Mohan Bhagwat: ఆ విష‌యంలో భార‌త్‌ది 5000 ఏళ్ల నాటి చ‌రిత్ర‌

ఇటీవల ఆర్ఎస్ఎస్(RSS) నేత మోహ‌న్ భ‌గ‌వ‌త్ (mohan bhagwat) భార‌త్‌ చరిత్ర గురించి ప్రాముఖ్యత గురించి మాట్లాడటం జరిగింది. మరి ముఖ్యంగా ప్రత్యేకించి, మన దేశం లౌకిక దేశమని, మతాలకు అతీతంగా ఉండే భారతదేశం (India) అంటూ అభివర్ణించారు. భారతదేశంలో ఎన్నో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, దేశం నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని, అలాంటిది మానేసి ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం వంటివి చేయకూడదు అంటూ గుర్తు చేశారు, ఆర్ఎస్ఎస్(RSS) నేత మోహన్ భగవత్ (Bhagwat).  ఆర్ఎస్ఎస్ నేత […]

Share:

ఇటీవల ఆర్ఎస్ఎస్(RSS) నేత మోహ‌న్ భ‌గ‌వ‌త్ (mohan bhagwat) భార‌త్‌ చరిత్ర గురించి ప్రాముఖ్యత గురించి మాట్లాడటం జరిగింది. మరి ముఖ్యంగా ప్రత్యేకించి, మన దేశం లౌకిక దేశమని, మతాలకు అతీతంగా ఉండే భారతదేశం (India) అంటూ అభివర్ణించారు. భారతదేశంలో ఎన్నో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, దేశం నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని, అలాంటిది మానేసి ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం వంటివి చేయకూడదు అంటూ గుర్తు చేశారు, ఆర్ఎస్ఎస్(RSS) నేత మోహన్ భగవత్ (Bhagwat). 

ఆర్ఎస్ఎస్ నేత మాటల్లో: 

లోక కళ్యాణం కోసమే భారతదేశ పూర్వీకులు ‘భారత్’ సృష్టించారని మోహన్ భగవత్(Bhagwat) అన్నారు. దేశంలోని చివరి వ్యక్తికి కూడా తమ జ్ఞానాన్ని అందించే సమాజాన్ని వారు సృష్టించారని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్(RSS) చీఫ్ మోహన్ భగవత్(Bhagwat) బుధవారం మాట్లాడుతూ, ముఖ్యంగా ‘భారత్’ 5,000 సంవత్సరాలుగా లౌకిక దేశంగా ఉందని, ప్రజలు ఐక్యంగా ఉండాలని, మానవులు ఒకరినొకరు గౌరవించుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఎలా బ్రతకాలో మరొకరికి నేర్పించే విధంగా మనిషి ఉండాలి అంటూ మాట్లాడారు.

ఆర్‌ఎస్‌ఎస్(RSS) సీనియర్ కార్యకర్త రంగా హరి రచించిన ‘పృథ్వీ సూక్త – యాన్ ఓడ్ టు మదర్ ఎర్త్’ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవత్(Bhagwat)ప్రసంగిస్తూ, మాతృభూమి పట్ల భక్తి, ప్రేమ మరియు అంకితభావంతో ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన జాతీయ ఐక్యత భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తుందని గుర్తు చేస్తారు ఆర్ఎస్ఎస్(RSS) నేత. మన 5,000 ఏళ్ల సంస్కృతి లౌకికమైనదని, ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం, ఇది మన భావన అని.. ఇది సిద్ధాంతం కాదని… అది తెలుసుకో, గ్రహించి, తదనుగుణంగా ప్రవర్తించండి అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. 

జ్ఞానాన్ని బోధించే వారు ఎంతోమంది: 

భారతదేశం చరిత్ర 5,000 ఏళ్ల నాటిదని, ముఖ్యంగా మన భారతదేశం (India) లౌకిక దేశంగా పేరు ప్రఖ్యాతలు చెందిందని, కుల, మతాలకు అతీతంగా ఉండే మన భారతదేశం (India)లో ఎంతో జ్ఞానం ఉందని వెల్లడించారు ఆర్ఎస్ఎస్(RSS) నేత. సమావేశంలో మాట్లాడిన ఆయన, భారతదేశ చరిత్ర గురించి ఎంతో బాగా మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో మేసలాలని, కుట్రలో కుతంత్రాలకు దూరంగా ఉంటే, మన భారతదేశం అనేది తప్పకుండా ప్రశాంతతకు నిలయంగా మారుతుందని గుర్తు చేశారు.

నిజానికి మన దేశంలో చాలా వైవిధ్యం ఉందని.. ఒకరితో ఒకరు పోట్లాడుకోకూడదని.. మనం ఒక్కటే అని ప్రపంచానికి బోధించేలా దేశాన్ని తయారు చేసుకోండి అని, ఇది భారతదేశ ఏకైక ఉద్దేశ్యమని ఆయన అన్నారు.

నిజానికి అటువంటివారు ‘సన్యాసులు’ మాత్రమే కాదని.. వారు తమ కుటుంబాలతో సంచరించేవారి జీవితాలను గడిపారని.. ఇటువంటి వారు ఇప్పటికీ అక్కడ ఉన్నారని, వీరిని బ్రిటీష్ వారు క్రిమినల్ తెగలుగా ప్రకటించారని, వారు తరచుగా తమ సంస్కృతిని సమాజంలోకి అందించడానికి ప్రయత్నిస్తున్నారని, కొందరు ఆయుర్వేద జ్ఞానాన్ని పంచుకుంటారుఅని అతను చెప్పాడు. మన భారతదేశానికి సంబంధించిన ఎంతోమంది , జ్ఞానాన్ని బోధించే సన్యాసులు, మెక్సికో నుండి సైబీరియా వరకు జ్ఞానాన్ని అందించడానికి ప్రపంచమంతటా వెళ్ళారని అన్నారాయన.

అందువల్ల, ప్రధానంగా ఆర్థిక సమస్యలపై చర్చించే వేదిక అయిన G20ని భారతదేశం (India) మానవత్వం గురించి ఆలోచించేదిగా మార్చడంలో ఆశ్చర్యం లేదు, భగవత్(Bhagwat)”వసుధైవ కుటుంబం” అనే అనుభూతిని ఇవ్వడం ద్వారా, ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల గురించి ఆలోచించడం ద్వారా ఒక అడుగు ముందుకు వేశామని ఆర్ఎస్ఎస్ నేత అన్నారు. ఈ సందర్భంగా కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ప్రసంగిస్తూ, ఐక్యత భారతదేశానికి అతిపెద్ద ఆదర్శమన్నారు.