Operation: ఉత్తరకాశి టన్నెల్లో చిక్కుకున్న వారికోసం రెస్క్యూ ప్లాన్స్

మూడో వారానికి చేరుకున్న ఆపరేషన్

Courtesy: Twitter

Share:


Operation: మనం చాలా సినిమాలలో ముఖ్యంగా చైనా, కొరియన్ సినిమాలలో టన్నుల్లో (Tunnel) చిక్కుకొని ప్రాణాలతో బయటపడిన సన్నివేశాలు మనం సినిమాల ద్వారా చూస్తూ ఉంటాం. మొన్నటికి మొన్న నయనతార సినిమా ఆక్సిజన్ చిత్రంలో కూడా, ల్యాండ్ స్లైడ్ ద్వారా కూరుకుపోయిన బస్సులో ఉన్న ప్రజలు బయటికి ఎలా తిరిగి వచ్చారనేది సినిమా ద్వారా చూసాం. ఇదే తరహాలో కొంతమంది ఉత్తరకాశీ (Uttarkashi) టన్నుల్లో (Tunnel) పనిచేయడానికి వెళ్ళిన వర్కర్లు, ఒక ప్లేస్ లో టన్నెల్ కూలిపోవడం వల్ల, మూడు వారాలుగా అందులో చిక్కుకుని ఉన్నారు. సుమారు 41 మంది టన్నెల్ లోపల చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ (Rescue) టీంలు అనేక ప్లాన్లు చేస్తున్నాయి. ఇప్పుడు రెస్క్యూ (Rescue) ఆపరేషన్ (Operation) మూడవ వారానికి చేరుకుంది. 

మూడో వారానికి చేరుకున్న ఆపరేషన్: 

ఉత్తరకాశీ (Uttarkashi)లోని సిల్క్యారా సొరంగం (Tunnel)లో కూలిపోయిన ప్రదేశంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించడానికి, నవంబర్ 12 నుండి ఆపరేషన్ (Operation) జరుగుతోంది. కార్మికులను రక్షించే ప్రయత్నాలు మూడవ వారంలోకి ప్రవేశించినందున వర్టికల్ డ్రిల్లింగ్ ఆదివారం ప్రారంభమైంది. అమెరికా తయారు చేసిన అగర్ డ్రిల్లింగ్ మెషిన్ విరిగిన భాగాలను మరమ్మతు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మాన్యువల్ డిగ్గింగ్ ప్రారంభించడానికి కూడా పని జరుగుతోంది. 

వర్టికల్ డ్రిల్లింగ్: 

ఆదివారం ప్రారంభమైన వర్టికల్ డ్రిల్లింగ్ రెండవ ఉత్తమ ఎంపిక అని హస్నైన్ వివరించారు. ఇది మధ్యాహ్నం సమయంలో ప్రారంభమైంది మరియు ఇప్పటికే 15 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయిందని హస్నైన్ చెప్పారు.

86 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ తర్వాత సొరంగం (Tunnel) యొక్క క్రస్ట్ విచ్ఛిన్నం చేయాల్సి ఉంటుందని, తద్వారా చిక్కుకున్న కార్మికులను బయటకు తీయవచ్చని ఆయన చెప్పారు.

సైడ్‌వేస్ డ్రిల్లింగ్: 

కార్మికులను రక్షించడానికి సైడ్‌వేస్ డ్రిల్లింగ్ మరొక ఆప్షన్ అని చెప్పుకోవాలి. అయితే, సైడ్‌వేస్ డ్రిల్లింగ్ (170 మీటర్లు కవరింగ్ లంబంగా డ్రిల్లింగ్) చేపట్టే యంత్రాలు కూలిపోయిన ప్రదేశానికి ఇంకా రాలేదని, రాత్రి సమయంలో అక్కడికి చేరుకుంటాయని NDMA సభ్యుడు వివరించారు.

డ్రిఫ్ట్ టెక్నాలజీ: 

ఇతర ప్రత్యేకమైన ఆపరేషన్ (Operation) ప్లాన్స్ పని చేయకపోతే డ్రిఫ్ట్ టెక్నాలజీ అనే మరొక రెస్క్యూ (Rescue) పద్ధతిని అమలు చేసే అవకాశం ఉంటుందని హస్నైన్ వివరించారు. ఈ ఆపరేషన్ (Operation)లో భాగంగా పైపును స్థిరంగా ఉంచాలి, ఆగర్ విరిగిన భాగాలను తీసివేయాలి, వైపు డ్రిఫ్ట్ ప్రారంభించడానికి సిద్ధం చేయాలి, టాప్-డౌన్ డ్రిల్లింగ్ కోసం సిద్ధం చేయాలి, అంతేకాకుండా లోపల చిక్కుకున్న 41 మంది సోదరులను ఒకే దగ్గర ఉండేలా చేయాలి, బలోపేతం చేయాలి మరియు వారి మానసిక క్షేమాన్ని పర్యవేక్షించాలి. ఈ ఆపరేషన్ (Operation) చాలా కాలం పాటు కొనసాగుతుందిఅని ఎన్‌డిఎంఎ సభ్యుడు రెస్క్యూ (Rescue) ఆపరేషన్ (Operation)లో భాగంగా జరుగుతున్న కొన్ని ప్రణాళికల గురించి వివరించారు.

బార్కోట్-ఎండ్, రెస్క్యూ టన్నెల్: 

టన్నెల్ బార్కోట్ చివరి నుండి బ్లాస్ట్ టెక్నిక్ ఉపయోగించి 483-మీటర్ల రెస్క్యూ (Rescue) టన్నెల్ చేయడానికి ముఖ్యంగా ప్రణాళికలు జరుగుతున్నట్లు, NDMA సభ్యుడు వివరించారు. అంతేకాకుండా ఆదివారం ఉదయం ఐదవ పేలుడు జరిగిందని, 10-12 మీటర్ల ప్రాంతం చొచ్చుకుపోయింది అని హస్నైన్ చెప్పారు. అంతకుముందు నవంబర్ 23న, అతను తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (THDC) బార్కోట్-ఎండ్ నుండి రెస్క్యూ (Rescue) టన్నెల్ నిర్మాణాన్ని ప్రారంభించిందని చెప్పాడు. రోజుకు మూడు పేలుళ్లు జరిపేందుకు కృషి చేశామన్నారు.

బార్కోట్-ఎండ్, వర్టికల్ డ్రిల్లింగ్:

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)చే నిర్వహించబడే టన్నెల్ బార్కోట్ చివర నుండి వర్టికల్ డ్రిల్లింగ్‌ను మరొక రెస్క్యూ (Rescue) ఆప్షన్ అంటూ హస్నైన్ వివరించారు. ఈ ఆపరేషన్ (Operation)లో భాగంగా బార్కోట్ వైపు నుండి 24-అంగుళాల డ్రిల్లింగ్ అవుతుంది. దీని కోసం 5-కిమీల రహదారి అవసరం, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ద్వారా నిర్మించబడుతోంది అంటూ పూర్తిగా వివరించారు హస్నైన్.