“శ్రీ కృష్ణుడు, హనుమంతుడు గొప్ప దౌత్యవేత్తలు” అన్నారు ఎస్ జైశంకర్

మరాఠీలోకి ‘భారత్ మార్గ్’గా అనువదించబడిన “ది ఇండియా వే: స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్సర్టైన్ వరల్డ్” అనే ఆంగ్ల పుస్తకం విడుదల సందర్భంగా పూణెలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “ప్రపంచంలో అతి గొప్ప దౌత్యవేత్తలు శ్రీకృష్ణుడు, హనుమంతుడు. మనం హనుమంతుడిని చూస్తే, అటువంటి గొప్ప దూత ఈ లోకంలో లేడు. ఆయన సీతను వెతికే పనిలో వెళ్ళి, సీత ఉనికిని తెలుసుకోవడమే కాకుండా, ఆమెతో మాట్లాడి, రావణుడిని హెచ్చరించి లంకను కాల్చి వచ్చాడు.” అని ఆయన […]

Share:

మరాఠీలోకి ‘భారత్ మార్గ్’గా అనువదించబడిన “ది ఇండియా వే:

స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్సర్టైన్ వరల్డ్” అనే ఆంగ్ల పుస్తకం విడుదల సందర్భంగా పూణెలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “ప్రపంచంలో అతి గొప్ప దౌత్యవేత్తలు శ్రీకృష్ణుడు, హనుమంతుడు. మనం హనుమంతుడిని చూస్తే, అటువంటి గొప్ప దూత ఈ లోకంలో లేడు. ఆయన సీతను వెతికే పనిలో వెళ్ళి, సీత ఉనికిని తెలుసుకోవడమే కాకుండా, ఆమెతో మాట్లాడి, రావణుడిని హెచ్చరించి లంకను కాల్చి వచ్చాడు.” అని ఆయన అన్నారు.

శ్రీకృష్ణుడు, హనుమంతుడు “గొప్ప దౌత్యవేత్తలు”గా ఆయన అభివర్ణించాడు.

వ్యూహాత్మక సహనాన్ని వివరిస్తూ, శ్రీకృష్ణుడు శిశు పాలుడిని చాలాసార్లు  క్షమించడాన్ని ఉదాహరణగా చెప్పాడు. శిశు పాలుని 100 తప్పులను క్షమిస్తానని కృష్ణుడు వాగ్దానం చేసి, 100వ తప్పు పూర్తవగానే అతన్ని చంపేస్తాడు.

ఇది నిర్ణయాత్మకత యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణాలలో ఒకటని ఆయన అన్నారు.  

జైశంకర్ కౌరవులు, పాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రాన్ని “మల్టీపోలార్ ఇండియా”గా పోల్చారు.

వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అనేది ఇతర రాష్ట్రాలచే నిర్బంధించ బడకుండా స్వంత జాతీయ ప్రయోజనాలను, ఇష్టపడే విదేశాంగ విధానాన్ని కొనసాగించగల సామర్థ్యమని ఆయన అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశం బైపోలార్ కోల్డ్ వార్ (1947-1991), యూనిపోలార్ టైమ్స్ (1991-2008), మల్టీపోలార్ టైమ్స్ (2008-ప్రస్తుతం) ఇలా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి విధానాన్ని అనుసరించిందని ఆయన అన్నారు.

“వ్యూహాత్మక మోసం” గురించి మాట్లాడుతూ, శ్రీ జైశంకర్ సూర్యాస్తమయం అయినట్లు భ్రాంతిని సృష్టించిన శ్రీకృష్ణుడిని ఉదాహరణగా తెలిపారు.

అర్జునుడి కొడుకు అభిమన్యుడిని కౌరవ పక్షంలోని వారు చాలా మంది యోధులు కలసి దారుణంగా చంపారు. తన కుమారుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి, అర్జునుడు మరుసటి సాయంత్రం సూర్యుడు అస్తమించే లోగా అభిమన్యుడి మరణానికి ప్రధాన కారకుడైన జయద్రథుడిని చంపుతానని, అలా చంపలేకపోతే అస్త్ర సన్యాసం చేసి, అగ్ని ప్రవేశం చేస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు. 

అర్జునుడు జయద్రథుడిని చంపలేకపోతే,  అస్త్ర సన్యాసం చేయాలనే పన్నాగంతో కౌరవులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జయద్రథుడిని సాయంత్రం వరకు దాచిపెడతారు. 

అయితే శ్రీ కృష్ణుడు, తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా ఉంచుతాడు. అది చూసి సూర్యాస్తమయం అయ్యిందని భ్రమపడిన జయద్రథుడు అర్జునుడు ఓడిపోయినట్లే అనుకొని అర్జునుడి ముందుకు వస్తాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడిని త్వరగా బాణం వేయమని చెబుతాడు, అంతే జయద్రథుడు మరణిస్తాడు. 

పొరుగు దేశాలను ఎంచుకోవడానికి భారతదేశానికి ఉన్న భౌగోళిక పరిమితులపై జైశంకర్ విచారం వ్యక్తం చేశారు.

ఉగ్రవాదంపై పోరులో అసమర్థత కారణంగా పాకిస్థాన్‌కు ప్రపంచ సమాజం నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఆపద సమయంలో ఇతర దేశాలు సహాయం చేయడానికి దాని మార్గాలను సరిదిద్దుకోవాలి. పాకిస్తాన్‌కు ఇప్పుడు చాలా తక్కువ మిత్రదేశాలు ఉన్నాయి. వాటిలో టర్కీ.. పాకిస్తాన్‌కు సహాయం చేసే స్థితిలో లేదు. చైనా ఎప్పుడూ గ్రాంట్లు ఇవ్వదు. ఋణాలు మాత్రమే ఇస్తుందని ఆయన అన్నారు.

కర్ణ, దుర్యోధనుల స్నేహం వల్ల వారిద్దరూ గానీ, వారి కుటుంబాలు గానీ పొందిన ప్రయోజనాలేమీ లేవు. ఇది సమాజంపై ఎలాంటి సానుకూల ప్రభావం చూపలేదు.

అంతేకాకుండా, అది వారి జీవితాలను కబళించింది, వారి బంధువులకు కష్ట నష్టాలను కలిగించింది.

ఇద్దరు వ్యక్తుల స్నేహం, ప్రత్యేకించి వారు చెడు స్వభావం గలవారైతే అది వారికి, వారి చుట్టూ ఉన్న సమాజానికి హాని కలిగిస్తుందని ఆయన అన్నారు.

దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద ఔట్‌పోస్ట్‌లను తిరిగి బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి, చైనా చేస్తున్న ప్రయత్నాలు, బెదిరింపులను ఉపయోగించడం, దక్షిణ చైనా సముద్ర చట్టాలను అమలు చేయడానికి చేపట్టిన రెచ్చగొట్టే చర్యల వల్ల ఈ ప్రాంతపు శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో తనకు విస్తారమైన వాటా ఉందనడానికి బీజింగ్ ఎటువంటి చట్టపరమైన ఆధారాలనూ అందించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

రూల్స్ బేస్డ్ ఆర్డర్ ని సాధారణంగా ఇప్పటికే ఉన్న నియమాల సమితికి అనుగుణంగా రాష్ట్రాలు తమ కార్యకలాపాలను నిర్వహించడానికి భాగస్వామ్య నిబద్ధతగా అర్థం చేసుకోవచ్చు.

రూల్స్ బేస్డ్ ఆర్డర్ ని రెండవ ప్రపంచ యుద్ధం నుండి అభివృద్ధి చెందిన గ్లోబల్ గవర్నెన్స్ వ్యవస్థ తొక్కిపెడుతోంది.

అశ్వత్థామ మరణం గురించి ధర్మరాజు అబద్ధం చెప్పడాన్ని ఉదహరిస్తూ “వ్యూహాత్మక సర్దుబాటు”ని కూడా జైశంకర్ వివరించాడు.

ద్రోణాచార్యుడు కౌరవుల సైన్యాధిపతి, ఆయన 5 రోజుల పాటు చాలా భయంకరంగా పోరాడాడు, ఆయనని పాండవులు ఆపలేకపోయారు.

ద్రోణాచార్యుడు ధర్మరాజు చెబితేనే నమ్ముతాడు. కాబట్టి ధర్మరాజు చేత అబద్ధం చెప్పించి ద్రోణాచార్యుడిని మోసం చేయాలని పాండవులు గేమ్ ప్లాన్ వేశారు.

ఈ సందర్భంలో, కృష్ణుడికి ద్రోణుడి బలహీనత అతని కొడుకు అశ్వథామ అని తెలుసు. కాబట్టి, అశ్వథామ అనే ఏనుగును చంపి, అశ్వథామ చనిపోయాడని అబద్ధపు ప్రచారం చేయమని ధర్మరాజుని అడుగుతాడు. అప్పుడు ద్రోణుడు అస్త్ర సన్యాసం చేస్తాడు. 

ఇలా జైశంకర్ మహాభారతాన్ని, రామాయణాన్ని ప్రస్తుత రాజకీయాలతో ముడిపెట్టి తనదైన శైలిలో వివరించారు.

తనను విదేశాంగ మంత్రిగా చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

“విదేశాంగ కార్యదర్శి కావడమే నాకు గొప్ప. మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదు” అని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ చెప్పారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ, “ఖచ్చితంగా నరేంద్ర మోదీ తప్ప మరెవ్వరూ నన్ను మంత్రిని చేయరు” అని అన్నారు.