‘సింగం’ వంటి సినిమాలు అందిస్తున్న మెసేజ్ ఏంటి?

ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ వారు అన్యువల్ డే సందర్భంగా ఆర్గనైజ్ చేసిన ఫంక్షన్ లో ఇటీవల బొంబాయి హైకోర్టు జస్టిస్ గౌతమ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ముఖ్యంగా సినిమాల గురించి సినిమాలు అందించే సందేశం గురించి గౌతమ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  గౌతమ్ పటేల్ వాఖ్యలు:  సినిమాలో కనిపించే పోలీస్ హీరోఇజం చూపించి, పోలీస్ నటనను ఘనపరిచే సినిమాలు ఎన్నో వచ్చాయి ఇండస్ట్రీలో. అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచిన సింగం మూవీ గురించి […]

Share:

ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ వారు అన్యువల్ డే సందర్భంగా ఆర్గనైజ్ చేసిన ఫంక్షన్ లో ఇటీవల బొంబాయి హైకోర్టు జస్టిస్ గౌతమ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ముఖ్యంగా సినిమాల గురించి సినిమాలు అందించే సందేశం గురించి గౌతమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

గౌతమ్ పటేల్ వాఖ్యలు: 

సినిమాలో కనిపించే పోలీస్ హీరోఇజం చూపించి, పోలీస్ నటనను ఘనపరిచే సినిమాలు ఎన్నో వచ్చాయి ఇండస్ట్రీలో. అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచిన సింగం మూవీ గురించి ఇటీవల జస్టిస్ గౌతమ్ పటేల్ మాట్లాడిన వాక్యాలు చర్చనీయంగా మారింది. ముఖ్యంగా సింగం వంటి సినిమాల సమాజానికి ఎటువంటి మెసేజ్ అందిస్తున్నారు అంటూ ప్రస్తావించారు. 

నిజానికి సింగం మూవీ ఒక హానికరమైన సందేశాన్ని సమాజానికి అందిస్తుంది అంటూ గౌతం పటేల్ మాట్లాడారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ, పోలీస్ శాఖలో ఉన్నవారికి అసహనం, ఆవేశం మాత్రమే ఉన్నట్టు చూపించడమే కాకుండా.. ముఖ్యంగా చట్టాన్ని పక్కనపెట్టి సినిమాలో అసహనాన్ని ప్రదర్శించిన తీరు గురించి కూడా ప్రస్తావించారు జస్టిస్ గౌతమ్ పటేల్. 

సంస్కరించుకోవాలి అంటున్న న్యాయమూర్తి: 

పోలీసు సంస్కరణల గురించి మాట్లాడుతూ, ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు విషయంలో నిజానికి అవకాశం తప్పిపోయింది అని న్యాయమూర్తి అన్నారు, అలాగే మనల్ని మనం సంస్కరించుకుంటే తప్ప చట్టాన్ని అమలు చేసే యంత్రాంగాన్ని సంస్కరించలేమని కూడా పేర్కొన్నారు గౌతమ్ పటేల్.

‘రౌడీలు, అవినీతిపరులు, జవాబుదారీతనం లేని’ పోలీసుల చిత్రాలు నిజంగా ప్రజలలో ఎక్కువగా ఆకర్షణకు గురయ్యే చిత్రాలు.. అంటూ మరొకసారి గుర్తు చేశారు న్యాయమూర్తి. అయితే సినిమాలు చూపించే ప్రకారం, కోర్టులు తమ పని చేయడం లేదని ప్రజలు భావించినప్పుడు, పోలీసులు అడుగుపెట్టినప్పుడు సంబరాలు చేసుకుంటారని న్యాయమూర్తి అన్నారు.

అయితే నిజానికి రేప్ చేసిన నిందితులు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్‌కౌంటర్‌లో నిందితుడిని చంపేసినప్పుడు, ప్రజలు అది పర్వాలేదని భావిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి సంఘటనలలో ఒకరిని పారిపోతున్నప్పుడు ఎన్కౌంటర్ చేశామని ఆరోపణ చేయడం ద్వారా న్యాయం జరిగిందా అంటూ జస్టిస్ ప్రశ్నించారు. నిజానికి ఇటువంటి ధోరణి, ఫిలిం ఇండస్ట్రీ తీసిన కొన్ని చిత్రాలు కారణంగా జనాలలో పాతుకుపోయింది అంటూ జస్టిస్ పటేల్ పేర్కొన్నారు.

కోర్టులను సినిమాల్లో వేరే కోణంలో చూపిస్తారు: 

అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ, నిజానికి చాలా సినిమాల్లో, న్యాయమూర్తులపై పోలీసులు దౌర్జన్యంగా ఉండడం, న్యాయమూర్తులు పిరికివారిగా, మందపాటి కళ్లద్దాలు ధరించి, తరచుగా అనఫిషియల్ బట్టలు వేసుకుని కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా దోషులను విడిచిపెడతారని, పోలీసులు కోర్టులను నిందిస్తారు. హీరో పోలీసు ఒంటరిగా న్యాయం చేస్తాడు అని పటేల్ చెప్పుకొచ్చారు. 

సింగం సినిమా ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ పోషించిన రాజకీయ నాయకుడిపై, మొత్తం పోలీసు బలగాలు దిగి.. ఇప్పుడు న్యాయం జరిగిందని చూపించడం జరుగుతుంది. కానీ నిజంగా అక్కడ న్యాయం ఉందా అని జస్టిస్ పటేల్ ప్రశ్నించారు. ఆ సందేశం ఎంత ప్రమాదకరమైనది అని ఆలోచించాలని.. ‘ఎందుకు ఈ అసహనం? మనం అపరాధాన్ని నిరూపితం చేసే ప్రాసెస్ ద్వారా వెళ్ళాలి.. అవును అందరూ అనుకున్నట్లే ఈ ప్రాసెస్ నిజానికి నెమ్మదిగా జరగడం నిజమే.. కానీ ఇటువంటి ప్రాసెస్ ఇలాగే జరగాలి.. ఎందుకంటే ఒక వ్యక్తికి స్వేచ్ఛను లాక్కోకూడదు అనే ఉద్దేశం ఇందులో ఉంటుందని’ మరోసారి గుర్తు చేశారు జస్టిస్ గౌతమ్ పటేల్.

పోలీసు యంత్రాంగం పనితీరులో సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన ఉత్తరప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ సింగ్‌కు నమస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. .