యాక్సిడెంట్ తర్వాత మొదటి సారి గ్రౌండ్ లో అడుగుపెట్టిన పంత్

టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్ ఈ మధ్యే కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన పంత్ నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. దాదాపు చాలా రోజుల నుంచి పంత్ ఇంటర్నేషనల్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో టీమిండియా టీమ్ లో వికెట్ కీపర్ స్థానం ఖాళీ అయింది. దీంతో బీసీసీఐ చాలా మంది వికెట్ కీపర్లను ట్రై చేస్తోంది. కానీ ఏ ఒక్కరూ స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నారు. పంత్ ను […]

Share:

టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్ ఈ మధ్యే కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన పంత్ నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. దాదాపు చాలా రోజుల నుంచి పంత్ ఇంటర్నేషనల్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో టీమిండియా టీమ్ లో వికెట్ కీపర్ స్థానం ఖాళీ అయింది. దీంతో బీసీసీఐ చాలా మంది వికెట్ కీపర్లను ట్రై చేస్తోంది. కానీ ఏ ఒక్కరూ స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నారు. పంత్ ను మరిపించేలా ఎవరూ బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. 

తొలి సారి గ్రౌండ్ లో లెఫ్ట్ హ్యాండర్

2022 డిసెంబర్ లో కారు ప్రమాదానికి గురైన పంత్ కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత అతడు కోలుకుని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరిన తర్వాత కూడా పంత్ తన దూకుడు స్వభావాన్ని అలాగే కొనసాగిస్తున్నాడు. ఎవరికీ వీలు కాని తన స్వభావంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న పంత్ నేషనల్ క్రికెట్ అకాడమీలో కూడా కొద్ది రోజుల్లోనే అందరితో కలిసి పోయాడు. అక్కడి కోచింగ్ స్టాఫ్ తో పంత్ సరదాగా ఉన్న చాలా వీడియోలు బయటికొచ్చాయి. ఈ ఆరు నెలల నుంచి పంత్ బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి దిగలేదు. దీంతో అతని అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కానీ పంత్ పంద్రాగస్టు సందర్భంగా బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి దిగి  అలరించాడు. 

సోషల్ మీడియాలో రచ్చ..

పంత్ చాలా రోజుల తర్వాత గ్రౌండ్ లోకి దిగడంతో అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మునుపటి లానే పంత్ బ్యాటింగ్ లో తనదైన దూకుడు చూపించాడు. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

వన్డే వరల్డ్ కప్ ఆడేనా??

పంత్ కు గత సంవత్సరం తన సొంత ప్రదేశానికి కారులో వెళ్తుండగా.. ఘోరమైన యాక్సిడెంట్ అయింది. దీంతో అతడు దారుణ గాయాలకు గురయ్యాడు. పంత్ అసలు బతకడమే గుడ్ లక్ అని ఆనాటి యాక్సిడెంట్ ను చూసిన చాలా మంది చెప్పారు. పంత్ ప్రాణాపాయ స్థితి నుంచి అయితే తప్పించుకున్నాడు కానీ అతడి తల వీపు భాగంలో గాయాలయ్యాయి. దీంతో పంత్ ను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. చాలా మంది మాజీలు రిషభ్ పంత్ ను ఆసపత్రిలో పరామర్శించి తమ సంఘీభావం తెలియజేశారు. పంత్ త్వరగా కోలుకోవాలని అనేక మంది ఫ్యాన్స్ క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు అతని ఫ్యాన్స్ కూడా పూజలు చేశారు. అందరి పూజల ఫలితం వల్ల పంత్  ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఇక పూర్తిగా కోలుకున్న తర్వాత పంత్ నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అతడు పూర్తి ఫిట్ గా మారాడా? లేదా  అనే విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. దీంతో పంత్ వచ్చే వన్డే వరల్డ్ కప్ లో ఆడతాడా? లేదా? అనే సందేహాలు అందరిలో ఎక్కువయ్యాయి. పంత్ ఆడితే ఇండియా టీం వేరే లెవల్ లో ఉంటుందని చాలా మంది ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

పంత్ వరల్డ్ కప్ లో ఆడినా లేకపోయినా కానీ అతడు తిరిగి గాయం నుంచి కోలుకోవడం అందరికీ ఆనందాన్నిచ్చే వార్తే. అందుకు ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ పండుగ చేసుకుంటున్నారు.