రాంగ్ రూట్లో ప్రయాణించిన బస్సు..

ఏకంగా ఆరుగురు మృతి.. ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు అంతకు అంతకు ఎక్కువవుతున్నాయి. ఢిల్లీలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఒక స్కూల్ బస్సు ఒక కారును ఢీ కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ యాక్సిడెంట్ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.  విషాద సంఘటన:  ఢిల్లీలో మంగళవారం ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 8 కిలోమీటర్ల నుంచి రాంగ్ రూట్ లో ప్రయాణిస్తూ వచ్చిన ఒక […]

Share:

ఏకంగా ఆరుగురు మృతి..

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు అంతకు అంతకు ఎక్కువవుతున్నాయి. ఢిల్లీలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఒక స్కూల్ బస్సు ఒక కారును ఢీ కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ యాక్సిడెంట్ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. 

విషాద సంఘటన: 

ఢిల్లీలో మంగళవారం ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 8 కిలోమీటర్ల నుంచి రాంగ్ రూట్ లో ప్రయాణిస్తూ వచ్చిన ఒక స్కూలు బస్సు, రైట్ రూట్ లో వెళ్తున్న ఒక కారును ఢీ కొట్టడం జరిగింది. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన ఈ సంఘటన ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. సుమారు ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసు వారు నిర్ధారించారు. ఈ సంఘటనలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. 

ఘజియాబాద్ ప్రాంతానికి చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు మాట్లాడుతూ, బస్సు ఘాజీపూర్ సరిహద్దు సమీపంలోని CNG పంపు వద్ద ఆగిపోయింది. ఆ తర్వాత నుంచి అది ఎక్స్‌ప్రెస్‌వే పైన రాంగ్ సైడ్‌లో నడుస్తూ వచ్చింది. ఇదే సమయంలో రైట్ రూట్ లో వస్తున్న కారును ఢీ కొట్టిన కారణంగా, ఈ దుర్ఘటన సంభవించిందని తెలిపారు. 

ఈ దుర్ఘటన సంభవించిన తర్వాత పోలీస్ వారు బస్సు డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం కూడా జరిగింది. రాంగ్ రూట్లో వెళ్లడం తన తప్పే అని డ్రైవర్ ఒప్పుకోవడం జరిగింది.

దుఃఖంలో కుటుంబ సభ్యులు: 

ఒకే కుటుంబానికి చెందిన కొంతమంది సభ్యులు కారులో మీరట్టు నుంచి గూర్గ్రామ్ కి వెళ్తున్నారు. హఠాత్తుగా విజయనగర చౌక్ దగ్గరలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసు వారు చెప్పిన ప్రకారం కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన అనంతరం ఆరుగురు ప్రాణాలతో లేరని, ఇద్దరు తీవ్రమైన దెబ్బలతో బయటపడినట్లు తెలిపారు. 

ఈ ప్రమాదంలో కారు ముందరి భాగం చిత్తుచిత్తు అయిపోయింది. అసలు చనిపోయిన వారిని బయటకి తీసేందుకు కూడా వీలుపడనంత విధంగా కారు తయారవడం వల్ల, అతి కష్టం మీద గ్యాస్ కట్టర్ ఉపయోగించి డోర్స్ ని కట్ చేయడం జరిగిందని పోలీసు వారు తెలిపారు. ఒకే కుటుంబంలో మొత్తం ఆరుగురు చనిపోవడంతో, వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 

చూసినవాళ్లు ఏం చెబుతున్నారు: 

సుమారు ఉదయం ఆరు గంటలకు జరిగిన ఈ దుర్ఘటన చాలా భయానికంగా అనిపించిందని, ఒక బస్సు వేగంగా రాంగ్ రూట్లో వచ్చి, రైట్ రూట్ లో వెళ్తున్న కారును ఢీకొట్టడం చాలా చాలా భయానకమని చూసిన వారు చెప్తున్నారు. ఈ సంఘటనలో మొత్తం ఆరుగురు చనిపోవడం చాలా దురదృష్టకరమని అటుగా వెళుతున్న ప్రయాణికులు బాధతో మాట్లాడారు. 

మనం ముఖ్యంగా హైవే మీద ప్రయాణిస్తున్నప్పుడు రాంగ్ రూట్లో వెళ్లడం చాలా ప్రమాదకరమని చాలా మంది భావిస్తున్నారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా, రాంగ్ రూట్ లో ప్రయాణం చేయకూడదని, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రయాణికులకు హెచ్చరించారు పోలీసులు. అయితే ఉదయం స్కూల్ బస్సు రాంగ్ రూట్ లో వెళ్తున్నప్పుడు అందులో ఒక స్టూడెంట్ కూడా లేరని పోలీస్ వారు నిర్ధారించారు.