బెంగుళూరు వాసుల విద్యుత్ బిల్లులో సడలింపు

బెంగుళూరు విద్యుత్ సరఫరా కంపెనీ (బెస్కామ్), ఇంధనం మరియు విద్యుత్ కొనుగోలు ధరల సర్దుబాటు (FPPCA)ని దృష్టిలో ఉంచుకుని, సెప్టెంబరు బిల్లింగ్ సైకిల్‌కు గాను వినియోగదారుల నుంచి యూనిట్‌కు రూ. 1.15 చొప్పున వసూలు చేస్తుంది, గత నెల యూనిట్‌కు రూ. 2.05 రేటుతో పోలిస్తే 90 పైసలు తగ్గింది. మరోవైపు విద్యుత్ చార్జీలు పెంచి, పైసలలో సడలింపులు ఇవ్వడం ఏంటి అని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బిజెపి. పైసలలో సడలింపు:  ఈ తగ్గింపు ప్రజలకు ఉపశమనం […]

Share:

బెంగుళూరు విద్యుత్ సరఫరా కంపెనీ (బెస్కామ్), ఇంధనం మరియు విద్యుత్ కొనుగోలు ధరల సర్దుబాటు (FPPCA)ని దృష్టిలో ఉంచుకుని, సెప్టెంబరు బిల్లింగ్ సైకిల్‌కు గాను వినియోగదారుల నుంచి యూనిట్‌కు రూ. 1.15 చొప్పున వసూలు చేస్తుంది, గత నెల యూనిట్‌కు రూ. 2.05 రేటుతో పోలిస్తే 90 పైసలు తగ్గింది. మరోవైపు విద్యుత్ చార్జీలు పెంచి, పైసలలో సడలింపులు ఇవ్వడం ఏంటి అని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బిజెపి.

పైసలలో సడలింపు: 

ఈ తగ్గింపు ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని మరియు ఇంధనం మరియు విద్యుత్ కొనుగోలు ధరల సర్దుబాటు (FPPCA), విద్యుత్ ధరలు తగ్గుదలకు కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా, గృహ జ్యోతి పథకం కింద గృహ జ్యోతి స్కీమ్‌లోని లబ్ధిదారులకు, గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తుంది. వారి FPPCA ఛార్జీలను ప్రభుత్వం కవర్ చేస్తుంది, ఇంకా చెప్పాలంటే ఇది వినియోగదారులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.

కర్నాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (కెఇఆర్‌సి) జూన్ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని, బెస్కామ్‌కు, జూలై నుండి సెప్టెంబర్ త్రైమాసికంలో, బిల్లింగ్ విషయంలో యూనిట్‌కు 51 పైసలు.. తరువాతి అక్టోబర్ నుండి డిసెంబర్ త్రైమాసికంలో యూనిట్‌కు 50 పైసలు రికవరీ చేసే అధికారాన్ని మంజూరు చేసింది. అయితే ఇది ఇలా ఉండగా, గతంలో ఏప్రిల్‌లో యూనిట్‌కు 27 పైసలు, జూన్‌లో యూనిట్‌కు 9 పైసలు మరియు జూలైలో యూనిట్‌కు 28 పైసల చొప్పున వివిధ FPPCA ఛార్జీలను బెస్కామ్ లెక్కించింది, ఇది ఇంధనం మరియు విద్యుత్ కొనుగోలు ఖర్చులలో హెచ్చుతగ్గుల అనుగుణంగా సడలింపులు జరుగుతున్నాయి. దీని కారణంగానే సెప్టెంబర్ నెలలో విద్యుత్ బిల్డింగుకు గాను, యూనిట్ కు 90 పైసలు తక్కువ చెల్లించాల్సి ఉంటుంది అని పేర్కొంది ప్రభుత్వం.

డైరెక్టర్ ఆనంద్ బిలాగి మాటల్లో: 

గత డిసెంబరులో విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త నియంత్రణను దృష్టిలో ఉంచుకొని ఇంధన సర్దుబాటు ఛార్జీలు మార్పులు చేయడం జరిగిందని.. త్రైమాసిక నిర్ణయాలు ఉన్నప్పటికీ, వాటికి అతీతంగా ఈ ఛార్జీలు ఇప్పుడు FPPCA ఛార్జ్ కింద, మార్చి నుండి అమలులోకి రావడం జరిగిందని బెస్కామ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ బిలాగి తెలిపారు. అయితే తాము జూన్‌లో కెఇఆర్‌సిని సంప్రదించామని, ఈ ఛార్జీలను ఆరు నెలలకు సర్దుబాటు చేయడానికి వీలు పడుతుందని, మొదటి మూడు నెలలకు 50 పైసలు మరియు తరువాతి మూడు నెలలకు 51 పైసలు, ఈ నెలలో యూనిట్ కు మరింత సడలింపు జరిగిందని బిలాగి చెప్పారు.

మండిపడుతున్న బిజెపి: 

అయితే విద్యుత్ ఛార్జీల సవరణపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ విద్యుత్ ఛార్జీలను పెంచిందా? పరిశ్రమలు చచ్చిపోయే వరకు నిద్రపోదు అంటూ ఆయన ప్రస్తావించారు. విద్యుత్ కోతలు పెంచడం, విద్యుత్ చార్జీలు పెంచి మళ్లీ పైసలులో తగ్గించామంటూ సడలింపులు చేయడం కాంగ్రెస్ కే తగునని మాల్వియా ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అడుగుపెట్టినప్పటి నుంచి, అన్ని ధరలు పెరిగాయని, చిన్న చిన్న సడలింపులు చేస్తూ, పెద్ద మార్పులు తెస్తున్నట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎత్తిచూపరు బిజెపి నాయకులు. ఇప్పటివరకు తాను హామీగా ఇచ్చిన ఒక్క విషయాన్ని కూడా సవ్యంగా పూర్తి చేయకపోవడమే కాకుండా, ధరల పెరుగుదలతో మరింత భారాన్ని ప్రజల నెత్తిన రుద్దుతున్నారని వాపోయింది బిజెపి.