సిక్కింలో వరద బీభత్సం

ప్రతి ఏటా సిక్కింలో వరదల బీభత్సం తప్పట్లేదు. అధిక వర్షపాతం కారణంగా సిక్కిం లో అనేక ప్రాంతాలు నీటి మునగాయి. వరద బీభత్సం కారణంగా ఇప్పటికే 14 మంది చనిపోగా, 100 మంది ఆచూకీ గల్లంతయింది. సిక్కిం చూసేందుకు అక్కడికి వెళ్లిన 3,000 మంది టూరిస్టులు అక్కడే చిక్కుకున్నారు.  సిక్కింలో వరద బీభత్సం :  సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 14కి పెరిగిందని, 100 మందికి పైగా గల్లంతయ్యారని రాష్ట్ర ప్రభుత్వం గురువారం […]

Share:

ప్రతి ఏటా సిక్కింలో వరదల బీభత్సం తప్పట్లేదు. అధిక వర్షపాతం కారణంగా సిక్కిం లో అనేక ప్రాంతాలు నీటి మునగాయి. వరద బీభత్సం కారణంగా ఇప్పటికే 14 మంది చనిపోగా, 100 మంది ఆచూకీ గల్లంతయింది. సిక్కిం చూసేందుకు అక్కడికి వెళ్లిన 3,000 మంది టూరిస్టులు అక్కడే చిక్కుకున్నారు. 

సిక్కింలో వరద బీభత్సం : 

సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 14కి పెరిగిందని, 100 మందికి పైగా గల్లంతయ్యారని రాష్ట్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. తప్పిపోయిన 102 మందిలో 22 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు, ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు మీదగా కురిసిన బీభత్సమైన వర్షపాతం వల్ల సంభవించిన ఆకస్మిక వరద కారణంగా 26 మంది గాయపడి చికిత్సపొందుతున్నారు.

బాధిత ప్రాంతాలకు అత్యవసర సేవలను అందుబాటులో ఉంచారు, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రజలకు సూచించారు. సిక్కిం ప్రభుత్వం సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా జారీ చేసింది. 03592-202892 – ల్యాండ్‌లైన్; 03592-221152 – ల్యాండ్‌లైన్; 8001763383 – మొబైల్; 03592-202042 – ఫ్యాక్స్; లేదా అత్యవసర సహాయం కోసం ‘112’కి కాల్ చేయండి. 

సైనిక సహాయం: 

భారత సైన్యం తన సొంత సైనికులతో సహా, సిక్కింలో తప్పిపోయిన వ్యక్తుల కుటుంబాల కోసం మూడు హెల్ప్‌లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తర సిక్కింలో సహాయం కోసం, ప్రజలు 8750887741కి డయల్ చేయచ్చు; తూర్పు సిక్కిం – 8756991895. తప్పిపోయిన 22 మంది సైనికులకు సంబంధించిన వివరాలు కోసం హెల్ప్‌లైన్ నంబర్ 7588302011. విపత్తు తర్వాత తప్పిపోయిన వారిలో అదే విధంగా గాయపడిన వ్యక్తులలో, అనేక మంది నివాసితులు, అక్కడ మంగన్ జిల్లాలోని చుంగ్తాంగ్, అలాగే గాంగ్టక్ జిల్లాలోని డిక్చు మరియు సింగ్టామ్, పాక్యోంగ్ జిల్లాలోని రంగ్పోకు చెందినవారు. పరిస్థితిని సమీక్షించిన తర్వాత, చుంగ్తాంగ్ ఆనకట్ట స్వరంగంలో చిక్కుకుపోయిన ప్రజలను, పర్యాటకులను సురక్షితంగా కాపాడి తరలించడానికి ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టవచ్చని క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా బుధవారం ఆదేశించారు. కొనసాగుతున్న వరద కారణంగా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 3,000 మందికి పైగా పర్యాటకులు రాష్ట్రంలో చిక్కుకుపోయారని సిక్కిం చీఫ్ సెక్రటరీ వీబీ పాఠక్ తెలిపారు.

తీస్తా నది ఒడ్డున ఉన్న రంగ్‌పోకు దగ్గరలో ఉన్న ఉన్న ఇండస్ట్రియల్ బెల్ట్ (IBM)లో 150కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి, తీవ్ర వర్షపాతం వల్ల అపారమైన నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సింగ్‌టామ్, రంగ్‌పో, డిక్చు మరియు ఆదర్శ్‌గావ్‌లలో 18 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. చుంగ్‌తాంగ్‌లో కనెక్టివిటీ లేకపోవడంతో భారత సైన్యం సహాయక శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన సమాచారం ప్రకారం, ఆకస్మిక వరదల కారణంగా మొత్తం 14 వంతెనలు కూలిపోయాయి. వీటిలో, తొమ్మిది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సంరక్షణలో ఉండగా, మిగిలిన ఐదు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. గ్యాంగ్‌టక్ నుండి సిలిగురిని కలిపే NH-10, లిఖువీర్-సెటిజోరా స్ట్రెచ్ దగ్గర పూర్తిగా కొట్టుకుపోయింది. తీస్తా నదిలో నీటి మట్టాలు తగ్గిన వెంటనే మరమ్మతు పనులు చేపడతారు. 

హెచ్చరించిన ఏజెన్సీలు: 

డిక్చు, సింగ్‌తం, రంగ్‌పో విపత్తుకు గురయ్యే అవకాశం ఉంది. అనేక దశాబ్దాలుగా చాలా ఏజెన్సీలు, లోనక్ సరస్సు వల్ల ప్రమాదం పొంచి ఉంది అని హెచ్చరించడం జరిగింది. అయితే వర్షపాతం అధికమైన సమయాలలో ముప్పు తప్పదు అని, చుట్టుపక్కల ఉండే ప్రాంతాల ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ వచ్చాయి.