Chandrababu Naidu: టిడిపిని తప్పుడు ప్రచారం చేయకండి అంటున్న సజ్జల

ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ ముఖ్య సూత్రధారిగా ఉన్న చంద్రబాబు నాయుడు జైలు జీవితాన్ని ప్రస్తుతం గడుపుతున్న వైనం కనిపిస్తోంది. అయితే ఆయన ఆరోగ్య(Health) పరిస్థితి విషమించింది అని, డీహైడ్రేషన్ ప్రాబ్లం తో బాధపడుతున్నాడని,  చాలామంది కుట్రపన్నీ తన తండ్రిని కావాలనే చంపడానికి చూస్తున్నారని, స్టెరాయిడ్స్ ఇస్తున్నారని, అంతేకాకుండా ఆయనకి ఎలర్జీ ఉన్నప్పటికీ దోమల మధ్య పడుకోబడుతున్నారని, ఇటీవల లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు లేవని సజ్జల మాట్లాడారు.  తప్పుడు ప్రచారం […]

Share:

ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ ముఖ్య సూత్రధారిగా ఉన్న చంద్రబాబు నాయుడు జైలు జీవితాన్ని ప్రస్తుతం గడుపుతున్న వైనం కనిపిస్తోంది. అయితే ఆయన ఆరోగ్య(Health) పరిస్థితి విషమించింది అని, డీహైడ్రేషన్ ప్రాబ్లం తో బాధపడుతున్నాడని,  చాలామంది కుట్రపన్నీ తన తండ్రిని కావాలనే చంపడానికి చూస్తున్నారని, స్టెరాయిడ్స్ ఇస్తున్నారని, అంతేకాకుండా ఆయనకి ఎలర్జీ ఉన్నప్పటికీ దోమల మధ్య పడుకోబడుతున్నారని, ఇటీవల లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు లేవని సజ్జల మాట్లాడారు. 

తప్పుడు ప్రచారం చేయకండి అంటున్న సజ్జల: 

వైఎస్ఆర్సిపి జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణ మాట్లాడుతూ, తెలుగుదేశం(TDP) పార్టీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తుందని, నిజానికి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితి విషమించింది అంటూ తప్పుడు ప్రచారం చేసింది తెలుగుదేశం(TDP) అని, చంద్రబాబు నాయుడు జైలు జీవితం బానే ఉందని, నిజానికి చంద్రబాబు నాయుడు ఒక కేజీ బరువు కూడా పెరిగారని మీడియా ముందు చెప్పారు సజ్జల. చంద్రబాబు నాయుడు రిమాండ్(remand) లో ఒక కేసు(Case) విషయం మీద జైలుకు వెళ్లాడు, అంతేకానీ చంద్రబాబు నాయుడు తన అత్తారింటికి వెళ్ళలేదు.. అంటూ చంద్రబాబు(Chandrababu Naidu) జైలు జీవితం గురించి మాట్లాడారు సజ్జల. అంతేకాకుండా లాలూ ప్రసాద్, ఓం ప్రకాష్ వంటి వాళ్లు చంద్రబాబు(Chandrababu Naidu) నాయుడు కన్నా వయసులో పెద్దవారైనప్పటికీ జైలు జీవితం గడిపారని మాట్లాడారు. 

చంద్రబాబు నాయుడు కుటుంబం భయపడుతున్నట్టుగా పరిస్థితులు లేవని, ఆయనకి ఆరోగ్యం(Health) అంత బానే ఉందని, 24 గంటలు ఆరోగ్య(Health) పరిస్థితిని సంరక్షించడానికి డాక్టర్ అవైలబుల్ గా ఉంటూ ఆయన ఆరోగ్య(Health) పరిస్థితిని చూస్తున్నారని, ఆయనకి సకాలంలో ఆహారం, తాగడానికి అన్ని కూడా సదుపాయాలు కల్పిస్తున్నారని సజ్జల చంద్రబాబు నాయుడు ఆరోగ్య(Health) పరిస్థితి గురించి క్లియర్గా వివరించారు. 

స్కిల్ డెవలప్మెంట్ కేసు: 

చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పలు కేసు(Case)లు విషయంలో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ముఖ్య సూత్రధారిగా ఉన్న చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కేసు(Case)లో ఎలాంటి మలుపులు ఉన్నాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అనేది సిఐడి చీఫ్ సంజయ్ ప్రస్తుతం పూర్తిగా వివరించడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ ఫినాన్స్ సెక్రటరీ రమేష్ ప్రశ్నించడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్(remand) పొడిగించడం జరిగింది. 

చంద్రబాబు నాయుడు పర్సనల్ అసిస్టెంట్ అయిన శ్రీనివాస్ ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా పలుసార్లు ప్రశ్నించడం జరిగిందని అంతేకాకుండా చంద్రబాబు(Chandrababu Naidu) నాయుడుకి ఇటీవల ఐటీ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే అని ఆయన చెప్పుకోచారు. అయితే 100 కోట్ల స్కాం గురించి ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాత నాయుడు పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్న శ్రీనివాస్ అదే విధంగా మరో వ్యక్తి స్కాంలో కీలక వ్యక్తులుగా నిర్ధారించడం జరిగింది. 

అంతే కాకుండా, వారు ఎలా ఫేక్ ఇన్వాయిస్లను జనరేట్ చేసిన విషయం కూడా ఐటీ శాఖ, అదే విధంగా ED ప్రశ్నించడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా రూ. 241 కోట్లు ముఖ్య సూత్రధారికి మళ్ళించినట్లు స్పష్టమైనప్పటికీ, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో కాస్త గ్యాప్ కొనసాగుతోందని, అంతేకాకుండా ఇతర కేసు(Case)ల విషయంలో కూడా నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఆయన తనయుడు నారా లోకేష్ హస్తము ఉన్నట్లుగా కూడా గుర్తించినట్లు సిఐడి చీఫ్ సంజయ్ మాట్లాడడం జరిగింది. 

2018 నుంచి కూడా జిఎస్టి ద్వారా బయటపడిన కొన్ని ముఖ్య అంశాల మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని, అంతేకాకుండా జిఎస్టి విషయంపై 2021లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు కూడా సిఐడి వారు వెల్లడించారు. ఇందులో పై ఆఫీసర్ల హస్తం కూడా ఉన్నట్లు వాళ్ళు గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కింద పని చేసే శ్రీనివాస్ అదే విధంగా మరో వ్యక్తి మనోజులకు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ, వారు విదేశాలకు పారిపోయారని ఆయన వెల్లడించారు.