స్టోర్ కీపర్ ఆస్తుల విలువ 10 కోట్లు 

ప్రస్తుతం ఎక్కడ చూసినా లంచాలు తీసుకుంటూ దొరికిపోవడం, అక్రమ ఆస్తులు సంపాదించడం వంటి నేరాలు బయటపడుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్లో ఒక ఆఫీసర్ ఇంట్లో జరిగిన రైడ్ కారణంగా ఆ ఆఫీసర్ యొక్క ఆస్తుల గుట్టు బయటపడింది. సుమారు పది కోట్లు విలువ చేసే అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేలింది. అయితే ఆ ఆఫీసర్ నిజానికి నెలకి 45 వేల రూపాయలు తీసుకుని, ఒక హాస్పిటల్లో  సాదా స్టోర్ కీపర్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.  వివరాలు ఈ […]

Share:

ప్రస్తుతం ఎక్కడ చూసినా లంచాలు తీసుకుంటూ దొరికిపోవడం, అక్రమ ఆస్తులు సంపాదించడం వంటి నేరాలు బయటపడుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్లో ఒక ఆఫీసర్ ఇంట్లో జరిగిన రైడ్ కారణంగా ఆ ఆఫీసర్ యొక్క ఆస్తుల గుట్టు బయటపడింది. సుమారు పది కోట్లు విలువ చేసే అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేలింది. అయితే ఆ ఆఫీసర్ నిజానికి నెలకి 45 వేల రూపాయలు తీసుకుని, ఒక హాస్పిటల్లో  సాదా స్టోర్ కీపర్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. 

వివరాలు ఈ విధంగా ఉన్నాయి: 

ఇటీవల మధ్యప్రదేశ్లో ఒక ఆఫీసర్ ఇంట్లో జరిగిన రైడ్ కారణంగా ఆ ఆఫీసర్ యొక్క ఆస్తుల గుట్టు బయటపడింది. సుమారు పది కోట్లు విలువ చేసే అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేలింది. అయితే ఆ ఆఫీసర్ నిజానికి నెలకి 45 వేల రూపాయలు తీసుకుని ఒక హాస్పిటల్లో  సాదా స్టోర్ కీపర్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. అయితే రైడ్ జరిగిన సమయంలో అక్రమ ఆస్తులకు సంబంధించిన 16 ఆస్తి పత్రాలు దొరికినట్లు గుర్తించారు అధికారులు. అయితే అందులో సుమారు కోటిన్నర విలువచేసే ఆస్తులు అలీ పేరుమీద, అదే విధంగా అతని భార్య, కొడుకు, కూతురు పేర్లు మీద కూడా ఆస్తులు ఉన్నట్లు తేలింది. 

మధ్యప్రదేశ్ భూపాల్ కి చెందిన అశ్వక్ ఆలీ అనే రిటైర్డ్ స్టోర్ కీపర్ ఇంట్లో సోదాలు చేయగా కోట్ల ఆస్తులు ఆక్రమంగా సంపాదించినట్లు తేలింది. ఇంద్ర భవనం లాంటి ఇల్లు అందులో సుమారుగా 46 లక్షలు విలువైన బంగారం వెండి స్వాధీనం చేసుకున్నారు. 20 లక్షల నగదు కూడా దొరికినట్లు అధికారులు తెలిపారు. ఆ ఇల్లు, ఇంట్లో ఉన్న వస్తువులు ఖరీదే కొన్ని కోట్లు ఉంటుంది అని అంచనాలు వేస్తున్నారు అధికారులు. అయితే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో కేవలం స్టోర్ కీపర్ గా 45,000 నెలకు తీసుకుని ఇన్ని ఆస్తులు ఎలా కూడా పెట్టారు అని నిజాలు బయటపడాల్సి ఉన్నాయి. 

అలీ లాటరీలో గెలుచుకున్న మొత్తంతో మూడు అంతస్తుల భవనంలో పాఠశాలను కూడా నడుపుతున్నాడు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని అష్ఫాక్‌ అలీపై ఫిర్యాదు రావడంతో దాడులు నిర్వహించారు అధికారులు. ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. 

లంచం తీసుకుంటూ దొరికిపోయిన మరో మధ్యప్రదేశ్ అధికారి: 

ఎంతోమంది చిన్న పని చేయడానికి కూడా లంచం తీసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇదే క్రమంలో మధ్యప్రదేశ్ లోని ఒక గవర్నమెంట్ అధికారి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. దొరికిపోయాను అని తెలిసిన అనంతరం ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్న 5000 రూపాయలను, ఆ అధికారి వెంటనే నోట్లో వేసుకొని మింగే ప్రయత్నం చేశాడు. 

చట్టం ప్రకారం లంచం తీసుకోవడం ఇవ్వడం కూడా నేరమే. ఇలాంటి సంఘటనలు దేశం అంతా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. గవర్నమెంట్ అధికారులు నుంచి కొంతమంది పోలీసు అధికారుల వరకు చాలా సందర్భాల్లో లంచం తీసుకున్నట్లు యాంటీ కరప్షన్ బ్యూరో తెలిపింది. కఠిన చర్యలు కూడా తీసుకున్నట్లు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు అయినట్లు రికార్డ్స్ లో ఉన్నట్లు తెలిపింది. దురాశ దుఃఖానికి చేటు అంటే ఇదేనేమో, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా లంచం తీసుకుని పోలీసుల చేతిలో చిక్కడం నిజంగా అవమానకరం.