ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న భారీ వర్షాలు

అల్లకల్లోలంగా మారిన హిమాచల్ ప్రదేశ్ :                                                                                                                                                                                                                                                                                                                                                                                                  నిన్నమొన్నటి వరకు ఎండ తీవ్రతతో వడగాల్పులకు గురై చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు తీవ్రమైన వర్షాలకు , వరదలకు ఉత్తరాది రాష్ట్రాలలో 5 మంది చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మరియు ఉత్తరాఖండ్ ప్రాంతాలలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోపక్క మన దేశ రాజధాని ఢిల్లీ లో కూడా భారీ వర్షాల కారణం గా చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదురుకోవాల్సిన పరిస్థితి […]

Share:

అల్లకల్లోలంగా మారిన హిమాచల్ ప్రదేశ్ :                                                                                                                                                                                                                                                                                                                                                                                                 

నిన్నమొన్నటి వరకు ఎండ తీవ్రతతో వడగాల్పులకు గురై చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు తీవ్రమైన వర్షాలకు , వరదలకు ఉత్తరాది రాష్ట్రాలలో 5 మంది చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మరియు ఉత్తరాఖండ్ ప్రాంతాలలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోపక్క మన దేశ రాజధాని ఢిల్లీ లో కూడా భారీ వర్షాల కారణం గా చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదురుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో వర్ష భీబత్సం వల్ల అయిదుగురు ప్రాణాలను కోల్పోయారు. ఇక ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలి అల్లకల్లోలంగా మారింది. అక్కడ వరదలు విలయ తాండవం చెయ్యడం తో కార్లు సైతం , బస్సులు సైతం ఆ వరదలో కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్ లో కూడా ఇదే పరిస్థితి, అక్కడ గంగానదిలో పడి ముగ్గురు చనిపోగా, మరో ముగ్గురి ఆచూకీ తెలియడం లేదు.

కూలిపోయిన బియాస్ నది బ్రిడ్జి :

ఇక హిమాచల్ ప్రదేశ్ కి చెందిన మండీ జిల్లాలో అవుట్ – బంజార్ ప్రాంతాలను కలుపుతూ బియాస్ నదిపై నిర్మించిన ఒక ఉక్కు వంతెన ఈ వరద బీభత్సం లో కొట్టుకుపోయింది. ఎంతో దృఢమైన ఉక్కు తో నిర్మించిన వంతెన సైతం కొట్టుకుపోయిందంటే, వరద ఉదృతి ఏ స్థాయిలో ఉండుంటుందో ఊహించుకోవచ్చు. ఇక ఈ ఆకస్మిక వరదల కారణంగా చాలా ప్రాంతాలలో కొండచరియలు విరిగి పడ్డాయి. అందువల్ల మండీ – కులూ, మనాలి – లేహ్ , చంబా – పఠాన్ కోట్ తదితర జాతీయ రహదారులు సహా, 700 కు పైగా రోడ్లు బ్లాక్ అయ్యి, రవాణా నిలిచిపోయింది. ఇక ఈ కుల్లూ జిల్లాలో బియాస్ నదీ తీరం లో చిక్కుకున్న 5 మందిని మన ఎన్టీఆర్ ఫౌండేషన్ వారు ప్రాణాలకు తెగించి కాపాడారు. ఇక ఈ వర్ష బీభత్సం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించకపోవడం తో ఒక రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.

ఇక జమ్ముకు కాశ్మీర్ లో వరద తీవ్రత మామూలు స్థాయిలో లేదు, అక్కడ ఈ వరదల దాటికి జాతీయ రహదారులు ద్వంసం అయ్యాయి. ఇక దోడ ప్రాంతం లో అయితే కొండచరియలు విరిగి బస్సు మీద పడడం వల్ల ఇద్దరు మృతి చెందారు. ఇది ఇలా ఉండగా భారత సైన్యం కి చెందిన సుభేదార్ కులదీప్ సింగ్ , సిపాయి తెలూ రామ్ లు పూంచ్ లో వరదల్లో కొట్టుకొని పోయారు. వీళ్లిద్దరి మృతదేహాలు శనివారం రోజు లభ్యం అయ్యాయి. ఇది ఇలా ఉండగా కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలకు చెందిన ఎల్జీలతో వరద పరిస్టులను అడిగి తెలుసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ మరియు జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాలలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయట. ఇందుకోసం ఇప్పటికే ఈ ప్రాంతాలలో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ని ప్రకటించింది. అలాగే ఉత్తర ప్రదేశ్ , పంజాబ్, హరియాణా , తూర్పు రాజస్థాన్ వంటి ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ ని ప్రకటించింది. ఇక మన దేశ రాజధాని ఢిల్లీలో రానున్న 24 గంటలు వర్షాలు వచ్చే సూచనలు ఉండడం ఎల్లో అలెర్ట్ ని ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో 153 కిలోమీటర్ల వర్షపాతం నమోదు అయ్యినట్టు తెలుస్తుంది. ఈ స్థాయి వర్షాలు 1982 వ సంవత్సరం లో పడ్డాయి, మళ్ళీ ఆ తర్వాత ఇన్నాళ్లకు ఆ స్థాయి వర్షాలు నమోదు అవుతున్నాయి.