హోం వర్క్ చేయలేదని కిడ్నాప్‌ డ్రామా

హోం వర్క్‌ చేయలేదని తెలిస్తే టీచర్‌‌ పనిష్మెంట్‌ ఇస్తుందని భయపడి ఓ 8వ తరగతి చదివే స్టూడెంట్‌ ఆడిన కిడ్నాప్‌ డ్రామా అతని తల్లిదండ్రులను, పోలీసులను ఆందోళనకు గురిచేసింది.ఈ ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌‌లో జరిగింది. అసలు ఏం జరిగిందంటే… హిమాచల్‌ప్రదేశ్‌లో గత నెలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో స్కూళ్లకు, కాలేజీలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఆ రాష్ట్ర సర్కార్‌‌ సెలవులు ప్రకటించింది. దీంతో స్టూడెంట్లు ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా వారికి టీచర్లు హోం వర్క్‌ […]

Share:

హోం వర్క్‌ చేయలేదని తెలిస్తే టీచర్‌‌ పనిష్మెంట్‌ ఇస్తుందని భయపడి ఓ 8వ తరగతి చదివే స్టూడెంట్‌ ఆడిన కిడ్నాప్‌ డ్రామా అతని తల్లిదండ్రులను, పోలీసులను ఆందోళనకు గురిచేసింది.ఈ ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌‌లో జరిగింది. అసలు ఏం జరిగిందంటే… హిమాచల్‌ప్రదేశ్‌లో గత నెలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో స్కూళ్లకు, కాలేజీలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఆ రాష్ట్ర సర్కార్‌‌ సెలవులు ప్రకటించింది. దీంతో స్టూడెంట్లు ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా వారికి టీచర్లు హోం వర్క్‌ ఇచ్చారు. స్కూల్‌ లేనన్నీ రోజులు ఆ పిల్లాడు ఇంటి దగ్గర ఫుల్‌ ఎంజాయ్‌ చేశాడు. స్కూల్‌లో ఇచ్చిన హోం వర్క్‌ చేయాలనే విషయమే మర్చిపోయాడు. 

రాష్ట్రంలో వర్షాలు తగ్గడంతో ఇటీవల స్కూల్స్ రీఓపెన్‌ అయ్యాయి. అయితే, తాను హోం వర్క్‌ చేయలేదన్న విషయం ఆ పిల్లాడికి అప్పుడు గుర్తుకొచ్చింది. స్కూల్‌కి వెళ్లను అంటే ఇంట్లో వాళ్లు కొడతారు.. వెళితే హోం వర్క్‌ ఎందుకు చేయలేదని టీచర్లు పనిష్మెంట్‌ ఇస్తారని భయపడ్డాడు. పనిష్మెంట్‌ని తప్పించుకునేందుకు ఏం చేయాలని ఆ స్టూడెంట్‌ ఆలోచించాడు. వెంటనే అతనికి ఓ ఐడియా వచ్చింది. అనుకున్న వెంటనే తన ఐడియాను అమలు చేశాడు.

రోజూ మాదిరిగా స్కూల్‌కు వెళ్లిన ఆ స్టూడెంట్‌.. కొద్దిసేపటికే భయపడుతూ ఇంటికి తిరిగి వచ్చాడు. అతన్ని చూసిన పేరెంట్స్ ఏం జరిగిందని కంగారుగా అడిగాడు. వెంటనే బాలుడు ఓ కట్టుకథను అల్లడం మొదలుపెట్టాడు. ‘‘నేను స్కూల్‌కి వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు మాస్క్‌ ధరించి, బైక్‌పై నా దగ్గరకు వచ్చారు. వారితో మాట్లాడుతుండగానే, అందులో ఒకడు కర్చీఫ్‌ తీసుకోని నా ముక్కుపై పెట్టాడు. ఆ వెంటనే నేను స్పృహ తప్పి పడిపోవడంతో వారు నన్ను బైక్‌పై ఎక్కించుకొని వెళ్లారు. మధ్యలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద  వారి బైక్‌ ఆగడంతో నాకు మెలుకువ వచ్చింది. వెంటనే నేను అరుద్దామంటే నా నోరును మూసివేశారు. అయినా నేను అరవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. వారిద్దరూ భయపడుతుండగా, నేను బైక్‌ దిగి పారిపోయి వచ్చాను” అని పేరెంట్స్‌ కి చెప్పాడు. 

ఈ విషయం విని తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ వెంటనే వారు పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి తమ పిల్లాడు స్కూల్‌కి నడుచుకుంటూ వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. అలర్ట్‌ అయిన పోలీసులు.. ఆ పిల్లాడు వెళ్లిన రూట్‌లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అయితే, వారు చెప్పినట్లు అక్కడ ఎలాంటి కిడ్నాప్‌ జరగలేదు. ఇదంతా ఆ పిల్లాడు కావాలనే ఆడిన డ్రామా అని పోలీసులు తెలుసుకున్నారు.  ఆ తర్వాత తల్లిదండ్రులతో పాటు ఆ స్టూడెంట్‌ని పోలీసులు స్టేషన్‌కి పిలిపించారు. ఏం జరిగిందని అడగగా, ఆ పిల్లాడు తల్లిదండ్రులకు చెప్పిన స్టోరీనే పోలీసులకు చెప్పాడు. నువ్వు చెబుతుందంతా అబద్ధం అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అని ఆ పిల్లాడిని పోలీసులు గట్టిగా అడిగాడు. దీంతో తాను కిడ్నాప్‌ డ్రామా ఆడినట్లు స్టూడెంట్‌ ఒప్పుకున్నాడు. అతను చెప్పిన విషయాన్ని విని పోలీసులు కంగుతిన్నారు. 

‘‘హాలీడేస్‌లో టీచర్లు హోం వర్క్‌ ఇచ్చారని, అయితే, హోం వర్క్‌ చేయడం తాను మర్చిపోయానని చెప్పాడు. హోం వర్క్‌ చేయకుండా స్కూల్‌కి వెళ్తే టీచర్‌‌ పనిష్మెంట్‌ ఇస్తుందని భయపడ్డాను. పనిష్మెంట్‌ నుంచి తప్పించుకునేందుకు నేను కిడ్నాప్‌ డ్రామా ఆడాను” అని చెప్పాడు. హిమాచల్‌ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు నెల రోజుల పాటు సెలవులు ఇచ్చారు. జులై 31వ తేదీ స్కూల్స్‌ రీఓపెన్‌ అయ్యాయి.