వినియోగ‌దారుల‌కు బిల్లులు ఇవ్వ‌ని డీలర్లు

లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తృణ ధాన్యాలు మరియు పప్పుల డీలర్లపై ఇన్స్పెక్షన్ నిర్వహించింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా చాలామంది డీలర్స్ కన్జ్యూమర్లకి బిల్స్ పాస్ చేయట్లేదని తెలిపింది. అంతేకాకుండా కన్జ్యూమర్లు తప్పకుండా బిల్ డీలర్ల దగ్గర నుంచి తీసుకోవాలని సూచించింది. బిల్లు ఎందుకు తీసుకోవాలి?: లీగల్ మెట్రాలజీ అథారిటీస్ డీలర్ దగ్గర నుంచి బిల్స్ తీసుకోవాలని లేదంటే క్వాలిటీ విషయంలో గాని క్వాంటిటీ విషయంలో గాని తేడాలు వస్తాయని చెప్పింది. ప్రతి కొనుగోలు పై డీలర్స్ […]

Share:

లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తృణ ధాన్యాలు మరియు పప్పుల డీలర్లపై ఇన్స్పెక్షన్ నిర్వహించింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా చాలామంది డీలర్స్ కన్జ్యూమర్లకి బిల్స్ పాస్ చేయట్లేదని తెలిపింది. అంతేకాకుండా కన్జ్యూమర్లు తప్పకుండా బిల్ డీలర్ల దగ్గర నుంచి తీసుకోవాలని సూచించింది.

బిల్లు ఎందుకు తీసుకోవాలి?:

లీగల్ మెట్రాలజీ అథారిటీస్ డీలర్ దగ్గర నుంచి బిల్స్ తీసుకోవాలని లేదంటే క్వాలిటీ విషయంలో గాని క్వాంటిటీ విషయంలో గాని తేడాలు వస్తాయని చెప్పింది. ప్రతి కొనుగోలు పై డీలర్స్ అవగాహన చేసుకోవాలని చెప్పింది. ప్రతి బిల్లు లోని జిఎస్టి  చాలా స్పష్టంగా ఉండాలని చెప్పింది.

లీగల్ అథారిటీస్ బియ్యం సంచులు 5, 20 మొదలగు,25 కేజీల బ్యాగులను జీఎస్టీ బిల్స్ మరియు వాటికి సంబంధించిన ఇతర బిల్స్న్ కూడా తనిఖీ చేశారు. లీగల్ అథారిటీస్ అధికారులు హోల్సేల్ వస్తువులను వాటి బిల్స్ చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే 25 కేజీలు పైపడిన బస్తాల మీద జిఎస్టి వేసి ఉన్న బిల్స్ కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే నార్మల్ గా 25 కేజీల బ్యాగులకు జిఎస్టి వేయకూడదని అధికారులు తెలియజేశారు. అందుకే కన్జ్యూమర్లు బిల్స్ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, బిల్స్ తప్పకుండా తీసుకోవాలని సూచించారు అధికారులు.

చాలా కాలంగా డీలర్స్ కన్జ్యూమర్లకి బిల్స్ ఇవ్వట్లేదని దానివల్ల లెక్కలు సరిగ్గా తెలియడం లేదని జీఎస్టీ కి సంబంధించిన వివరాలేవీ వాళ్ళు చెప్పట్లేదని కన్జ్యూమర్లు చెప్పారు. అలా చేయడం వల్ల నాణ్యత మరియు పరిమాణం గుర్తించబడదు. డీలర్స్ నుంచి అందే ప్రతి వస్తువు పై జిఎస్టి ఎంత నమోదు అవుతుందో గుర్తించాలి మరియు డీలర్ కు సంబంధించిన చిరునామా మరియు ఇతర వివరాలు తీసుకోవాలి లేదంటే ఇబ్బందుల్లో పడతారని అధికారులు చెప్పారు.

హోల్సేల్ మార్కెట్లో బియ్యం బస్తాలు మరియు ఇతర సరుకులు చాలా ఎక్కువ పరిమాణంలో దిగుమతి అవుతాయి. కొంతమంది కన్ఫ్యూమర్లు దిగుమతి అయిన సరుకుల మీద సరిగ్గా జీఎస్టీ ఉందో లేదో పట్టించుకోరు దానివల్ల కన్ఫ్యూమర్స్ నష్టపోయే అవకాశం ఉంది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం 25 కిలోల రైస్ బ్యాగ్ కు జిఎస్టి అక్కర్లేదని కానీ వాటి మీద కూడా జీఎస్టీ జత చేస్తున్నారని అధికారులు తెలిపారు.

తాజాగా లీగల్ అధికారులు జరిపిన ఇన్స్పెక్షన్ లో తృణధాన్యాలు మరియు పప్పులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చాలా వివరాలు కన్జ్యూమర్స్ కి జీఎస్టీ గురించి వివరంగా తెలియపరిచారు. వారు డీలర్స్ దగ్గర నుంచి తీసుకున్న బిల్స్ పై చాలా లోటు పాట్లు ఉన్నాయని తెలిపారు. 

కంజ్యూమర్లకే కాదు కస్టమర్లు కూడా జాగ్రత్త: 

అయితే ప్రస్తుతానికి డీలర్ల దగ్గర నుంచి కన్జ్యూమర్లుకు అందుతున్న బిల్స్ లో అవకతవకలు జరిగినట్టు అధికారులు స్పష్టంగా చూశారు. అయితే ప్రస్తుతానికి 25 కేజీల పైబడిన బియ్యం బస్తాల పైన తృణధాన్యాల పైన జిఎస్టి అనేది ఉండదు అని స్పష్టం చేశారు. అయితే ఇటువంటి జాగ్రత్తలు కన్జ్యూమర్లకే కాకుండా కస్టమర్లకు కూడా వర్తిస్తుంది అని చెప్తున్నారు. కస్టమర్లు కూడా జిఎస్టి మీద ఒక కన్ను వేసి ఉంచాలని, ఏ ఏ వస్తువుల మీద ఎంత జిఎస్టి అనేది ఉండాలి ఏ వస్తువుల మీద జిఎస్టి ఉండదు అనేది స్పష్టంగా తెలుసుకోవాలన్నారు. లేదంటే కొనుగోలు చేసేటప్పుడు నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు అధికారులు.