లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌కి సుప్రీం కోర్ట్ నోటీసు

అసలు విషయం ఏమిటి?:  రాష్ట్ర బ్యూరోక్రసీపై, కేంద్రానికి నియంత్రణ కల్పించే ఆర్డినెన్స్ విషయంలో సవాలు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను పెండింగ్‌లో ఉంచాలని నగర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను బెంచ్ తిరస్కరించింది, అయితే నగరంలో 400 మంది ‘ స్పెషలిస్ట్స్ను’ తొలగించడానికి ఆర్డినెన్స్ ఉపయోగించారని, ఢిల్లీ ప్రభుత్వం ఆ విషయాన్ని తెలియజేయడంతో సోమవారం ఈ అసలు విషయాన్ని చర్చించడానికి ఒప్పుకోవడం జరిగింది.  […]

Share:

అసలు విషయం ఏమిటి?: 

రాష్ట్ర బ్యూరోక్రసీపై, కేంద్రానికి నియంత్రణ కల్పించే ఆర్డినెన్స్ విషయంలో సవాలు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను పెండింగ్‌లో ఉంచాలని నగర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను బెంచ్ తిరస్కరించింది, అయితే నగరంలో 400 మంది ‘ స్పెషలిస్ట్స్ను’ తొలగించడానికి ఆర్డినెన్స్ ఉపయోగించారని, ఢిల్లీ ప్రభుత్వం ఆ విషయాన్ని తెలియజేయడంతో సోమవారం ఈ అసలు విషయాన్ని చర్చించడానికి ఒప్పుకోవడం జరిగింది. 

లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను ప్రతివాదిగా, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధనంజయ వై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలు ఉన్న ధర్మాసనాన్ని చేర్చాలని ఢిల్లీ ప్రభుత్వం కోరిన అంశాన్ని పరిగణలోకి తీసుకొని, ఎల్‌జీకి సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది.

కోర్టు ఎందుకు కలగజేసుకుంటుంది?: 

“ఈ కోర్టు ఆర్డినెన్స్‌పై స్టే విధించాలి, లేదంటే ఢిల్లీ ప్రభుత్వ కన్సల్టెంట్లను తొలగించే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ఈ ఉత్తర్వును నిలిపివేయాలి” అని ఢిల్లీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి అన్నారు. అయితే ఈ విషయంపై, కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఎల్‌జీ తరఫు సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ జైన్‌లు ఆర్డినెన్స్‌పై స్టే విధించాలన్న పిటిషన్‌పై స్పందనను సమర్పించాల్సిందిగా కోర్టు కోరింది.

నిజానికి, సంబంధం లేని అంశంలో కోర్టు జోక్యం చేసుకోవడంపై కేంద్రం మరియు ఎల్‌జి రెండూ వ్యతిరేకించాయి. అయితే ఎవరినైతే తొలగించారో, వారిలో ఒకరు శాసనసభ సభ్యుని (ఎమ్మెల్యే) భార్య ఉన్నారని. ప్రతి విషయంలోనూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆనవాయితీగా మారిపోయింది అన్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఆ నాలుగు వందల మందిలో ఆమె తప్ప మరెవరు కూడా కోర్టును ఆశ్రయించలేదని మెహతా చెప్పారు. 

అయితే కార్యకర్తలు ఎవరైనా సరే వారు బాధితులు అయితే హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటు ఉంది. కానీ 400 మంది పార్టీ కార్యకర్తలను తొలగించడాన్ని ప్రశ్నించడానికి ఈ కోర్టులోని ఆర్టికల్ 32 అధికారాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఏముంది.. అసలు ఇలా కూడా ఉపయోగిస్తారా అంటూ సంజయ్ జైన్ ప్రశ్నించడం కూడా జరిగింది. ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ జూన్ 30న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన తర్వాత, జూలై 3న వచ్చిన ఎల్‌జీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దరఖాస్తును రీ ఓపెన్ చేసినట్లు, ఈ విషయం గురించి సింఘ్వీ తెలిపారు.

ఈ విషయంపై కోర్టు ఏమంటుంది?: 

మధ్యంతర ఉపశమనం కోసం వారి (ఢిల్లీ ప్రభుత్వం) చేసిన పిటిషన్ ఒకసారి చూడొచ్చని, ఈ విషయం గురించి వచ్చే సోమవారం నాడు చేపడతాం అని కోర్టు తెలిపింది. అంతేకాకుండా ఆర్డినెన్స్‌పై స్టే విధించాలని ఆయన ఒత్తిడి చేస్తున్నారని.. ఒకవేళ అతను దరఖాస్తు మీద చర్చించాలనుకుంటే మేమేమీ చేయలేమని కోర్టు, మెహతాకు తేల్చి చెప్పింది.

ఆర్డినెన్స్‌పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు తన అధికారాలను వినియోగించుకున్న అనేక సందర్భాలను సింఘ్వీ కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ ఆర్డినెన్స్‌ను రద్దు చేసే ప్రయత్నంలో ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (GNCTD) చట్టంలో మార్పులను ప్రవేశపెట్టింది. సేవలపై ఢిల్లీ ప్రభుత్వ నియంత్రణను తీసివేస్తూ 2015లో నోటిఫికేషన్‌ను తీసుకొచ్చినందుకు కేంద్రంపై సుప్రీంకోర్టు మే 11న తీర్పునిచ్చింది.