సాయి భక్తులకు గమనిక: శిరిడిలో మే 1వ తేదీ నుంచి నిరవధిక బంద్

దేశంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శిరిడీలో మే 1వ తేదీ నుంచి నిరవధిక బంద్ నిర్వహించనున్నారు. ఆలయ భద్రతకు ప్రభుత్వం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సును నియమించడాన్ని నిరసిస్తూ అక్కడి వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.  ప్రస్తుతం శిరిడి ఆలయాన్ని మహారాష్ట్ర పోలీసులే భద్రత కల్పిస్తున్నారు. ఆలయం పై దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సిఐఎస్ఎఫ్ తో భద్రతను పటిష్టం చేయాలని ప్రభుత్వం భావించింది. కాగా పారిశ్రామిక సంస్థలు, విమానాశ్రయాలు, […]

Share:

దేశంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శిరిడీలో మే 1వ తేదీ నుంచి నిరవధిక బంద్ నిర్వహించనున్నారు. ఆలయ భద్రతకు ప్రభుత్వం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సును నియమించడాన్ని నిరసిస్తూ అక్కడి వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.  ప్రస్తుతం శిరిడి ఆలయాన్ని మహారాష్ట్ర పోలీసులే భద్రత కల్పిస్తున్నారు. ఆలయం పై దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సిఐఎస్ఎఫ్ తో భద్రతను పటిష్టం చేయాలని ప్రభుత్వం భావించింది. కాగా పారిశ్రామిక సంస్థలు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్ వంటి వాటి దగ్గర గస్తీ కాయడం తప్ప, శిరిడీ లాంటి ఆలయం వద్ద ఎదురయ్యే భద్రతాపరమైన సవాళ్ళను ఎదుర్కోవడంలో  సిఐఎస్ఎఫ్ కు ఎలాంటి నైపుణ్యం లేదని శిరిడి వాసులు, వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిఐఎస్ఎఫ్ రంగంలోకి దిగితే పెద్ద ఎత్తున ఆంక్షలు పెడతారని వాటి వల్ల పర్యాటకులకు , తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో ఆలయ భద్రతపై బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, సాయి సంస్థాన్ ట్రస్ట్ అభిప్రాయం అడుగగా..  సీఐఎస్ఎఫ్ భద్రతకు ఆలయ ట్రస్ట్ అంగీకరించింది. కాగా, దీనిని షిర్డీ గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనితో పాటు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలని.. ప్రభుత్వానికి చెందిన డిప్యూటీ కలెక్టర్, ప్రాంతీయ అధికారి, తహసీల్దార్ అధికారితో కమిటీ వుండాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ నిర్ణయం పైన స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నాలుగు డిమాండ్లను తీసుకువచ్చారు ఆలయానికి సిఐఎస్ఎఫ్ భద్రత వద్దని చెబుతున్నారు. దేవాలయానికి సీఈవో పోస్టు రద్దు చేయాలనేది మరో డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులతో కమిటీ వేయాలని మరో డిమాండ్ ప్రస్తుతం తాత్కాలిక కమిటీ సాయి సంస్థాన్ పనులను పర్యవేక్షిస్తుంది. దీంతో కార్యకలాపాలు నెమ్మదించి తీసుకోవాల్సిన నిర్ణయాలు పెండింగ్ లో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.  రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయి కమిటీ వేయాలని వారు కోరుతున్నారు. 50 శాతం ధర్మకర్తలు శిరిడీలో ఉండేలా కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  అదే సమయంలో బంద్ జరిగితే దేవాలయం దర్శనం విషయంలో ఎటువంటి మార్పులు లేవని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం నాడు స్థానికులు వ్యాపారులు అన్ని సంఘాలవారులు సమావేశమై బంద్ నిర్ణయం తీసుకున్నారు.  కాగా ఊర్లో బంద్ పాటించినా ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. సాయి భక్తులు దర్శనానికి వెళ్లొచ్చు. సాయి సంస్థాన్ ట్రస్ట్ నిర్వహించే ఉచిత అన్నదానం, ట్రస్ట్ కు సంబంధించిన వసతి సౌకర్యాలు అన్ని అందుబాటులో ఉంటాయని ట్రస్టుకు సంబంధించిన అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.

భక్తుల కోసం సంస్థాన్ లో అన్ని సౌకర్యాలు కలుగుతాయని స్పష్టం చేశారు దూరం నుంచి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇందుకోసం స్థానికులు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆలయం మినహా ఇతర వ్యాపార సంస్థలు అన్నీ మూసివేస్తారు. బంద్ ప్రకటించినా సాధారణ భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అధికారులు హామీ ఇస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో శిరిడికి ఈ సమయంలోనే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులు ఎవరు ఈ బంద్ ప్రకటనలతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రస్టు బోర్డు సభ్యులు స్పష్టం చేశారు.  సాయి భక్తులు యధావిధిగా శిరిడీకి దర్శనానికి రావచ్చని స్పష్టం చేశారు.