడుకు వేరే మత అమ్మాయిని పెళ్లి చేసుకునే విషయంలో, తండ్రిగా షేక్ నజీర్ అహ్మద్ ప్రమేయం ఉన్నందున అతనిపై చర్య తీసుకున్నట్లు, లడఖ్‌లోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్టీ తెలిపింది.

రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో కార్యనిర్వాహక సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు ఏర్పాటుచేసినట్లు.. తగినంత సమయం ఇచ్చిన బిజెపి లడఖ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ తన కుమారుడు మంజూర్ అహ్మద్ అదేవిధంగా బౌద్ధ మతానికి చెందిన అమ్మాయి పెళ్లికి సంబంధించిన సున్నితమైన అంశంలో తన ప్రమేయాన్ని స్పష్టం చేయడానికి అవకాశం కల్పించబడింది,అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

లడఖ్‌లోని అన్ని మత సంఘాలు ఈ సంఘటనను ఆమోదయోగ్యం కాదని, ఈ ప్రాంతంలో అన్ని మతాలు కలిసిమెలిసి గౌరవంగా ఉంటున్న క్రమంలో ఇటువంటి సంఘటన జరగడం, స్నేహ బంధాన్ని విడగొట్టినట్లు అవుతుందని బిజెపి పేర్కొంది. అందుకే వెంటనే నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు బిజెపి పేర్కొంది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నజీర్ అహ్మద్ను తన బాధ్యతల నుంచి తలగిస్తున్నట్లు పార్టీ తెలిపింది.

బీజేపీ కూడా ఈ చర్యను విస్తృతంగా ప్రసారం చేయాలని కోరింది. బహిష్కరణకు సంబంధించిన అధికారిక ప్రకటనను, తరుణ్ చుగ్ (జాతీయ ప్రధాన కార్యదర్శి), అశోక్ కౌల్ (జనరల్ సెక్రటరీ, J&K & లడఖ్) మరియు జమ్యాంగ్ నమ్‌గ్యాల్‌తో పాటు అగ్ర నాయకులతో పాటు “స్థానిక వార్తల బులెటిన్‌లో ప్రసారం కోసం” ఆల్ ఇండియా రేడియో/ దూరదర్శన్ పలు చానళ్లను లడక్ కు పిలవడం కూడా జరిగింది.

తన కుమారుడు వివాహానికి సంబంధించి మాట్లాడిన షేక్ నజీర్ అహ్మద్, ఈ ఘటనలో తన పాత్ర లేదని, పార్టీ వాదనల్లో వాస్తవం లేదని అన్నారు. “ఇది ఘోరమైన ఆరోపణ అని.. అసలు తన కుమారుడి పెళ్లి బంధువుల అమ్మాయితో పెళ్లిని ఫిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నందున.. ఈ ఘటన జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. తన కొడుకు పెళ్లి విషయం దాచి పెట్టి, ఇంటి నుండి పారిపోయిన తర్వాత ఆయన భార్య 2-3 సార్లు స్పృహతప్పి పడిపోయింది అని కూడా అహ్మద్ చెప్పాడు. 

తన కొడుకు తనకి చెప్పకుండా వేరే మతస్తురాలిని పెళ్లి చేసుకోవడంలో తనకి ప్రమేయం లేదని, తన కొడుకు చేసిన తప్పుకి పార్టీ తనని శిక్షించడం సవ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఆయనపై చర్యలు తీసుకుని ఉండవచ్చని అహ్మద్ అన్నారు. నిజానికి, లడఖ్‌లో బీజేపీని గణించే శక్తిగా మార్చేందుకు తాను చాలా కష్టపడ్డానని, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్-లే ఎన్నికల్లో విజయం సాధించానని అహ్మద్ అన్నారు. టర్టుక్ మరియు హండర్ స్థానాల్లో పార్టీ విజయాన్ని తీసుకువచ్చింది తానే అని అని అతను చెప్పాడు. యూటీ హజ్ కమిటీలో సభ్యునిగా నియమితులైనందున, గత ఏడాది తనకు పార్టీ బహుమానం ఇచ్చిందని అహ్మద్ తెలిపారు. నవంబర్ 2022లో, అప్పటి లడఖ్ LG R.K. మాథుర్ అహ్మద్‌ను కమిటీ సభ్యుడిగా నియమించారు. ఇంద్రేష్ కుమార్ నేతృత్వంలోని ఆర్‌ఎస్‌ఎస్-సంబంధిత ముస్లిం రాష్ట్రీయ మంచ్‌తో కూడా అహ్మద్‌కు సంబంధం ఉంది.