సెలవుపై ఇంటికొచ్చిన జవాన్‌ మిస్సింగ్

నిత్యం కాల్పులతో దద్దరిల్లుతున్న జమ్మూకాశ్మీర్‌‌లో కలకలం రేగింది. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకుందామని డ్యూటీకి సెలవు పెట్టి ఓ జవాన్‌ ఇంటికి వచ్చాడు. మరో రెండ్రోజుల్లో డ్యూటీలో జాయిన్‌ కావాల్సి ఉండగా, ఇంట్లో సరుకులను తెచ్చేందుకు దగ్గరున్న మార్కెట్‌కు వెళ్లి, అదృశ్యమయ్యాడు. విషయం తెలుసుకున్న కాశ్మీర్‌‌ పోలీసులు వెంటనే సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలు పెట్టారు.  ఈ ఘటన దక్షిణ కాశ్మీర్‌‌లోని కుల్గాం జిల్లాలో జరిగింది. రైఫిల్‌ మ్యాన్‌ జావేద్ అహ్మద్‌ (25) జమ్మూకాశ్మీర్‌ ‌ […]

Share:

నిత్యం కాల్పులతో దద్దరిల్లుతున్న జమ్మూకాశ్మీర్‌‌లో కలకలం రేగింది. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకుందామని డ్యూటీకి సెలవు పెట్టి ఓ జవాన్‌ ఇంటికి వచ్చాడు. మరో రెండ్రోజుల్లో డ్యూటీలో జాయిన్‌ కావాల్సి ఉండగా, ఇంట్లో సరుకులను తెచ్చేందుకు దగ్గరున్న మార్కెట్‌కు వెళ్లి, అదృశ్యమయ్యాడు. విషయం తెలుసుకున్న కాశ్మీర్‌‌ పోలీసులు వెంటనే సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలు పెట్టారు. 

ఈ ఘటన దక్షిణ కాశ్మీర్‌‌లోని కుల్గాం జిల్లాలో జరిగింది. రైఫిల్‌ మ్యాన్‌ జావేద్ అహ్మద్‌ (25) జమ్మూకాశ్మీర్‌ ‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లో జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఈద్‌ సందర్భంగా సెలవుపై ఇంటికి వచ్చాడు. తిరిగి సోమవారం డ్యూటీలో చేరాల్సి ఉంది.

అయితే, శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంట్లోకి సామాన్లు తీసుకురావడానికి దగ్గర్లోని మార్కెట్‌కు తన ఆల్టో కారులో వెళ్లాడు. మార్కెట్‌ అంతా తిరిగి ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ కొన్నాడు. అయితే, రాత్రి 9 గంటలు  అవుతున్నా జావేద్‌ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని తల్లిదండ్రులు కంగారుపడ్డారు. వెంటనే మార్కెట్‌కు వెళ్లి వెతికారు. అక్కడ జావేద్ కనిపించలేదు. అతను వేసుకొచ్చిన ఆల్టో కారు మాత్రం మార్కెట్‌ సమీపంలో పార్క్‌ చేసి ఉండటాన్ని గమనించారు. వెంటనే కారులో వెళ్లి చూడగా జావేద్‌ లేడు. కానీ, కారులో రక్తపు మరకలను గుర్తించారు. ఆ తర్వాత జావేద్‌ తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది వెంటనే భారీ సెర్చ్‌ ఆపరేషన్‌  మొదలు పెట్టారు. మార్కెట్‌ సమీపంలో, చుట్టు పక్కల అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ప్రస్తుతం సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుంది. కాగా, కాశ్మీర్‌‌ పోలీసులు ఇప్పటికే కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. స్థానికులను కూడా అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. 

జావేద్‌ కిడ్నాప్‌ అయ్యాడు అన్న విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ కొడుకును కాపాడాలంటూ భద్రతా సిబ్బందిని వేడుకుంటున్నారు. జావేద్‌ను కొట్టి, టెర్రరిస్టులే కిడ్నాప్‌ చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. మీకు దండం పెడతామని, తమ కొడుకును ప్రాణాలతో విడిచి పెట్టాలని టెర్రరిస్టులను ఆ తల్లిదండ్రులు కన్నీళ్లతో కోరుతున్నారు. 

టెర్రరిస్టులు జావేద్‌ను కొట్టి కిడ్నాప్‌ చేసి ఉంటారని భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు. జావేద్‌ను ప్రాణాలతో తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. సెర్చ్ ఆపరేషన్ భారీగా జరుగుతోందని, మార్కెట్‌ పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని చెప్పారు. జావేద్‌ను కిడ్నాప్‌ చేసిన వారిని అదుపులోకి తీసుకొని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, జావేద్‌ను చంపేశారా.. లేక బందీగా ఉంచారా అనే వివరాలు ఇంకా తెలియడం లేదని చెబుతున్నారు.జావేద్‌ను టెర్రరిస్టులే కిడ్నాప్‌ చేశారా, లేదా మరేదైనా ఉందా అనే కోణంలోను కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు.

కాగా, గతంలో కూడా సెలవులపై ఇంటికి వచ్చిన పలువురు జవాన్లను టెర్రరిస్టులు కిడ్నాప్‌ చేసి, హతమార్చిన ఘటనలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అంతే కాకుండా భారత్ సైనికులను వలలో వేసుకోవడానికి వారి నుండి దేశ రహస్యాలను తెలుసుకోవడానికి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఆప్స్ ద్వారా పాకిస్తాన్ అమ్మాయిలను ఉసిగొలుపుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడడం కొత్తేమీ కాదు. అయితే జావేద్ విషయంలో ఇలాంటి కోణం ఏమీ లేకపోయినా అన్ని వైపుల నుండి దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. జావేద్ గురించి అతని కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతున్నారు.