మూన్ వాక్ మొదలుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్!

విఫలమైన చోటనే విజయం సాధించి.. భారతదేశ ఘనతను విశ్వవ్యాప్తం చేసింది ఇస్రో. చంద్రయాన్–3 విజయంతో ఉన్నత శిఖరాలను అందుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్‌‌ను సాఫ్ట్ ల్యాండింగ్‌ చేసిన తొలి దేశంగా రికార్డులు నెలకొల్పింది. చంద్రుడి పైకి ‘మనమూ వెళ్లాం’ అని కాకుండా.. ‘మనం మాత్రమే వెళ్లాం’ అని చెప్పుకునేలా చేసింది. ఇక చంద్రయాన్–3లో చివరి దశ మొదలైంది. ప్రయోగ లక్ష్యం వైపు వెళ్తోంది.  లక్ష్యం వైపు వడివడిగా రోవర్ అడుగులు చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ […]

Share:

విఫలమైన చోటనే విజయం సాధించి.. భారతదేశ ఘనతను విశ్వవ్యాప్తం చేసింది ఇస్రో. చంద్రయాన్–3 విజయంతో ఉన్నత శిఖరాలను అందుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్‌‌ను సాఫ్ట్ ల్యాండింగ్‌ చేసిన తొలి దేశంగా రికార్డులు నెలకొల్పింది. చంద్రుడి పైకి ‘మనమూ వెళ్లాం’ అని కాకుండా.. ‘మనం మాత్రమే వెళ్లాం’ అని చెప్పుకునేలా చేసింది. ఇక చంద్రయాన్–3లో చివరి దశ మొదలైంది. ప్రయోగ లక్ష్యం వైపు వెళ్తోంది. 

లక్ష్యం వైపు వడివడిగా రోవర్ అడుగులు

చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ మూన్‌ వాక్‌ను ప్రారంభించింది. బుధవారం సాయంత్రం చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌‌ దిగిన తర్వాత రాత్రి సమయలో రోవర్ బయటకు వచ్చింది. ల్యాండర్ దిగిన వెంటనే దుమ్ము చెలరేగింది. దీంతో డస్ట్ క్లియర్ అయ్యే దాకా ల్యాండర్ వేసి చూసింది. తర్వాత విక్రమ్‌ లోపలి నుంచి రోవర్ బయటికి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ల్యాండర్‌‌ తీయగా.. ఇస్రో ( భారత అంతరిక్ష పరిశోధన సంస్థ)విడుదల చేసింది. గురువారం చంద్రుడిపై రోవర్ కొద్ది దూరం ప్రయాణించిందని, రెండు ఫొటోలూ కూడా పంపిందని ఇస్రో తెలిపింది. రోవర్ 14 రోజులపాటు ప్రయోగాలు, పరిశోధనలుత్వరలోనే రిలీజ్ చేస్తామని వెల్లడించింది. 

 చేసి వాటి ఫలితాలను భూమికి చేరవేయనుందని వివరించింది. రోవర్ తీసిన ఫొటోలను 

రోవర్, ల్యాండర్‌‌ ‘హెల్దీ’గానే ఉన్నాయి: ఇస్రో చీఫ్ సోమనాథ్

రోవర్, ల్యాండర్‌‌ ‘హెల్దీ’గానే ఉన్నాయని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. ‘‘భవిష్యత్తులో చంద్రుడిపై జీవనం సాగించాలని చాలా దేవాలు కోరుకుంటున్నాయి. అలాంటప్పుడు అక్కడి పరిస్థితులు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. సౌత్‌ పోల్‌లో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. అక్కడ నీరు, ఖనిజాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. దక్షిణ ధ్రువం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందుకే మేం సౌత్‌ పోల్‌ను ఎంచుకున్నాం. దక్షిణ ధ్రువంపై ఆవాసాలు ఏర్పాటు చేసుకోగలమా? లేదా అనేది పరిశోధనల్లో తేలుతుంది” అని ఆయన వివరించారు. 

అసలేంటీ ప్రజ్ఞాన్ రోవర్..? ఇంతకీ ఇది ఏం చేస్తుంది?

చంద్రుడి ఉపరితలంపై వచ్చే 14 రోజులపాటు ప్రజ్ఞాన్ రోవర్ పలు పరిశోధనలు చేయనుంది. అందుకు సంబంధించిన సమాచారాన్ని ల్యాండర్‌‌కు పంపనుంది. ఈ రోవర్ 26 కిలోల బరువు ఉంటుంది. ఇందులో రెండు పేలోడ్స్ ఉంటాయి. చంద్రుడి ఉపరితలంపై ఉన్న రసాయనాలను ఒకటి విశ్లేషిస్తుంది. ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న మట్టి, రాళ్లు తదితరాల మూలకాలను పరీక్షిస్తుంది. ఈ పరిశోధనల్లో తెలిసే విషయాలు ప్రపంచ గతిని మార్చనున్నాయి. ఇక్కడ వనరులు, లేదా ఖనిజాల జాడ తెలిస్తే.. పెను సంచలనమే జరగనుంది. అందుకే అగ్రదేశాలు కూడా చంద్రయాన్ గురించి ఇంత ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. 

ప్రజ్ఞాన్ రోవర్ ఆరు చక్రాలున్న చిన్నయంత్రం. అందులో ఇంధనంతోపాటు సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఆలాగే సెన్సార్స్, అత్యాధునిక కెమెరాలు ఉంటాయి. సెన్సార్ల సాయంతో తన ముందున్న ప్రదేశాన్ని విశ్లేషించుకుంటూ రోవర్ ముందుకు సాగుతుంది. అక్కడి ప్రదేశాలను వివిధ కోణాల్లో ఫొటోలు తీసి భూమిపైకి పంపిస్తుంది. మట్టిని విశ్లేషించి.. నేలపై ఉన్న ఖనిజాల ఆనవాళ్లను వివరాలను సేకరిస్తుంది. తానున్న ప్రాంతాన్ని 3డీ మ్యాపింగ్ చేస్తుంది. ముఖ్యంగా చంద్రుడిపై నీటి జాడలను వెతుకుతుంది. ప్రస్తుతం తాను ఉన్న దక్షణ ధ్రువం వాతావరణ పరిస్థితులను అనలైజ్ చేస్తుంది. ఇవన్నీ చేయడానికి కావాల్సిన శక్తిని సోలార్ ప్యానెల్స్ ద్వారా పొందుతుంది. నిర్దేశిత లక్ష్యం ప్రకారం మొత్తం 14  రోజుల పాటు ఈ విధులను రోవర్ నిర్వర్తిస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులపాటు పని చేసే అవాకశం కూడా ఉంది.