ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలి: రాజ్‌నాథ్ సింగ్

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫుతో గురువారం చర్చలు జరిపారు. 2020లో గాల్వాన్ లో భారత్-చైనా సైన్యం మధ్య ఘర్షణ అనంతరం చైనా రక్షణ మంత్రితో చర్చల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఢిల్లీలో ఇరుదేశాల రక్షణ మంత్రులు సమావేశం నిర్వహించారు. కజకిస్థాన్, ఇరాన్, తజికిస్థాన్ రక్షణ మంత్రులతో రాజ్‌నాథ్ సింగ్ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించారు. న్యూఢిల్లీలో జరిగిన ఎస్‌సిఓ రక్షణ […]

Share:

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫుతో గురువారం చర్చలు జరిపారు. 2020లో గాల్వాన్ లో భారత్-చైనా సైన్యం మధ్య ఘర్షణ అనంతరం చైనా రక్షణ మంత్రితో చర్చల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఢిల్లీలో ఇరుదేశాల రక్షణ మంత్రులు సమావేశం నిర్వహించారు. కజకిస్థాన్, ఇరాన్, తజికిస్థాన్ రక్షణ మంత్రులతో రాజ్‌నాథ్ సింగ్ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించారు.

న్యూఢిల్లీలో జరిగిన ఎస్‌సిఓ రక్షణ మంత్రుల సమావేశానికి రాజ్ నాథ్ సింగ్ ‌తో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  మాట్లాడుతూ.. మనమంతా ఐక్యంగా ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్‌సిఓ బలపడాలంటే ప్రతి ఒక్క దేశం అందుకు సహకరించాలని అన్నారు.

SCOని బలోపేతం చేయడానికి భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కాాగా SCO ఆదేశాలను అమలు చేయడానికి మరియు సాధారణ సవాళ్లను ఎదుర్కోవడానికి దోహదపడుతుందని అన్నారు. తమ తమ దేశాలను శాంతియుతంగా, సురక్షితమైన ప్రాంతాలుగా ఉంచడానికి తమ వంతుగా భారతదేశం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. ప్రపంచదేశాలకు శాంతి మరియు భద్రతకు తీవ్రవాదం అత్యంత ప్రమాదకరం అని ఇది ఒక సవాళ్లుగా తీసుకోవాలని అన్నారు. అన్ని రకాల ఉగ్రవాదంపై పోరాడేందుకు  భారతదేశం గట్టి సంకల్పంతో ఉందని ఆయన చెప్పారు.

SCO రక్షణ మంత్రుల సమావేశానికి ఒక రోజు ముందు గురువారం (ఏప్రిల్ 27) న్యూఢిల్లీలో చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. చైనా రక్షణ మంత్రులు విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. భారతదేశం మరియు చైనా వారి మిలిటరీల మధ్య సంబంధాలపై షాంగ్ఫు మరియు రాజ్ నాధ్ సింగ్‌లు అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు .

ప్రధాన పొరుగు దేశాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలుగా, చైనా మరియు భారతదేశం విభేదాల కంటే ప్రయోజనాలకే ఎక్కువగా మెగ్గు చూపుతున్నట్లు ఆప్రకటన పేర్కొంది. ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాలను మరియు పరస్పర అభివృద్ధిపై అడుగులు వేస్తుందని తెలిపింది. ప్రపంచ శాంతి మరి అభివృద్ది దిశాగానే ఈ సమావేశం ఏర్పాటు చేయబడిందని ఆ ప్రకటన పేర్కొంది. 

కాగా సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత నెలకొనడంపైనే న్యూఢిల్లీ, బీజింగ్ మధ్య సంబంధాల అభివృద్ధి జరగాలని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

LAC వద్ద ఉన్న అన్ని సమస్యలను ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు మరియు కట్టుబాట్లకు అనుగుణంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇప్పటికే ఉన్న ఒప్పందాల ఉల్లంఘన ద్వైపాక్షిక సంబంధాల యొక్క మొత్తం ప్రాతిపదికను నాశనం చేసిందన్నారు.

కాగా రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలోని భభౌరా గ్రామంలో రాజ్‌పుత్ కుటుంబంలో తండ్రి రామ్ బదన్ సింగ్ మరియు తల్లి గుజరాతీ దేవికి జన్మించారు . అతను రైతుల కుటుంబంలో జన్మించాడు. అతను తన గ్రామంలోని స్థానిక పాఠశాల నుండి తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. అదేవిధంగా గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి మొదటి డివిజన్ ఫలితాలను పొంది భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాడు. బాల్యం నుండి అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భావజాలం నుండి ప్రేరణ పొందాడు. కాగా అతను KB పోస్ట్-గ్రాడ్యుయేట్ కాలేజ్ మిర్జాపూర్, UPలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేశాడు.  అతనికి జైపాల్ సింగ్ అనే ఒక సోదరుడు కూడా ఉన్నాడు.