కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్లో మూత్ర విసర్జన కేసు చాలా మలుపులు తిరుగుతూ వచ్చింది. ఒక వీడియోలో గమనిస్తున్నట్లయితే ఒక వ్యక్తి పైన మరో వ్యక్తి మూత్ర విసర్జన చేయడం దేశంలో జరిగిన ఒక దుర్ఘటన. తర్వాత నిందితుడు ప్రవేష్ శుక్లనీ పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా తన ఇల్లు అక్రమంగా కట్టాడు అని చెప్పి కొంత భాగాన్ని కూల్చి వేయడం కూడా జరిగింది.
ఆ తర్వాత వేధింపులకు గురైన వ్యక్తి దస్మంత్ రావత్ కు జరిగిన అన్యాయానికి గాను చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చేతుల మీదగా ఆయన కాళ్లు కూడా కడగడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా 5 లక్షల శాంక్షన్ అయింది. ఇదే క్రమంలో ఇల్లు కట్టుకోవడానికి 1.5 లక్షల కూడా ఇవ్వడం జరిగింది.
అయితే మరి ఇప్పుడు మరో వీడియో వైరల్ గా మారింది. దస్మంత్ చెప్పిన విధానం ప్రకారం ఆయన కలెక్టర్ కి అబద్దం చెప్పానని తన స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా వైరల్ గా మారిన వేధింపుల వీడియోలో నిజానికి ఆ వ్యక్తి తనో కాదో కూడా తనకి స్పష్టంగా తెలియదని తను ఒప్పుకోవడం జరిగింది.
కాకపోతే వైరల్ గా మారిన వీడియో 2020లో జరిగిన సంఘటనని, కాకపోతే ఆ సందర్భంలో తను మత్తులో ఉండడం కారణంగా, మూత్ర విసర్జన చేసింది ఎవరో కూడా స్పష్టంగా తనకి తెలియదని చెప్పారు. కాకపోతే తర్వాత అది చేసిన నిందితుడు లొంగిపోవడం ద్వారా తనకి అసలు విషయం తెలిసిందని చెప్పుకొచ్చాడు. కాకపోతే, ఆ వీడియో విషయంలో ఏ విషయం స్పష్టంగా లేకుండా కలెక్టర్కు ఆ వీడియోలో ఉన్నది తనే అని అబద్ధం మాత్రం చెప్పినట్లు దస్మంత్ రావత్ ఒప్పుకున్నాడు.
మధ్యప్రదేశ్లో మూత్ర విసర్జన కేసు చాలా మలుపులు తిరుగుతూ వచ్చింది. ఒక వీడియోలో గమనిస్తున్నట్లయితే ఒక వ్యక్తి పైన మరో వ్యక్తి మూత్ర విసర్జన చేయడం దేశంలో జరిగిన ఒక దుర్ఘటన. తర్వాత నిందితుడు ప్రవేష్ శుక్లనీ పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత వేధింపులకు గురైన వ్యక్తి దస్మంత్ రావత్ కు జరిగిన అన్యాయానికి గాను చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చేతుల మీదగా ఆయన కాళ్లు కూడా కడగడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా 5 లక్షల శాంక్షన్ అయింది. ఇదే క్రమంలో ఇల్లు కట్టుకోవడానికి 1.5 లక్షల కూడా ఇవ్వడం జరిగింది.
అయితే చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చేతుల మీదుగా కాలు కడిగించుకున్న వ్యక్తి అసలైన వేధింపులకు గురైన వ్యక్తి అవునో కాదో కూడా తెలియకుండా, అసలు ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అని బిజెపి నిలదీస్తుంది. అంతేకాకుండా అసలైన వ్యక్తికి కాకుండా అంత డబ్బు మరో వ్యక్తికి ముట్ట చెప్పడం, నిజంగా ప్రభుత్వం వైఫల్యం అని ఎత్తి పొడుస్తున్నారు.
అయితే ప్రస్తుతానికి నిందితుడి ప్రవేష్ శుక్లని రిలీజ్ చేయాలని వారి కమ్యూనిటీ సభ్యులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వచ్చిన మరో ట్విస్ట్ ద్వారా, నిందితుడిని తప్పకుండా రిలీజ్ చేయాలని ఎందుకో నిజ నిజాలు ముందుగా తెలుసుకోకుండా అరెస్టు చేయడంలో అర్థం లేదని తమ కమ్యూనిటీ సభ్యులు నిలదీస్తున్నారు.