పవన్ , చంద్రబాబు నాయుడు మీద రోజా వ్యాఖ్యలు 

అయితే రాజకీయరంగంలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కొత్తేమీ కాదు. ఇంకా వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న రోజా విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. తమ పార్టీ మీద ఎవరు చిన్న మాటన్నప్పటికీ, ససేమిరా వ్యతిరేకిస్తుంది రోజా. అంతేకాకుండా, ప్రతిపక్ష పార్టీలకు వైయస్సార్ సిపి పార్టీ మీద వ్యాఖ్యలు చేసే అర్హత కూడా లేదు అంటుంది. ఏం జరిగింది: అయితే ప్రస్తుతం వాలంటీర్లు విషయంలో పవన్ కళ్యాణ్ నోరు జారిన మాట అందరికీ తెలిసిందే. […]

Share:

అయితే రాజకీయరంగంలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కొత్తేమీ కాదు. ఇంకా వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న రోజా విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. తమ పార్టీ మీద ఎవరు చిన్న మాటన్నప్పటికీ, ససేమిరా వ్యతిరేకిస్తుంది రోజా. అంతేకాకుండా, ప్రతిపక్ష పార్టీలకు వైయస్సార్ సిపి పార్టీ మీద వ్యాఖ్యలు చేసే అర్హత కూడా లేదు అంటుంది.

ఏం జరిగింది:

అయితే ప్రస్తుతం వాలంటీర్లు విషయంలో పవన్ కళ్యాణ్ నోరు జారిన మాట అందరికీ తెలిసిందే. కేవలం ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని వాలంటీర్ వ్యవస్థ డేటా కలెక్ట్ చేసి కొన్ని ఏజెన్సీలకు ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం మీద వైయస్సార్ సిపి పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ లో చాలామంది అమ్మాయిలు మిస్ అవుతున్నారని, దీని గురించి ఎవరు మాట్లాడలేదని, పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పార్టీ మీద వ్యాఖ్యలు చేశారు.

అయితే దీనికి కౌంటర్ గా రోజా మాట్లాడడం జరిగింది. అసలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కారణంగా ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారో తెలియాల్సి ఉందని వాక్యానించారు. దీని మీద విచారణ ముందు జరగాలని ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అయితే అసలు ఏ ఏజెన్సీ ద్వారా పవన్ కళ్యాణ్ కు మిస్సింగ్ అమ్మాయిల గురించి రిపోర్ట్ అందుతుందో తెలియాల్సి ఉంది అన్నారు. ముందు ఇలాంటి విషయాలు మీద విచారణ జరిగితే బాగుంటుందని ప్రశ్నించారు రోజా.

అయితే ఏదైనా రిపోర్ట్ సెంటర్ నుంచి తీసుకువస్తున్నామంటే ముందుగా అది రాష్ట్రస్థాయి ప్రభుత్వానికి అందించాల్సిన అవసరం ఉందని, ఇటువంటి మినిమం నాలెడ్జ్ లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని.. పవన్ కళ్యాణ్ చెప్పినవి, చేసినవి కేవలం హాస్యస్పదంగా ఉందని ఉద్దేశపట్టారు రోజా. అంతేకాకుండా వార్డు ఎలక్షన్స్ లో నెగ్గ లేని పవన్ కళ్యాణ్, సెంటర్ నుంచి అఫీషియల్ రిపోర్ట్ ఎలా తెస్తారు అనుకుంటు.. ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు మీద కూడా కౌంటర్ విసిరిన రోజా:

అయితే టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎక్కడ చూసినా గంజాయి రవాణా జరుగుతుందని రాష్ట్రం మీద ఆరోపనులు చేయడం జరిగింది. అయితే దీనికి కౌంటర్ గా రోజా మాట్లాడుతూ, అయితే అలాంటి గంజాయి కేవలం హెరిటేజ్ కార్యాలయాల్లోనే దొరుకుతాయని, బహుశా టిడిపి నేతలు అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం కుప్పంలో దాచిపెట్టారేమో అని టిడిపి పార్టీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోజా.

అంతేకాకుండా, చంద్రబాబు నాయుడు నిజానికి రాయలసీమ ద్రోహి అని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడే హక్కు గానీ, ఆ ప్రాంతాన్ని ప్రాజెక్ట్ పేరుతో సందర్శించే హక్కు గాని చంద్రబాబు నాయుడుకి లేవు అని రోజా గుర్తు చేయడం జరిగింది. అంతేకాకుండా 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుకి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడవలసిన పనిలేదని, అసలు ప్రాంతాన్ని డెవలప్ చేయలేని వాళ్ళకి అలాంటి హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి అని ప్రశ్నించారు రోజా.

వైయస్సార్ సిపి పార్టీ గురించి తప్పుగా మాట్లాడే ప్రతి ఒక్కరికి, ఖచ్చితమైన కౌంటర్ ఇవ్వనున్నట్లు రోజా మాట్లాడారు. తప్పుడు ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదు అని హెచ్చరించారు.