సుప్రీం కోర్టు ప్రత్యేక వెబ్ పేజీకి కేశవానంద భారతి కేసు

కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ కేరళగా ప్రాచుర్యం పొందిన కేసు తీర్పు వెలువడి 50 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భాన్ని పుస్కరించుకుని సుప్రీం కోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలతో ప్రత్యేకంగా ఓ వెబ్ పేజీని ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. రాజ్యాంగ మౌలిక స్వరూపం, పౌరుల హక్కులకు సంబంధించి అత్యంత కీలకమైన కేసుగా కేశవా నంద భారతి కేసు న్యాయ చరిత్రలో నిలిచింది. కేరళ భూసంస్కరణ చట్టాన్ని సవాల్ […]

Share:

కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ కేరళగా ప్రాచుర్యం పొందిన కేసు తీర్పు వెలువడి 50 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భాన్ని పుస్కరించుకుని సుప్రీం కోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలతో ప్రత్యేకంగా ఓ వెబ్ పేజీని ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. రాజ్యాంగ మౌలిక స్వరూపం, పౌరుల హక్కులకు సంబంధించి అత్యంత కీలకమైన కేసుగా కేశవా నంద భారతి కేసు న్యాయ చరిత్రలో నిలిచింది. కేరళ భూసంస్కరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఈ కేసులో తీర్పు.. తదనంతరం ఏన్నో కేసులకు దిక్సూచిగా నిలుస్తొంది. యావత్ ప్రపంచ పరిశోధకులు వీక్షించేందుకు వీలుగా కేశవానంద భారతి కేసుకు సంబంధించి ఉన్న అన్ని లిఖిత పూర్వక రికార్డులతో కూడిన ఓ వెబ్ పేజీని ఏర్పాటు చేసినట్లు సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం (1973 ఏప్రిల్ 24న) దీనికి సంబంధించిన తుది తీర్పు వెలువడిందని చెప్పారు. సుప్రీం కోర్టు తీసుకున్న ఈ కీలక నిర్ణయానికి కోర్టు హాలులో ఉన్న న్యాయవాదులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. పరిశోధకులు, విద్యార్ధులు, న్యాయవాదులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 

కేశవా నంద భారతి కేసు పూర్తి వివరాలు ఇవి

అయిదు దశాబ్దాల క్రితం ఆశ్రమాల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దానిపై అథ్యాత్మిక గురువు కేశవా నంద భారతి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అందులో భాగంగా పార్లమెంట్ చేసిన 24, 25, 29 వ రాజ్యాంగ సవరణలు చెల్లుబాటును కూడా కేశవానంద భారతి సవాల్ చేశారు. ఆ సవరణలు న్యాయ వ్యవస్థ అధికారాలతో పాటు పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ 1972 అక్టోబర్ 31న ప్రారంభం కాగా, 1973 మార్చి 24 వరకూ సాగింది

ఈ కేసు విచారణకు మొట్ట మొదటి సారిగా 13 మంది న్యాయమూర్తులతో విస్తృత రాజ్యాంగ ధర్మాసనాన్ని అప్పటి సీ జే ఏర్పాటు చేశారు. 

విచారణ సందర్భంగా రాజ్యాంగంలోని ప్రాధమిక సూత్రాలు, మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంట్ కు ఉన్నదా లేదా అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. దీనిపై దాదాపు 68 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం విస్తృత ధర్మాసనం.. రాజ్యాంగ మౌలిక సిద్ధాంతానికి సుప్రీం కోర్టే సంరక్షణదారు అని చారిత్రాత్మక తీర్పు చెప్పింది. రాజ్యాంగంలోని ఏ విషయంలో అయినా సవరణలు చేసే అధికారం పార్లమెంట్ కు ఉన్నప్పటికీ మౌలిక స్వరూపాన్ని, ప్రాధమిక హక్కులను మార్చలేదని తెలిపింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం వాటి సంరక్షణ బాధ్యత చూస్తుందని స్పష్టం చేసింది. అంటే.. ప్రజాస్వామ్యం, లౌకకవాదం, సమాఖ్య, చట్టం అందరికీ సమానం వంటివి రాజ్యాంగ ప్రాథమిక సూత్రాల మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్ కు లేదని స్పష్టం చేసింది. అప్పట్లో ఆ కేసు సృష్టించిన సంచలనం అంటా ఇంతా కాదు. ఇప్పుడు కేశవానంద భారతి కేసుకు సంబంధించి ఉన్న అన్ని లిఖిత పూర్వక రికార్డులతో కూడిన ఓ వెబ్ పేజీని ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో ఈ విషయం మళ్ళీ తెరపైకి వచ్చింది.