SCO ప్రధాన న్యాయమూర్తుల సమావేశానికి సుప్రీంకోర్టు ఆతిథ్యం
పాల్గొననున్న చైనా, రష్యాలు, వైదొలిగిన పాకిస్థాన్

షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల ప్రధాన న్యాయమూర్తుల సమావేశానికి సుప్రీంకోర్టు 3 రోజుల పాటు ఆతిథ్యం ఇవ్వనుంది. చైనా, రష్యాలు ఈ ఈవెంట్‌లో పాల్గొంటుండగా, పాకిస్థాన్ మాత్రం వైదొలిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్, ఎస్సీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ కె కౌల్, కెఎం జోసెఫ్ లు పాల్గొననున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్) సభ్య దేశాల సుప్రీం కోర్టుల ప్రధాన న్యాయమూర్తుల 18వ […]

Share:

షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల ప్రధాన న్యాయమూర్తుల సమావేశానికి సుప్రీంకోర్టు 3 రోజుల పాటు ఆతిథ్యం ఇవ్వనుంది. చైనా, రష్యాలు ఈ ఈవెంట్‌లో పాల్గొంటుండగా, పాకిస్థాన్ మాత్రం వైదొలిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశంలో భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్, ఎస్సీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ కె కౌల్, కెఎం జోసెఫ్ లు పాల్గొననున్నారు.

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్) సభ్య దేశాల సుప్రీం కోర్టుల ప్రధాన న్యాయమూర్తుల 18వ సమావేశానికి భారతదేశ సుప్రీం కోర్ట్ మార్చి 10 నుండి 12 వరకు దేశ రాజధానిలో ఆతిథ్యం ఇవ్వనుంది.

ఈ సమావేశంలో భారత ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్, ఎస్సీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ కె కౌల్, కెఎం జోసెఫ్ లు పాల్గొననున్నారు.

అయితే సమావేశంలో చైనా, రష్యాలు ఈ ఈవెంట్‌లో పాల్గొంటుండగా, పాకిస్థాన్ మాత్రం వైదొలిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

భారతదేశపు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ “స్మార్ట్ కోర్టులు”, న్యాయవ్యవస్థ యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడతారు, అయితే జస్టిస్ కౌల్.. న్యాయానికి యాక్సెస్ సులభతరం చేయడం ఎలాగనే దాని గురించి మాట్లాడతారు. అలాగే, జస్టిస్ జోసెఫ్ న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సంస్థాగత సవాళ్లపై ప్రసంగిస్తారు.

సభ్య దేశాలు, పరిశీలకుల రాష్ట్రాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, ఛైర్‌పర్సన్‌లు, న్యాయమూర్తులు, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సెక్రటేరియట్, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ (ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక సంస్థ – RATS) ప్రతినిధులతో సమావేశం, చర్చలు ఉంటాయని, ఒక ఉమ్మడి ప్రకటనపై సంతకంతో ఈ సమావేశం ముగుస్తుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.

షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ నిరంతరం తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో, న్యాయపరంగా అత్యున్నతమైన కేసులలో పరస్పర చర్యలు చాలా పాపులర్ అయ్యాయని అంటున్నారు. సర్వోన్నత న్యాయస్థానాల అధ్యక్షుల సమావేశం వల్ల విస్తృత శ్రేణి సమస్యలపై చర్చలు జరపడానికి అవకాశం వస్తుందని, పరస్పర సంబంధాల అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని, న్యాయవ్యవస్థ యొక్క పనిని మరింతగా మెరుగుపరచడానికి యంత్రాంగాల అభివృద్ధికి అవకాశం దొరుకుతుందని కూడా ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001లో కజకిస్థాన్, కిర్గిస్థాన్, చైనా, రష్యా, తజికిస్తాన్ లు సంతకం చేసిన తర్వాత ఏర్పడిన “షాంఘై ఫైవ్” ఆధారంగా రూపొందించబడింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన లక్ష్యం.. సభ్య దేశాల మధ్య అనేక రంగాలలో సమర్థవంతమైన సహకారాన్ని ప్రోత్సహించడం,  పొరుగుదేశాలతో పరస్పర విశ్వాసం, స్నేహాలను బలోపేతం చేయడం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చైనా, భారతదేశం, కజకిస్తాన్, కిర్గిస్థాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ట్రాన్, మంగోలియా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పరిశీలకులను కలిగి ఉండగా.. ఆర్మేనియా, అజర్‌బైజాన్, కంబోడియా, నేపాల్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క డైలాగ్ పార్టనర్స్.

ఈ సంఘం యొక్క మొదటి సమావేశం.. 2006 సెప్టెంబర్ 22న షాంఘైలో జరిగింది. 17వ సమావేశం దుషాన్‌బేలో జరిగింది. గత సంవత్సరం సమర్‌కండ్ డిక్లరేషన్ ద్వారా సెప్టెంబరు 2022లో ఒక సంవత్సరం పాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో రొటేషనల్  ప్రెసిడెన్సీ భారతదేశాన్ని వరించింది.