ఆర్ఎస్ఎస్ ర్యాలీకి పోలీసులు విధించిన ఆంక్షలు

తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రూట్ మార్చ్‌లకు అనుమతిస్తూ.. మద్రాస్ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది ఆ తీర్పుపై స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. తమిళనాడు ప్రభుత్వ అప్పీలును మంగళవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ కు అనుమతించిన మద్రాస్ హైకోర్టు ఆదేశాలను న్యాయమూర్తులు వి రామసుబ్రమణ్యం, పంకజ్ మిధాలతో కూడిన ధర్మాసనం సమర్ధించింది. రాష్ట్రవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ర్యాలీ నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ అనుమతి […]

Share:

తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రూట్ మార్చ్‌లకు అనుమతిస్తూ.. మద్రాస్ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది ఆ తీర్పుపై స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. తమిళనాడు ప్రభుత్వ అప్పీలును మంగళవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ కు అనుమతించిన మద్రాస్ హైకోర్టు ఆదేశాలను న్యాయమూర్తులు వి రామసుబ్రమణ్యం, పంకజ్ మిధాలతో కూడిన ధర్మాసనం సమర్ధించింది. రాష్ట్రవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ర్యాలీ నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ అనుమతి జారీ చేసింది. ఈ నెల 15న ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆర్ఎస్ఎస్ నిర్వహకులు ప్రకటించారు. ఈ ర్యాలీ సందర్భంగా అన్ని జిల్లాలలోనూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని డీజీపీ శైలేంద్ర బాబు డిఎస్పీలు, ప్రాంతీయ డిఐజిలకు ఉత్తర్వులు జారీ చేశారు. 

గత సంవత్సరం గాంధీ జయంతి రోజు ఆర్ఎస్ఎస్ నిర్వాహకులు ర్యాలీ నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోరారు. శాంతిభద్రతల సమస్యలు ఏర్పడతాయంటూ పోలీసు శాఖ ర్యాలీకి అప్పుడు అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆర్ఎస్ఎస్ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కొన్ని షరతులు విధిస్తూ, బహిరంగ ప్రదేశాలలో జనం ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలలో కాకుండా, క్రీడా మైదానాలలో ర్యాలీలు జరుపుకునేందుకు అనుమతిని ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆర్ఎస్ఎస్ ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పీలును తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 45 ప్రాంతాలలో ర్యాలీలు జరుపుకునేందుకు పోలీసులు గురువారం ఉదయం ఆర్ఎస్ఎస్ నిర్వహకులకు అనుమతి ఇచ్చారు. గతంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆర్ఎస్ఎస్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించినప్పుడు డిపిఐ జోక్యం చేసుకొని తమ పార్టీ ఆధ్వర్యంలో అదే రోజున సమైక్యతా ర్యాలీ జరుపుకుంటామంటూ ప్రకటించింది. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ర్యాలీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలు ఏవైనా పోటీ ర్యాలీలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఇంటిలిజెంట్స్ విభాగం పోలీసులు ఆరా తీస్తున్నారు.  అదే సమయంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ ర్యాలీలు జరిగే జిల్లా కేంద్రాలలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, హింసాత్మక సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, డిజిపి శైలేంద్ర బాబు డిఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ గత ఏడాది అక్టోబర్ లో భావించింది.  ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరగా భద్రతా కారణాల రీత్యా స్టాలిన్ సర్కారు అందుకు నిరాకరించింది. దాంతో ఆర్ఎస్ఎస్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. నవంబరులో విచారణ చేపట్టిన హైకోర్టు, ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి ఇచ్చింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది. 60 ప్రాతిపదిత ప్రాంతాలలో నుంచి 44 చోట్ల మాత్రమే ర్యాలీలు నిర్వహించాలని అది కూడా ఇండోర్ స్టేడియాలు, హాల్స్‌లోనే సభలు ఏర్పాటు చేసుకోవాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో నేడు తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా 45 ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ ర్యాలీ నిర్వహించేందుకు పోలీసు శాఖ అనుమతి జారీ చేసింది.