మ‌ళ్లీ ఉగ్ర నిఘాలో జంట న‌గ‌రాలు

మన దేశంలోకి అక్రమ చొరబాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఆర్మీ ఎంత కట్టుదిట్టంగా కాపలా కాసినా కానీ ఏదో ఒక ప్రాంతంలో చొరబాట్లు జరుగుతూనే ఉన్నాయి. భద్రతా సిబ్బందికి కూడా ఈ చొరబాట్లు నిత్యం మామూలుగానే అయిపోయాయి. గత కొద్ది రోజుల నుంచి ఈ చొరబాట్ల సంఖ్య తగ్గిందని అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ చొరబాట్ల సంఖ్య తగ్గినా కానీ అంత సంబరపడాల్సిన అవసరం లేదు. మన దేశ భద్రతకు ఇంపార్టెంట్ గా చెప్పుకునే జమ్మూ కాశ్మీర్ లోని […]

Share:

మన దేశంలోకి అక్రమ చొరబాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఆర్మీ ఎంత కట్టుదిట్టంగా కాపలా కాసినా కానీ ఏదో ఒక ప్రాంతంలో చొరబాట్లు జరుగుతూనే ఉన్నాయి. భద్రతా సిబ్బందికి కూడా ఈ చొరబాట్లు నిత్యం మామూలుగానే అయిపోయాయి. గత కొద్ది రోజుల నుంచి ఈ చొరబాట్ల సంఖ్య తగ్గిందని అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ చొరబాట్ల సంఖ్య తగ్గినా కానీ అంత సంబరపడాల్సిన అవసరం లేదు. మన దేశ భద్రతకు ఇంపార్టెంట్ గా చెప్పుకునే జమ్మూ కాశ్మీర్ లోని రెండు జిల్లాల్లో నియంత్రణ రేఖ వద్ద రాజౌరీ, పూంచ్ అనే జంట న‌గ‌రాలు జిల్లాలు ఉంటాయి. ఈ రెండు జిల్లాల్లో ఉగ్రకార్యకలాపాలు పెరిగాయని పలు నివేదికలు చెబుతున్నాయి. చొరబాట్లు తగ్గాయని అనుకునే లోపే ఇలా ఈ కార్యకలాపాలు పెరగడం అందర్నీ కలవరానికి గురి చేస్తోంది. దీంతో అందరూ అలర్ట్ అయ్యారు. 

హెచ్చరికలు జారీ

ఇలా ఉగ్ర కార్యకలాపాలు పెరగడంతో భద్రతా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. చొరబాట్లు తక్కువగా ఉంటున్నా చొరబాటు ప్రయత్నాలు మాత్రం పెరిగాయని పలువురు ఆర్మీ అధికారులు కూడా ఒప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల గురించి సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు మాట్లాడుతూ…. ఈ ప్రాంతలో చొరబాట్లు జరుగుతున్నాయని కొట్టిపారేయలేమని, ఈ ప్రయత్నాలను భద్రతా సిబ్బంది ఆపినా కానీ ఇంకో గ్రూప్ కూడా ఇలాగే ప్రయత్నించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. 

పాక్ స్ట్రాటజీ అదే… 

ఆ సీనియర్ అధికారి పాక్ స్ట్రాటజీ గురించి కూడా స్పష్టంగా వివరించాడు. 20 నుంచి 30 శాతం మంది ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది ఎన్ కౌంటర్లలో కాల్చివేసినా కానీ వారు మరింత మంది ఉగ్రవాదులను ఇలా చేసేందుకు ప్రోత్సహిస్తున్నారని అతడు తెలిపాడు. ఇలా అనేక సార్లు వారు ప్రయత్నాలు చేసినపుడు ఎప్పుడో ఒకసారి వారు లోయ దాటే అవకాశం లేకపోలేదని ఆయన అన్నారు. 

26 మంది భద్రతా సిబ్బంది వీరమరణం… 

ఉగ్రవాదులను అడ్డుకునే క్రమంలో చాలా మంది జవాన్లు వీరమరణం పొందుతున్నారు. అక్టోబర్ 21 2021 నుంచి ఈ ప్రాంతంలో ముగ్గురు అధికారులు, ఐదుగురు పారాట్రూపర్లు, ఏడుగురు పౌరులతో సహా మొత్తం 26 మంది భద్రతా సిబ్బంది వీర మరణం పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చొరబాటు ప్రయత్నాలు జరుగుతున్న వేళ భద్రతా బలగాలను కూడా ఏజెన్సీలు హెచ్చరించాయి. 

కార్డెన్ సెర్చ్ మరియు రోజూ సెర్చ్ ఆపరేషన్లు మాకు నిత్య కృత్యంగా మారిపోయాయని రాజౌరీ జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్ మీడియాకు తెలిపారు. 

90ల చివరలో అలా ఉన్నా కానీ

ఈ ప్రాంతం 1990లలో హింసాత్మక ఘటనలకు ఆవాసంగా ఉండేది కానీ 2000వ సంవత్సరం తర్వాత ప్రశాంతంగా మారింది. కానీ ఈ మధ్య అక్కడ పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జంట జిల్లాల్లో శాంతి కోసం భద్రతా బలగాలు, నిఘా సంస్థలు కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సూచించారు. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఫోరమ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నివేదిక కూడా ఇదే అంశాలను హైలెట్ చేసింది. తాజాగా శాసనసభ నియోజకవర్గాల 2022 డీలిమిటేషన్ అనేది జమ్మూ ప్రాంతంలోని పూంచ్ మరియు రాజౌరీలను కాశ్మీర్ లోని అనంత నాగ్ కు జోడించడం వలన మతపరమైన విభేదాల సమయంలో ఈ ముస్లిం మెజారిటీ ప్రాంతాలు ఎదుర్కొంటున్న పరాయీకరణకు తోడ్పడి ఉండవచ్చని నివేదిక హైలెట్ చేస్తుంది. ఈ సమస్య ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో ఉందని మనం గుర్తుంచుకోవాలి.