చెత్తలు క్లీన్ చేసిన‌ గ్రామపంచాయతీ సర్పంచ్

మీరు చూస్తున్నట్లయితే నల్గొండ డిస్ట్రిక్ట్ లోని గ్రామపంచాయతీ కి చెందిన సర్పంచ్ వీధి వీధికి వెళ్లి కాలువలలోని చెత్త శుభ్రం చేసి వాటిని నిర్మాణస్య ప్రాంతంలో డిస్పోస్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వస్తున్న వర్షాకాలం కారణంగా ఎక్కడ కూడా నీరు నిలవకుండా ప్రజలకు అనారోగ్యం అంటకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతానికి పలు చోట్ల కార్మికుల స్ట్రైక్ కారణంగా ఎవరు పనిచేసేందుకు రావట్లేదని, అయితే ప్రజలు తమ పని తమ చేసుకోవడానికి సిగ్గు […]

Share:

మీరు చూస్తున్నట్లయితే నల్గొండ డిస్ట్రిక్ట్ లోని గ్రామపంచాయతీ కి చెందిన సర్పంచ్ వీధి వీధికి వెళ్లి కాలువలలోని చెత్త శుభ్రం చేసి వాటిని నిర్మాణస్య ప్రాంతంలో డిస్పోస్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వస్తున్న వర్షాకాలం కారణంగా ఎక్కడ కూడా నీరు నిలవకుండా ప్రజలకు అనారోగ్యం అంటకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతానికి పలు చోట్ల కార్మికుల స్ట్రైక్ కారణంగా ఎవరు పనిచేసేందుకు రావట్లేదని, అయితే ప్రజలు తమ పని తమ చేసుకోవడానికి సిగ్గు పడకూడదని ప్రతి ఒక్కరికి తమ గ్రామం శుభ్రపరచుకోవడంలో హక్కు ఉంటుందని ఆయన ఈ విధంగా చేసి చూపించారు. 

చెత్త శుభ్రం చేస్తున్న సర్పంచ్: 

గత 10 రోజులుగా గ్రామపంచాయతీ సిబ్బంది డ్రైవర్లు, బిల్ కలెక్టర్లు, పారిశుధ్య కార్మికుల సమ్మె కారణంగా గ్రామస్థాయిలో సాధారణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బంది కోరుతున్నారు. 10 రోజులుగా పారిశుధ్య పనులు నిలిచిపోవడంతో చెత్తాచెదారం, డ్రైనేజీలు ఎక్కడికక్కడే వదిలేశారని, గ్రామపంచాయతీ స్థాయిలో ఎవరూ పనిచేయడం లేదని, దీనిపై స్పందించి ఇంటింటికీ చెత్తను సేకరించి ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు గ్రామ సర్పంచ్ బోగారి రాంబాబు. 

కాంగ్రెస్ తరపున సర్పంచ్‌గా ఎన్నికైన రాంబాబు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, వారి డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతే, ముఖ్యంగా వర్షాకాలంలో పారిశుధ్యం విషయంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. 

చేయి చేయి కలపాలి: 

గ్రామంలోని వివిధ ప్రదేశాలలో మోటారు-పంప్ సెట్లు ఏర్పాటు చేయడానికి, తగిన నీటి సౌకర్యం కల్పించడానికి, ఎలక్ట్రీషియన్లు మరియు ప్లంబర్లతో సహా అదనపు సిబ్బందిని నియమించానని ఆయన చెప్పారు. పంచాయతీ కార్యాలయ సిబ్బంది సమ్మె చేసినప్పటికీ, గ్రామాధికారిగా బాధ్యతలను నిర్వర్తించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలనే లక్ష్యంతో పరిసరాలను శుభ్రం చేయడంలో చేయి చేయి కలపాలని నివాసితులను కూడా ప్రోత్సహిస్తున్నాను అని రాంబాబు వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 12,769 పంచాయతీ కార్యాలయాల్లో స్వీపర్లు, బిల్ కలెక్టర్లు, పారిశుధ్య కార్మికులు, ఎలక్ట్రీషియన్లు వంటి వివిధ పాత్రల్లో సుమారు 50,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 

వర్షాకాలంలో శుభ్రం చాలా ముఖ్యం: 

వర్షాకాలం వచ్చిందంటే చాలు అంటువ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఎక్కువవుతాయి. ప్రతి ఒక్కరు కూడా వర్షాకాలంలో తమ ఇంటి పరిశుభ్రత కోసం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఇంట్లోనే కాకుండా, చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎవరో వచ్చి మన చుట్టుపక్కల శుభ్రం చేస్తారని మనం ఎదురు చూడకుండా, ఇప్పుడు నల్గొండలో గ్రామ సర్పంచ్ చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు తమ వంతు శుభ్రం చేయడానికి చేతులు కలపాలి. 

మా ఇంట్లో శుభ్రంగా ఉంటే చాలు బయట శుభ్రం ఎందుకు, అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, బయట మురికి, చెత్త ఎక్కువ కాలం నిలువ ఉంటే కనుక, వాటి నుంచి అనారోగ్యం ఈజీగా వ్యాపిస్తుంది. అందుకే చుట్టుపక్కల ఎవరు శుభ్రం చేసినా చేయకపోయినా, ఎవరికి వారు తమ వంతుగా చుట్టుపక్కల శుభ్రం చేసుకోవడం నేర్చుకుంటే ఎంతో ఉత్తమం.