Social media: వరుడు కావలెను.. కానీ రీల్స్ చేయడం తెలిస్తేనే..

సోషల్ మీడియా (Social media) ప్రభావం ప్రజల మీద ఎంత ఉందో ఈ వార్త చదివితే మీకే అర్థమవుతుంది. రోజుకు 24 గంటల్లో ఎంతసేప పడుకుంటారో తెలిదుగాని ఎక్కువ శాతం ప్రజలు సోషల్ మీడియాలో (Social media)నే గడుపుతున్నట్లు రీసెర్చ్ లు చెప్తున్నాయి. ఎక్కువ మంది తమ మొబైల్ లోని వీడియోలు తీసి, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో (Social media) అప్లోడ్ చేయడం సాంప్రదాయంగా మారిపోతున్న వైనం కనిపిస్తోంది. ఇప్పుడు పెళ్లి (Marriage) విషయంలో కూడా […]

Share:

సోషల్ మీడియా (Social media) ప్రభావం ప్రజల మీద ఎంత ఉందో ఈ వార్త చదివితే మీకే అర్థమవుతుంది. రోజుకు 24 గంటల్లో ఎంతసేప పడుకుంటారో తెలిదుగాని ఎక్కువ శాతం ప్రజలు సోషల్ మీడియాలో (Social media)నే గడుపుతున్నట్లు రీసెర్చ్ లు చెప్తున్నాయి. ఎక్కువ మంది తమ మొబైల్ లోని వీడియోలు తీసి, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో (Social media) అప్లోడ్ చేయడం సాంప్రదాయంగా మారిపోతున్న వైనం కనిపిస్తోంది. ఇప్పుడు పెళ్లి (Marriage) విషయంలో కూడా సోషల్ మీడియా ఇన్వాల్వ్ అవ్వడం, దాని ప్రభావం కనిపించడం జరుగుతుంది. 

కానీ రీల్స్ చేయడం తెలిస్తేనే..: 

జీవిత భాగస్వామి (Partner)ని ఎన్నుకునే విషయంలో ఒకప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చాలా సందర్భాలలో విద్య, రూపం, గుణాలు చూస్తూ రావడం జరిగింది. అంతేకాకుండా కొన్ని మ్యాట్రిమోనీ ఆప్స్ ద్వారా పెళ్లిళ్లు (Marriage) జరుగుతున్న యుగంలో ఉన్నాము. అయితే ఇప్పుడు మరింత ముందుకు దూసుకుపోతున్న యువతరం (Youth) ప్రత్యేక కోణంలో ఆలోచిస్తున్న వైనం కనిపిస్తోంది. ప్రతిరోజు ఇంస్టాగ్రామ్ (Instagram) లో తప్పకుండా రీల్స్ (Reels) చేయడం మర్చిపోవట్లేదు. యువతరం (Youth) ఎక్కువ శాతం ఫోటోలు దిగుతూ రీల్స్ (Reels) చేస్తూ సోషల్ మీడియాలో (Social media) తమదైన శైలిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఆక్టివ్ గా ఉంటున్నారు. అయితే ఇటీవల instagram లో రియా (Riya) అనే ఒక యువతి తనకు కాబోయే భర్త (Partner) గురించి ఎటువంటి అంశాలను ముందుకు తీసుకు వచ్చిందో చూసి సోషల్ మీడియాలో (Social media) ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

రియా (Riya) అనే యువతి తాను పెళ్లి (Marriage) చేసుకోవడానికి వరుడు అదే విధంగా ఇంస్టాగ్రామ్ (Instagram) రీల్ పార్ట్నర్ కావాలని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో (Social media) పెట్టింది. అంతేకాకుండా రీల్స్ (Reels) చేయడానికి కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడని వ్యక్తిని మాత్రమే తాను ఎన్నుకుంటానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనతో కలిసి రీల్ (Reel) చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించే వ్యక్తిని సెలెక్ట్ (Select) చేసుకుంటానని చెప్పింది. ట్రెండింగ్ లో ఉండే కొన్ని సాంగ్స్ యూస్ చేసి ఇంస్టాగ్రా రీల్స్ (Reels) చేయడం ఎలాగో తనకి తెలిసి ఉండే పార్ట్నర్ కోరుకుంటున్నాట్లు రియా (Riya) వెల్లడించింది. అయితే తన కాబోయే భర్త (Partner) జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడై ఉండకూడదని కచ్చితంగా చెప్పింది. జిమెయిల్ అడ్రస్ ఇచ్చి, కాంటాక్ట్ చేయమని చెప్పింది. అయితే కాంటాక్ట్ చేసే ముందు ఎవరైతే కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా అమెజాన్ మినీ టీవీలో హాఫ్ లవ్ ఆఫ్ అరేంజ్డ్ అనే సినిమా (Cinema)ను తప్పకుండా చూసి రావాలని వెల్లడించింది. అంతేకాకుండా అందులో చూపించిన అబ్బాయిల విధంగా ఉన్న వాళ్ళని తాను సెలెక్ట్ (Select) చేసుకోనని చెప్పేస్తుంది. మరి ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ (Instagram) రీల్స్ (Reels) చేసిన తర్వాత తప్పకుండా వాటిని ఎడిట్ చేయడం కూడా తెలిసిన వ్యక్తిని ఎన్నుకోవడానికి రియా (Riya) మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదంతా చదివిన సోషల్ మీడియా (Social media) యూజర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. అసలు మనం ఇప్పుడు ఎటు పోతున్నామని ఆలోచనలు చేస్తున్నారు. ముఖ్యంగా రియా (Riya) అనే అమ్మాయి ఎడిటర్ ని పెళ్లి (Marriage) చేసుకోబోతుందా! లేకపోతే లైఫ్ పార్ట్నర్ ని ఎన్నుకోబోతోందా! అనే కన్ఫ్యూజన్లో పడ్డారు. దీన్నే రిల్-లేషన్ షిప్ గోల్స్ అంటారని కొందరు, మరికొందరు ఇప్పుడు జనరేషన్ ఎలా మారుతుందో అర్థం కావట్లేదని, మరికొందరు కామెంట్లు (Comments) వర్షం కురిపిస్తున్నారు