వీర్ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ను హెచ్చరించిన శివసేన

వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో శివసేన మహా వికాస్ అఘాడితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌కు సమస్యలు సృష్టిస్తాయని.. కాంగ్రెస్‌ను, రాహుల్ గాంధీని సామ్నా పత్రిక హెచ్చరించింది. హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని శివసేన తన సామ్నాలో దుయ్యబట్టింది. సావర్కర్ బానిసత్వానికి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని, ఆయనను అవమానిస్తే సహించబోమని శివసేన పార్టీ రాహులు గాంధీకి గుర్తు చేసింది. రాహుల్ గాంధీ పదేపదే […]

Share:

వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో శివసేన మహా వికాస్ అఘాడితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌కు సమస్యలు సృష్టిస్తాయని.. కాంగ్రెస్‌ను, రాహుల్ గాంధీని సామ్నా పత్రిక హెచ్చరించింది.

హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని శివసేన తన సామ్నాలో దుయ్యబట్టింది. సావర్కర్ బానిసత్వానికి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని, ఆయనను అవమానిస్తే సహించబోమని శివసేన పార్టీ రాహులు గాంధీకి గుర్తు చేసింది.

రాహుల్ గాంధీ పదేపదే ‘నా పేరు సావర్కర్ కాదు’ అని ప్రకటనలు ఇస్తున్నారని, కానీ అలాంటి ప్రకటనలు ఇవ్వడం వల్ల ఎవరు ధైర్యాన్ని కోల్పోరు, అదే విధంగా సావర్కర్‌పై ప్రజలకున్న నమ్మకం పోదు’ అని సామ్నా సంపాదకీయం పేర్కొంది.

శివసేన.. మహా వికాస్ అఘాడి (MVA)లో భాగమైనప్పటికీ, వీర్ సావర్కర్ పై అసత్య పరకటనలు, అవమానకరమైన అభిప్రాయాలను సహించబోమని ఉద్ధవ్ థాక్రే హెచ్చరించారు.

కాగా.. శివసేన (UBT), కాంగ్రెస్ మరియు NCPలు మహారాష్ట్రలో MVA కూటమిలో భాగంగా ఉన్నాయి.

గతంలో కూడా, అంటే MVA ఏర్పాటు కానప్పుడు, ‘వీర్ సావర్కర్’ను విమర్శించినందుకు, రాహుల్ గాంధీ చేసిన ప్రకటనలకు వ్యతిరేకంగా శివసేనపోరాటం చేసింది. దేశం కోసం అతని కుటుంబం చేసిన సేవలను శివసేన గుర్తు చేసింది.

“పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి జరిగింది అన్యాయం, దానికి మేము ఒప్పుకుంటాం, కానీ.. సావర్కర్‌ను అవమానించడం ద్వారా అతను ఈ యుద్ధంలో గెలవలేడని అన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన గాంధీ కుటుంబంలో జన్మించారు, అది నిజమే.. కానీ సావర్కర్ మరియు అతని కుటుంబం కూడా దేశం కోసం పని చేసారు” ఇది కూడా రాహుల్ గాంధీ గుర్తుంచుకుపోవాలని శివసేన హెచ్చరించింది.

సావర్కర్‌పై చేసే ఇలాంటి వరుస ప్రకటనలు మహారాష్ట్రలోని పార్టీకి సమస్యలను సృష్టిస్తాయని సామ్నా సంపాదకీయం కాంగ్రెస్, రాహుల్ గాంధీలను హెచ్చరించింది .

ఆదివారం సాయంత్రం మాలేగావ్‌లో జరిగిన ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. తమ పార్టీ కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’లో చేరినప్పటికీ, రాహుల్ గాంధీ.. పార్టీల మధ్య మరింత ఉద్రిక్తతలకు కారణమయ్యే ఇలాంటి ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

28 మే 1883లో జన్మించిన  సావర్కర్..  26 ఫిబ్రవరి 1966లో మరణించారు. ఒక భారతీయ రాజకీయ నాయకుడు, కార్యకర్త మరియు రచయిత. సావర్కర్ 1922లో రత్నగిరిలో ఖైదు చేయబడినప్పుడు హిందుత్వం యొక్క హిందూ జాతీయవాద రాజకీయ భావజాలాన్ని అభివృద్ధి చేశాడు. సావర్కర్ ఉన్నత పాఠశాల విద్యార్థిగా తన రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించాడు. పూణేలోని ఫెర్గూసన్ కళాశాలలో చదువు కొనసాగించాడు. అతను, అతని సోదరుడు అభినవ్ భారత్ సొసైటీ అనే రహస్య సంఘాన్ని స్థాపించారు. సావర్కర్ తన లా స్టడీస్ కోసం యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్ళినప్పుడు, ఇండియా హౌస్, ఫ్రీ ఇండియా సొసైటీ వంటి సంస్థలలో చేరాడు. విప్లవాత్మక మార్గాల ద్వారా సంపూర్ణ భారత స్వాతంత్య్రాన్ని సమర్థిస్తూ కొన్ని పుస్తకాలను కూడా ప్రచురించాడు. 1857 నాటి భారతీయ తిరుగుబాటు గురించి ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ పేరుతో అతను ఒక పుస్తకాన్ని రాశాడు. అయితే అతను ప్రచురించిన ఈ పుస్తకాన్ని బ్రిటిష్ వలస అధికారులు నిషేదించారు.