నాలుగు స్కాములకు సూత్రధారి చంద్రబాబు అంటున్న రోజా

చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్, అదే విధంగా పలు స్కాములు విషయంలో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. స్కాం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు అంటూ విమర్శలకు దిగారు టూరిజం మినిస్టర్ రోజా. అంతేకాకుండా ఆయన చేసిన స్కాంలో, భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిని అదే విధంగా కొడుకు లోకేష్ పాత్రలు కూడా ఉండే అవకాశం ఉందని మాట్లాడారు రోజా.  చిన్న దొంగ లోకేష్ అంటున్న రోజా!:  మరి ముఖ్యంగా నారా […]

Share:

చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్, అదే విధంగా పలు స్కాములు విషయంలో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. స్కాం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు అంటూ విమర్శలకు దిగారు టూరిజం మినిస్టర్ రోజా. అంతేకాకుండా ఆయన చేసిన స్కాంలో, భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిని అదే విధంగా కొడుకు లోకేష్ పాత్రలు కూడా ఉండే అవకాశం ఉందని మాట్లాడారు రోజా. 

చిన్న దొంగ లోకేష్ అంటున్న రోజా!: 

మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ నిజానికి చిన్న దొంగని.. తన తండ్రిని కాపాడుకోవడానికి ఢిల్లీ పరుగులు తీసి ప్రెసిడెంట్ ని కలిసిన లోకేష్ తండ్రిని బయటికి తీసుకురావడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాడని.. అయితే మరి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు కలిసి ప్రెసిడెంట్ ని కలిసిన ఒక్క సంఘటన కూడా కనిపించలేదని వెల్లడించారు రోజా. 

అయితే ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి తగిన శాస్తి జరిగిందని కచ్చితంగా చట్టం తన పని చేస్తూపోతుందని.. నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందని మరొకసారి గుర్తు చేశారు రోజా. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కామ్, ల్యాండ్ స్కామ్ ఇలా పలు స్కాములలో హస్తం ఉన్న చంద్రబాబు నాయుడు జైలు పాలు అయ్యాడని. ఇప్పుడు నారా లోకేష్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో భాగమైనందున తాను కూడా జైలు పాలు అవ్వక తప్పదు అని మాట్లాడారు రోజా. మరి ముఖ్యంగా ఆంధ్రాకి వస్తే తనని అరెస్టు చేస్తారని తెలిసిన లోకేష్, భయంతో ఆంధ్రాకి రావట్లేదు అని లోకేష్ గురించి మాట్లాడారు రోజా. 

చంద్రబాబు నాయుడు ఆస్తుల ప్రస్తావన: 

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు ఆస్తులు గురించి ప్రస్తుతం ప్రస్తావన నడుస్తోంది. నిజానికి స్కిల్ డెవలప్మెంట్ స్కాం గురించి, ఫైబర్ నెట్ స్కామ్ గురించి, 2016లో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. అంతేకాకుండా భువనేశ్వరి నాయుడుని పెళ్లి చేసుకునే క్రమంలో కేవలం చంద్రబాబు నాయుడుకి రెండు ఎకరాల ఆస్తి మాత్రమే ఉందని.. మరి ఇప్పుడు ఇంత మొత్తంలో ఆస్తి ఎలా సంపాదించారు అని ప్రశ్నలు కురుస్తున్నాయి.. 

ఇక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు స్కామ్ విషయానికి వస్తే అన్ని స్కాములలో కన్నా, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చాలా పెద్దది అని అయితే నారా లోకేష్ విదేశాలలో చదువుకునే స్కామ్ ఎలా చేయాలో చాలా బాగా నేర్చుకున్నాడని ప్రస్తావించారు. 

మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నప్పుడు కేవలం రెండు ఎకరాల ఆస్తి ఉన్నట్లు ఒకప్పుడు భువనేశ్వరి వెల్లడించారు. అయితే తమ కంపెనీ షేర్లలో రెండు శాతం షేర్లు అమ్మినప్పటికీ తమకి 400 కోట్లు వస్తాయని, ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. కంపెనీలో రెండు శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయంటే, ప్రస్తుతం కంపెనీ నిక్కరు విలువ 20,000 కోట్లు అన్న ప్రస్తావన వచ్చింది. అంతేకాకుండా ఇంతగా ఆస్తులు కూడా పెట్టారంటే మరి చంద్రబాబు నాయుడు పేరు మీద ఉన్న బిజినెస్ లు, కంపెనీల ఆస్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సిపి.