మోదీ నాయ‌క‌త్వాన్ని ప్ర‌శంసించిన శ‌శి థ‌రూర్

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంత‌పురం ఎంపీ శశి థరూర్.. ప్ర‌ధాని నరేంద్ర మోదీ నాయ‌కత్వం గురించి ప్రస్తావించారు. ఆయ‌న నాయ‌క‌త్వం అమోఘం అని శశి థరూర్ కొనియాడారు. ఓ జాతీయ స‌ద‌స్సులో పాల్గొన్న శ‌శి థ‌రూర్.. న‌రేంద్ర‌ మోదీ నాయ‌కత్వం గురించి మాట్లాడారు. మోదీ ప్ర‌ధాని అయిన ఏడాదిలోనే 27 దేశాల్లో ప‌ర్య‌టించార‌ని కానీ అందులో ఒక్క‌ ఇస్లామిక్ దేశం కూడా లేద‌ని అన్నారు. ఆ స‌మ‌యంలో త‌న‌కు మోదీ నాయ‌క‌త్వంపై కోపం వ‌చ్చి వ్య‌తిరేకంగా మాట్లాడాన‌ని […]

Share:

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంత‌పురం ఎంపీ శశి థరూర్.. ప్ర‌ధాని నరేంద్ర మోదీ నాయ‌కత్వం గురించి ప్రస్తావించారు. ఆయ‌న నాయ‌క‌త్వం అమోఘం అని శశి థరూర్ కొనియాడారు. ఓ జాతీయ స‌ద‌స్సులో పాల్గొన్న శ‌శి థ‌రూర్.. న‌రేంద్ర‌ మోదీ నాయ‌కత్వం గురించి మాట్లాడారు. మోదీ ప్ర‌ధాని అయిన ఏడాదిలోనే 27 దేశాల్లో ప‌ర్య‌టించార‌ని కానీ అందులో ఒక్క‌ ఇస్లామిక్ దేశం కూడా లేద‌ని అన్నారు. ఆ స‌మ‌యంలో త‌న‌కు మోదీ నాయ‌క‌త్వంపై కోపం వ‌చ్చి వ్య‌తిరేకంగా మాట్లాడాన‌ని అన్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. మోదీ ఇస్లామిక్ దేశాల‌కు చేరువైన తీరు ప్ర‌శంస‌నీయ‌మ‌ని థ‌రూర్ ప్ర‌శ‌సించారు. ఏ ఒక్క ఇస్లామిక్ దేశంతోనూ ఇండియాకు సంబంధాలు బాలేవ‌ని, కానీ మోదీ దానిని మైండ్‌లో పెట్టుకుని ఎప్పుడు ఎలా వారితో మాట్లాడాలో తెలిసిన‌వార‌ని అన్నారు. 

ఒక‌ప్పుడు కాంగ్రెస్ ఎంపీగా మోదీని త‌ప్పుబ‌ట్టిన తాను ఇప్ప‌టికి ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. థ‌రూర్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మ‌ల్వియా స్పందించారు. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో బ‌ల‌హీన‌మైన క్ష‌ణంలో ఎట్ట‌కేల‌కు థ‌రూర్ నిజం మాట్లాడార‌ని అన్నారు.

ఇక జీ20 స‌ద‌స్సు గురించి శ‌శి థ‌రూర్ ప్ర‌స్తావిస్తూ.. ఆ స‌ద‌స్సును ఇండియా బాగా స‌ద్వినియోగం చేసుకుంద‌ని అన్నారు.  ఇప్పుడు ఇండియాను ఏ ఒక్క దేశం ఇగ్నోర్ చేయ‌లేద‌ని తెలిపారు. పీఎం మోదీ ఫారిన్ పాల‌సీ బాగా అభివృద్ధి చెందింద‌ని అన్నారు. అయితే, భారత్ చైనా మధ్య ఉన్న సంబంధాలపై మరియు చైనా చూపిస్తున్న విధానంపై శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. భార‌త్‌ను అతిక్ర‌మించేందుకు చైనాకు ఉచిత పాస్ ఇచ్చిన‌ట్లైంద‌ని శ‌శి థ‌రూర్ అన్నారు. చైనాతో భార‌త్ సంబంధాలు అంతగా బాలేవ‌ని, చైనా పాల‌సీపై భార‌త ప్ర‌భుత్వం ఓ క్లారిటీతో లేద‌ని విమ‌ర్శించారు. పార్ల‌మెంట్‌లోనూ చైనా గురించి ఎలాంటి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంలేద‌ని గుర్తుచేసారు. చైనా యాప్‌ల‌పై భార‌త్ బ్యాన్ విధించిన‌ప్ప‌టికీ అదేదో కేవ‌లం టోకెనిజంలా ఉంద‌ని త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు శ‌శి థ‌రూర్. 

ఇక మోదీ ప్ర‌వేశ‌పెట్టిన యోగా గురించి కూడా శ‌శి థ‌రూర్ మాట్లాడారు. యోగాను పాపుల‌ర్ చేసిన మోదీని అభినందించాల్సిందేన‌ని అన్నారు. “యోగాను పాపుల‌ర్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ.. యుఎన్‌కు ప‌రిచ‌యం చేసి అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని ప్రపంచానికి పరిచ‌యం చేసిన వారిని అభినందించాల్సిందే” అని అన్నారు.  

ఇక 2024లో జ‌ర‌గ‌బోయే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే అపోజిష‌న్ పార్టీలు బెట‌ర్ ప్రోగ్రామ్స్‌తో జ‌నాల ముందుకు రావాల‌ని అన్నారు. కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ పార్టీలతో క‌లిపి మొత్తం 26 పార్టీలు బీజేపీని ఓడించేందుకు కంక‌ణం క‌ట్టుకున్నాయి. ఇందుకోసం నిన్నటి నుంచి అపోజిష‌న్ మీట్ దిల్లీలో జ‌రుగుతోంది. ఈరోజే ఈ అపోజిష‌న్ కూట‌మికి I-N-D-I-A అని పేరు పెట్టారు.

I-N-D-I-Aకు అర్థం ఇదే

I-ఇండియ‌న్ (భార‌త‌)
N- నేష‌న‌ల్ (జాతీయ‌)
D- డెమోక్ర‌టిక్ (స్వాతంత్ర్య‌)
I-ఇన్‌క్లుజివ్ (స‌మ‌గ్ర‌)
A-అల‌య‌న్స్(పొత్తు)

దీనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రెసిడెంట్‌గా ఉంటారు. బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. కర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన బీజేపీ.. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎలాగైనా త‌మ స‌త్తా చాటాల‌ని కృషి చేస్తోంది. ఇందుకోసం ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకోవ‌డానికి కూడా వెనుకాడ‌లేదు. ఆల్రెడీ.. మ‌న తెలుగు రాష్ట్రాల నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీని ఎన్డీయే కూట‌మిలో క‌లుపుకుంది బీజేపీ. త‌మ‌కు 25కి పైగా పార్టీల నుంచి మ‌ద్ద‌తు ఉంద‌ని కేంద్ర‌మంత్రి జేపీ న‌డ్డా ప్ర‌క‌టించారు.