చంద్ర‌బాబు సీఎం అయిన రెండు నెల‌ల్లోనే స్కాం

ఎన్నికలు దగ్గర పడుతున్న చంద్రబాబు నాయుడు పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అధికార పార్టీ మీద బురద జల్లే క్రమంలో ఎలెక్షన్ కమిషన్ కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఇటీవల చంద్రబాబు నాయుడుకి ఐటీ శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఇవన్నీ ఇలా ఉండగా నిన్నటి రోజున, సిఐడి చేసిన ఇన్వెస్టిగేషన్ ద్వారా,  ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద 371కోట్లు స్కామ్ జరిగినట్లు గుర్తించారు.  […]

Share:

ఎన్నికలు దగ్గర పడుతున్న చంద్రబాబు నాయుడు పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అధికార పార్టీ మీద బురద జల్లే క్రమంలో ఎలెక్షన్ కమిషన్ కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఇటీవల చంద్రబాబు నాయుడుకి ఐటీ శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఇవన్నీ ఇలా ఉండగా నిన్నటి రోజున, సిఐడి చేసిన ఇన్వెస్టిగేషన్ ద్వారా,  ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద 371కోట్లు స్కామ్ జరిగినట్లు గుర్తించారు.  ఈ మేరకు సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం జరిగింది. 

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్:

అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ను రాష్ట్రంలోని అవినీతి నిరోధక బ్యూరో ఏసీబీ ద్వారా జూన్ 2018లోనే వెలుగులోకి వచ్చింది. కాకపోతే అది ఇంకా ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉన్నందు కారణంగా, సాక్ష్యాల కోసం వేచి చూశారు అధికారులు.  నిజానికి ప్రభుత్వ నిధులలో సుమారు, 371  కోట్ల కుంభకోణం స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద జరిగినట్లు వెల్లడించారు సిఐడి.  ఇంకా చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టుకొని, కాంట్రాక్టులు తారుమారు చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, వంటి అనేక అవకతవకలు జరిగినట్లు సిబిఐ వెల్లడించింది. 

 2018లోనే వెలుగులోకి వచ్చిన ఈ స్కామ్ గురించి,  జగన్మోహన్ రెడ్డి తన  ఏపీ ముఖ్యమంత్రి బాధ్యతలు  తీసుకున్న తర్వాత  మరింత దృష్టి పెట్టారు అని తెలుస్తోంది. జిఎస్‌టి, ఇంటెలిజెన్స్, ఐటి, ఇడి, సెబి వంటి ప్రభుత్వ ఏజెన్సీలు ఈ స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు చేశాయి. విదేశాల్లో దోచుకున్న నిధులను అధికారులు విజయవంతంగా స్వదేశానికి రప్పించినట్లు వెల్లడించారు. 

అంతేకాకుండా ఇటీవల అందిన ఐటీ నోటీసులు ఆధారంగా ముందుగానే చంద్రబాబు నాయుడు,  నిధులను జాగ్రత్త పరిచేందుకు కొన్ని ప్రణాళికలు వేసినట్లు కూడా ఆరోపించారు అధికారులు.  అంతేకాకుండా,  ఐటీ నోటీసులు అందిన అనంతరం,  సుమారు 70 ట్రాన్సాక్షన్స్ చంద్రబాబు తరుపు నుంచి జరిగినట్లు వెల్లడించారు అధికారులు. 

 స్కామ్ లో ఇంకెవరు ఉన్నారు:

ఈ భారీ కుంభకోణానికి పాల్పడిన ప్రముఖులను ఇటీవలే ED దాడులు చేసి అరెస్టు చేసింది. సీమెన్స్ ఇండియా సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వికాస్ వినాయక్ ఖాన్విల్కర్, మాజీ ఆర్థిక సలహాదారు ముకుల్ చంద్ర అగర్వాల్‌లను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో స్కిల్లర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సురేష్ గోయల్ కూడా ఉన్నారు. వీరి మీద నిధుల దుర్వినియోగం మరియు మనీలాండరింగ్ కేసు నమోదు  చేయడం, నయీంను కూడా అరెస్ట్ చేయడం జరిగింది, దర్యాప్తు పురోగతిలో ఉంది. 

ఇటీవల చంద్రబాబుకి అందిన ఐటీ నోటీసులు:

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కి ఇటీవల ఇన్కమ్ టాక్స్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు తమ దగ్గర సరైన ఆధారాలు ఉండడం వల్లే ఆయనకి నోటీసులు జారీ చేసామని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అతనికి అనధికారికంగా ఎంతో డబ్బు వచ్చి పడుతోందని, బోగస్ సబ్ కాంట్రాక్టు ద్వారా కూడా ఆయనకి ఆదాయం వస్తుందని ఐటీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆయనకి ఐటి నోటీసులు జారీ చేయడం జరిగిందని స్పష్టం చేసింది ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్. 

ఫేక్ సబ్-కాంట్రాక్టర్ కంపెనీల ద్వారా అక్రమంగా ఆదాయం సంపాదించేందుకు SPCL ద్వారా నిధులను స్వాహా చేసేందుకు బోగస్ కాంటాక్ట్‌లు, అదేవిధంగా వర్క్ ఆర్డర్‌లను ఏర్పాటు చేసినట్లు పర్దాసాని అంగీకరించాడని, అంతేకాకుండా ప్రస్తుతం పార్దాసానీ నుంచి అదే విధంగా అతని సహచరుల నుండి అనేక నేరారోపణలు, చాట్‌లు మరియు ఎక్సెల్ షీట్‌లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు, ఐటీ శాఖ జారీ చేసిన షోకాజ్ నోటీసులో పేర్కొంది. నాయుడుకు నగదు బట్వాడా చేయడంతో పాటు, ప్రధాన మౌలిక సదుపాయాలు అనేవి అనేక సంస్థల ద్వారా నిధులు ఎలా స్వాహా చేశారు.. ఇంకా ఆధారాన్ని ఎలా ఉత్పత్తి చేస్తున్నారో కూడా స్పష్టంగా నోటీసులో పేర్కొనడం జరిగింది.