బ్యాంక్​ లాకర్​లో ‘చెదలు’.. రూ.18 లక్షలు స్వాహా..

కుమార్తె పెళ్లిని ఘనంగా చేయాలనుకుంది ఓ మహిళ. అందుకోసం బ్యాంకు లాకర్‌లో రూ.18 లక్షలు దాచుకుంది. అయితే, ఏడాది తర్వాత లాకర్ తెరిచి చూసిన ఆమెకు ఊహించని షాక్ తగిలింది. ఆ డబ్బును చెదలు తినేయడంతో ఆమె విస్తుపోయారు. తన కూతురి వివాహం ఘనంగా చేయాలనుకుంది ఓ మహిళ. పైసా పైసా కూడబెట్టి పెద్ద మొత్తాన్ని బ్యాంకు లాకర్‌లో దాచుకుంది. కుమార్తె పెళ్లి కోసం సన్నాహాలు మొదలు పెట్టింది. తన వద్ద ఉన్న సొమ్ముతో తాను అనుకున్నట్లు […]

Share:

కుమార్తె పెళ్లిని ఘనంగా చేయాలనుకుంది ఓ మహిళ. అందుకోసం బ్యాంకు లాకర్‌లో రూ.18 లక్షలు దాచుకుంది. అయితే, ఏడాది తర్వాత లాకర్ తెరిచి చూసిన ఆమెకు ఊహించని షాక్ తగిలింది. ఆ డబ్బును చెదలు తినేయడంతో ఆమె విస్తుపోయారు.

తన కూతురి వివాహం ఘనంగా చేయాలనుకుంది ఓ మహిళ. పైసా పైసా కూడబెట్టి పెద్ద మొత్తాన్ని బ్యాంకు లాకర్‌లో దాచుకుంది. కుమార్తె పెళ్లి కోసం సన్నాహాలు మొదలు పెట్టింది. తన వద్ద ఉన్న సొమ్ముతో తాను అనుకున్నట్లు ఘనంగా పెళ్లి నిర్వహించవచ్చని ధీమాగా ఉంది. అయితే, ఇంతులోనే ఆ మహిళకు ఊహించని షాక్ తగిలింది. లాకర్‌లో దాచుకున్న మొత్తం రూ. 18 లక్షల కరెన్సీ నోట్లు చెదలు పట్టి పాడైపోయాయి. ఎంతో భద్రంతా ఉంటాయని లాకర్‌లో దాచుకుంటే ఊహించని పరిణామం ఎదురవ్వడంతో ఆమె విస్తుపోయారు.

ఉత్తర్‌ప్రదేశ్లోని మొరాదాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్కా పాఠక్ అనే మహిళ గతేడాది అక్టోబర్, 2022లో బ్యాంక్ ఆఫ్ బరోడా అషియాన్ బ్రాంచ్ లాకర్‌లో రూ.18 లక్షలు దాచుకున్నారు. అయితే, ఇటీవలే బ్యాంకు అధికారులు లాకర్ అగ్రిమెంట్ రెన్యువల్ చేసుకోవాలని, కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవాలని ఆమెను సంప్రదించారు. ఈ క్రమంలో బ్యాంకు వద్దకు చేరుకున్న అల్కా పాఠక్ తాను భద్రపరిచినవన్నీ సక్రమంగా ఉన్నయో లేదోనని చూసుకొనేందుకు లాకర్ తెరిచారు. వెంటనే ఆమె లాకర్‌లో ఉన్న తన డబ్బంతా చెదలుపట్టడం చూసి విస్తుపోయారు. కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న డబ్బంతా చెదపుపురుగలు తినేయడంతో ఆమె పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనతో బ్యాంకు అధికారులు సైతం షాక్‌కు గురయ్యారు. ఈ విషయంపై బయటకు రావడంతో మీడియా ఒత్తిడితో ఈ విషయంపై స్పదించారు బ్యాంకు అధికారులు. ఈ అంశంపై తమ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపినట్లు వెల్లడించారు.

మరో వైపు.. కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బంతా ఇలా చెదలు పురుగులు తినడంతో ఆ మహిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు తనతో ఎలాంటి సమాచారం పంచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బ్యాంకు నుంచి సరైన స్పందన, సహకారం లభించకపోతే మీడియా సాయం తీసుకుని ఈ విషయాన్ని విస్తృతం చేస్తానన్నారు. ఆ మహిళ ట్యూషన్లు చెబుతూ చిన్న బిజినెస్ చేసుకొని జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరి చూడాలి నష్టపోయిన మహిళకు ఎలాంటి పరిహారం అందుతుందనేది.

లాకర్‌కు సంబంధించి తాజా నిబంధనలు

బ్యాంకు లాకర్లలో నగదు నిల్వ చేయకూడదు. కేవలం నగలు, పత్రాలు వంటి విలువైన వస్తువులు నిల్వ చేసుకొనేందుకు, చట్టబద్ధమైన ప్రయోజనాల కోసమే మాత్రమే  దీన్ని వినియోగించాలి.  చట్టవిరుద్ధమైన ప్రమాదకర పదార్ధాలను అసలు ఉంచకూడదు. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు, కస్టమర్‌పై ‘తగిన చర్య’ తీసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుంది. 

అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడీ, భవనం కూలిపోవడం మొదలైన వాటికి బ్యాంకుదే బాధ్యత. ఉద్యోగి మోసం చేయడం వల్ల నష్టం జరిగితే బ్యాంకు కూడా బాధ్యత వహిస్తుంది. ఇలాంటి కేసుల్లో ‘సేఫ్ డిపాజిట్ లాకర్’ ప్రస్తుత వార్షిక ఫీజుకు వంద రెట్లు ఖాతాదారుడికి నష్టపరిహారంగా చెల్లించాలి. 

కానీ వరదలు, భూకంపాలు , ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా లాకర్ కంటెంట్‌కు ఏదైనా నష్టం లేదా నష్టానికి బ్యాంక్ బాధ్యత వహించదు. అలాగే  లాకర్ అద్దెను మూడేళ్లపాటు చెల్లించకపోతే, కస్టమర్‌కు సమాచారం అందించి, కస్టమర్‌ అనుమతి తర్వాత బ్యాంక్ ‘డ్యూ ప్రొసీజర్‌ను అనుసరించి’ లాకర్‌ను తెరిచే అధికారం

ఈ నిబంధనలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి  వచ్చాయి. అలాగే ఇప్పటికే లాకర్‌ ఉన్న వినియోగదారులు బ్యాంకులకు కొత్త ఒప్పంద పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం వినియోగదారుడు రూ. 200 స్టాంప్‌ పేపర్‌పై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది.  ఆర్‌బిఐ నిర్దేశించిన ఈ గడువు జూన్‌తో ముగిసిపోగా  తాజాగా  ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు దీన్ని పొడిగించింది.  అంతేకాదు కొత్త నిబంధనల ప్రకారం నష్టపరిహారం పొందాలంటే గడువులోగా సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాన్ని సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది.