మహారాష్ట్రలో విషాదకర ఘటన

ఎలాంటి తప్పులు జరగకుండా, లా & ఆర్డర్ ని పరిరక్షుస్తూ ప్రజలకు భద్రతా కలిపించాల్సిన పోలీసులే ఈమధ్య తప్పులు చెయ్యడం బాగా అలవాటు అయిపోయింది. రీసెంట్ గా మహారాష్ట్ర లోని పూణే ప్రాంతం లో ఒక పోలీస్ అధికారి చేసిన పిరికి చర్య పోలీస్ వ్యవస్థ మొత్తం సిగ్గుపడేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పూణే లోని బానర్ ప్రాంతం లో తెల్లవారుజామున గైక్వాడ్ అనే పోలీస్ అధికారి తన భార్య, మేనల్లుడిని తుపాకీ తో కాల్చి […]

Share:

ఎలాంటి తప్పులు జరగకుండా, లా & ఆర్డర్ ని పరిరక్షుస్తూ ప్రజలకు భద్రతా కలిపించాల్సిన పోలీసులే ఈమధ్య తప్పులు చెయ్యడం బాగా అలవాటు అయిపోయింది. రీసెంట్ గా మహారాష్ట్ర లోని పూణే ప్రాంతం లో ఒక పోలీస్ అధికారి చేసిన పిరికి చర్య పోలీస్ వ్యవస్థ మొత్తం సిగ్గుపడేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పూణే లోని బానర్ ప్రాంతం లో తెల్లవారుజామున గైక్వాడ్ అనే పోలీస్ అధికారి తన భార్య, మేనల్లుడిని తుపాకీ తో కాల్చి చంపి, ఆ తర్వాత తనకి తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ ఘటన పూణే లో కలకలం రేపింది. అనంతరం విచారణలో పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, అమరావతి ప్రాంత అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా గైక్వాడ్ విధులు నిర్వహించే వాడని, తన భార్యాపిల్లలతో కలిసి ఆయన పూణే లోని బానర్ ప్రాంతం లో నివసించేవాడని చెప్పుకొచ్చారు. డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత తెల్లవారుజామున 3:30 నిమిషాలకు తుపాటికి తీసుకొని తన భార్య మౌని గైక్వాడ్ తలపై కాల్పు జరపగా ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. తుపాకీ పేలిన శబ్దం వినపడి పక్క రూమ్ లో ఉన్న ఆయన మేనల్లుడు,కొడుకు అక్కడికి చేరుకోగా, అతని ఛాతీపై కాల్పులు జరిపాడు గైక్వాడ్. దీనితో మేనల్లుడు కూడా చనిపోయాడు.

ఎన్నో అనుమానాలు:

ఐపీఎస్ స్థానం లో ఉన్న ఒక పోలీస్ ఎందుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు..?, అతనికి ఏమైనా ఆర్ధిక సమస్యలు ఉంటాయా అంటే అది లేదు, ఎందుకంటే ఒక ఐపీఎస్ ఉద్యోగి కి ఎంత జీతం ఇస్తారో మన అందరికీ తెలిసిందే. పోనీ అతనిని ఎవరైనా రాజకీయ నాయకుడు కానీ, లేదా గూండా కానీ బెదిరించి ఉంటారా..?, అతని వద్ద రహస్యం ఉన్న విషయాన్ని బట్టబయలు చేస్తామని ఎవరైనా బెదిరించారా..?, ఇలాంటి కోణాల్లో పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గైక్వాడ్ గొప్ప ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి అట, చాలా నిజాయితితో  డ్యూటీ చేసేవాడని, పోలీస్  వ్యవస్థకి మచ్చ ని తీసుకొచ్చే ఒక్క పని కూడా చేసేవాడు కాదని, అలాంటి వ్యక్తి ఇలాంటి పని చేసుకోవడానికి గల కారణం ఏంటో అర్థం కావడం లేదని గైక్వాడ్ పోలీస్ స్టేషన్ లోని ఆయనతో పాటు పని చేసే పోలీసులు తెలిపారు.,

వ్యక్తిగత సమస్యలే కారణమా..?:

ఆయన వ్యక్తిగత సమస్యల కారణంగా చనిపోయాడు అంటే అసలు నమ్మము, కచ్చితంగా ఎదో పెద్ద కుట్రనే దీని వెనుకాల దాగుంది. సున్నిత మనస్తత్వం ఉన్న గైక్వాడ్ కి ఎదో తెలియకూడని విషయం తెలిసి ఉంటుందని, అందుకే ఇంట్లో భార్య కి చెప్పలేక, స్నేహితులకు చెప్పుకోలేక, బాధని తనలో తానే అనుభవిస్తూ ఇలా చివరికి ఆత్మహత్య కి పాల్పడ్డాడు అని అనుమానిస్తున్నారు పోలీసులు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఒక పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటాయి కాబట్టే దీని గురించి అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. విచారణలో ఏమి తేలుతుందో చూడాలి. ఏది ఏమైనా ఇలాంటి ఘటనల నుండి ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి పిరికి చర్యలు చేస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.