సీమాకు లైవ్ లోనే ముద్దు పెట్టబోయిన సచిన్

పబ్జీ గేమ్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి కోసం సరిహద్దులు దాటి ఇండియాకు వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా సీమా ఏ ముహూర్తాన భారత్ కు వచ్చిందో కానీ ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నేషనల్ మీడియా, సోషల్ మీడియా, రీజనల్ మీడియా అనే తేడా లేకుండా అందరి దృష్టి సీమా మీద పడింది. దీంతో సీమా ఒక్కసారిగా స్టార్ డమ్ సంపాదించుకుంది. సీమ ఎంత పెద్ద […]

Share:

పబ్జీ గేమ్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి కోసం సరిహద్దులు దాటి ఇండియాకు వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా సీమా ఏ ముహూర్తాన భారత్ కు వచ్చిందో కానీ ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నేషనల్ మీడియా, సోషల్ మీడియా, రీజనల్ మీడియా అనే తేడా లేకుండా అందరి దృష్టి సీమా మీద పడింది. దీంతో సీమా ఒక్కసారిగా స్టార్ డమ్ సంపాదించుకుంది. సీమ ఎంత పెద్ద స్టార్ అయిందంటే ఆమెతో ఓ సినిమా కూడా చేస్తున్నారు. 

కొత్త ప్రయాణం మొదలుపెట్టిన సీమా

సీమా హైదర్ పాక్ లో ఒక సాధారణ గృహిణి. తన కున్న పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఉండే ఒక సాధారణ మధ్య తరగతి మహిళ. కానీ సీమా హైదర్ ఎప్పుడైతే తన పబ్జీ లవర్ కోసం సరిహద్దు దాటి ఇండియాకు వచ్చిందో అప్పుడే స్టార్ అయిపోయింది. తర్వాత సీమా హైదర్ గూఢచార్యం చేసిందనే ఆరోపణలతో ఆమె మరింత పాపులర్ అయింది. సీమా ఎంత పాపులర్ అయిందంటే సీమాను లీడ్ రోల్ లో పెట్టి ఓ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ఎక్కడో సాధారణ గృహిణిగా జీవితం గడిపిన సీమా ఇటువంటి లైఫ్ వస్తుందని ఊహించి ఉండదు. సీమా హైదర్ చంద్రయాన్-3 చంద్రుడి మీద ల్యాండ్ అయ్యే క్రూషియల్ డే నాడు రోజు మొత్తం ఉపవాసం చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

లైవ్ లోనే ముద్దు

సీమా హైదర్ సచిన్ మీనాలు ప్రస్తుతం దేశంలో ట్రెండింగ్ లో ఉన్న కపుల్. వీరి కోసం చాలా టెలివిజన్స్ పోటీ పడుతున్నాయి. అంతే కాకుండా ఎంతో మంది వీరి వీడియోలను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓ జాతీయ మీడియా వీరితో ఇంటర్వ్యూని ప్లాన్ చేసింది. వీరిని లైవ్ లోకి తీసుకోవడమే కాకుండా వీరిపై చర్చించేందుకు కొంత మందిని కూడా సెట్ చేసింది. సీమా హైదర్ రాఖీ పౌర్ణమి, నాగుల పంచమి, తదితర హిందూ వేడుకలను సాంప్రదాయబద్ధంగా చేసుకోవడం గురించి వీరు చర్చిస్తున్నారు. వీరిద్దరూ కూడా లైవ్ లోనే ఉన్నారు. ఇంతలో సచిన్ మీనాకు ఏం అనిపించిందో ఏమో కానీ లైవ్ లోనే ఆమెకు ముద్దు పెట్టేందుకు ట్రై చేశాడు. ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు వీరిని మోస్ట్ రొమాంటిక్ కపుల్ అని పిలుస్తున్నారు. 

అడ్డు తగిలిన యాంకర్

సచిన్ మీనా సీమా హైదర్ కు లైవ్ లోనే ముద్దు పెట్టబోతుంటే యాంకర్ అడ్డు తగిలాడు. అరే భాయ్ మీరు ఏం చేస్తున్నారు. ఇది లైవ్ కార్యక్రమం. కెమెరా ఆన్ లో ఉందని ఆయన వారించాడు. దీంతో సచిన్ తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యం కావడంతో అది తెగ వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. సచిన్ మరీ చిలిపిగా తయారవుతున్నాడని అంటున్నారు. సీమా హైదర్ కూడా బొట్టు కట్టుతో పూర్తి హిందూ మహిళగా మారిపోయింది. పాకిస్తాన్ నుంచి వచ్చినా కానీ హిందుత్వను ఆమె పూర్తిగా ఫాలో అవుతోంది. 

తన్నుకొస్తున్న ఆఫర్లు

పాక్ నుంచి వచ్చిన సీమా హైదర్ కు అనేక ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమెతో కొందరు ఒక సినిమాకు ప్లాన్ చేయగా.. మరి కొద్ది రోజుల్లో మొదలయ్యే బిగ్ బాస్ 17 లో ఈమె పాల్గొంటుందని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా కపిల్ శర్మ నిర్వహించే కామెడీ షోలో కూడా పాల్గొంటుందని సోషల్ టాక్ నడుస్తోంది. కానీ ఈ ఆఫర్ల మీద ఇంత వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం ఊహాగానాలే వినిపిస్తున్నాయి. పుకార్లు వచ్చినా కానీ ఈ జంట అందుకు సంబంధించిన ఆఫర్ల మీద ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోలేదు. ఆ షో ల నిర్వాహకులు కూడా దీని గురించి ఏమీ వివరించలేదు.