దక్షిణాది రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులతో ప్రజలు సంతోషంగా ఉన్నప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలంలో వర్షాలు కురుస్తుండటంతో చల్లటి వాతావరణంలో నగర ప్రజలు సంతోషంగా ఉన్నప్పటికీ, గ్రామాల్లోని రైతులు పంట దిగుబడి చేతికి వచ్చే సమయంలో తమకు దక్కకుండా పోయిందని గగ్గోలు పెడుతున్నారు. అటు వడగండ్ల వానలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇక వరుణుడేమో అస్సలు శాంతించడం లేదు. ఇదిలా ఉండే మరో మూడు రోజుల పాటు భారీ నుంచి […]

Share:

గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులతో ప్రజలు సంతోషంగా ఉన్నప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలంలో వర్షాలు కురుస్తుండటంతో చల్లటి వాతావరణంలో నగర ప్రజలు సంతోషంగా ఉన్నప్పటికీ, గ్రామాల్లోని రైతులు పంట దిగుబడి చేతికి వచ్చే సమయంలో తమకు దక్కకుండా పోయిందని గగ్గోలు పెడుతున్నారు. అటు వడగండ్ల వానలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇక వరుణుడేమో అస్సలు శాంతించడం లేదు. ఇదిలా ఉండే మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలో రానున్న నాలుగు రోజులపాటు ఉరుములు, మెరుపులతో వర్షం కురువనుంది. తెలంగాణలో నేడు మాత్రమే తక్కువ వర్షపాతం నమోదు కానుంది. పలుచోట్ల వడగండ్లు, పిడుగులు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడులో రానున్న మూడు రోజులు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. కాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే తక్కువ వర్షపాతం నమోదు కానుందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధిక వర్షపాతం ఉన్నచోట అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు వెల్లడించారు.

మరోవైపు ఏప్రిల్ నెలలో కేరళలో 32 మిమీ, కర్ణాటకలో 12.2 మిమీ వర్షపాతం నమోదైందని వాతవారణ శాఖ తెలిపింది. కాగా ఈ నెలలో ఇప్పటివరకు అధిక వర్షాలు నమోదైన దక్షిణాది రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్  లో 21.3 మి.మీ ల వర్షపాతం నమోదైనట్లు వాతవారణ శాఖ పేర్కొంది.

కాగా వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలలో స్తంభాలను తాకకుండా చూడాలని ప్రభుత్వ అధికార యంత్రాంగం హెచ్చరించింది. వాతావరణంలో ఈ ఆకస్మిక మార్పులపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. కాలానుగుణంగా ఎండలు, వానలు, చలి ఉండకపోవడంతో.. ఎలాంటి ముప్పు మళ్ళీ వస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే  కరోనా లాంటి భయంకరమైన వ్యాధి వైరస్ రూపంలో ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే.  ప్రపంచంలో కోటీకి పైగా జనాలను కరోనా వైరస్ తుడిచిపెట్టుకుపోయింది. అటు అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వడగండ్ల వానలు కురిసి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో పెట్టుబడి డబ్బులు కూడా తమకు దక్కలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి.

ఇక సాధారణంగా ఎండాకాలంలో ఇలాంటి వర్షాలు కురవడం ఇదే మొదటిసారి. ప్రతి ఏటా ఎండాకాలంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇప్పుడు వాతావరణంలో మార్పుల వల్ల వర్షం, ఎండ, చలి ఎప్పుడూ వస్తాయో తెలియని పరిస్థితి. రానున్న రోజుల్లో పంటలు పండించాలంటే రైతులు భయపడుతున్నారు. వర్షం కురిసిన తర్వాత దుక్కి దున్ని పంట వేస్తే దిగుబడి బాగా వస్తుంది. కానీ చేతికి వస్తున్న పంట సమయంలో వర్షం పడితే వచ్చే దిగుబడి అంతా నేలపాలవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పంట వేయాలన్న రైతులు భయపడుతున్నారు. తగినంత నీరు ఉన్నప్పటికీ పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురుస్తుండటం చూస్తే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక ఏ సమయంలో పంట వేయాలో అర్థం కాక రైతులు అయోమయంలో ఉన్నారు. 

కాగా సాధారణంగా వాతావరణం.. గాలి, పీడనం, తేమ వ్యత్యాసాల వల్ల ఏర్పడుతుంది. భూమి యొక్క వాతావరణం సాధారణంగా -40 డిగ్రీలు నుంచి 104 డిగ్రీల మధ్య ఉంటుంది. రేడియేషన్ వల్ల భూమి కంటే అంతరిక్షంలో ఎక్కువ నష్టం జరుగుతుంది. అంతరిక్షంలో రేడియేషన్ పెరగకుండా ప్రపంచ దేశాలు కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.