నచ్చిన పని కోసం 13 జాబ్‌ ఆఫర్స్‌ను వదిలేసుకుంది

చాలా మంది అమ్మనాన్న చెప్పారనో, ఫ్రెండ్స్‌ చెప్పారనో, బంధువులు  ఏమనుకుంటారనో తమకు నచ్చిన పనిని చేయలేక, ఏవేవో జాబ్‌లు చేస్తుంటారు. మరికొంత మంది చేసే పనిలో గ్రోత్‌ ఉంటుందో లేదో అని భయపడి.. వేరే పని చేస్తూ, లైఫ్లో శాటిస్ ఫై లేకుండా ఉంటారు.చేతి నిండా డబ్బులు వచ్చే జాబ్‌ చేస్తున్నా… మనసుకు ఆనందంగా లేదని బాధపడుతుంటారు. కానీ, ఇక్కడ ఓ టెకీ మాత్రం తనకు నచ్చిన పని చేయడానికి ఏకంగా 13 జాబ్‌ ఆఫర్స్‌ ను […]

Share:

చాలా మంది అమ్మనాన్న చెప్పారనో, ఫ్రెండ్స్‌ చెప్పారనో, బంధువులు  ఏమనుకుంటారనో తమకు నచ్చిన పనిని చేయలేక, ఏవేవో జాబ్‌లు చేస్తుంటారు. మరికొంత మంది చేసే పనిలో గ్రోత్‌ ఉంటుందో లేదో అని భయపడి.. వేరే పని చేస్తూ, లైఫ్లో శాటిస్ ఫై లేకుండా ఉంటారు.చేతి నిండా డబ్బులు వచ్చే జాబ్‌ చేస్తున్నా… మనసుకు ఆనందంగా లేదని బాధపడుతుంటారు. కానీ, ఇక్కడ ఓ టెకీ మాత్రం తనకు నచ్చిన పని చేయడానికి ఏకంగా 13 జాబ్‌ ఆఫర్స్‌ ను వదిలేసుకుంది. ఇందులో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో లాంటి పెద్ద పెద్ద కంపెనీల జాబ్‌లను కూడా తిరస్కరించింది. ఇందులో సంవత్సరానికి రూ.17 లక్షల జీతం వచ్చే జాబ్‌ కూడా ఉంది. అవన్నీ కాదని 21 ఏళ్ల రితీ కుమారి అనే యువతి తనకు నచ్చిన జాబ్‌ చేసేందుకు ఇంటర్న్‌ షిప్‌లో జాయిన్‌ అయింది. ఇప్పుడు ఆమె ఏకంగా ఏడాదికి రూ.20 లక్షలకు పైగా సంపాదిస్తుంది. 

 బెంగళూరుకు చెందిన టెకీ రితి కుమారి.. తనకు వచ్చిన జాబ్‌ ఆఫర్లను వదిలేసుకొని, బదులుగా ఆరు నెలలు పాటు ఉండే ఇంటర్న్‌ షిప్‌ తీసుకుంది. అయితే, దీనిపై ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వచ్చిన జాబ్‌లలో ఏదో ఒకటి  చేయాలని అడిగారు. కానీ, ఆమె దానికి ఒప్పుకోలేదు. తన మనస్సుకు నచ్చిన వర్క్‌  చేయాలని డిసైడ్‌ అయ్యింది. రితి మనీ కంట్రోల్‌తో మాట్లాడి ఇతర ఆఫర్లు ఎలా లాభదాయకంగా ఉంటాయో తెలుసుకుంది. ఇదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు వివరించింది. ఆ తర్వాత రితి తన సిస్టర్‌‌ ఇన్‌స్పిరేషన్‌తో ఆమెను ఫాలో అయ్యింది. ఈ క్రమంలో రితి వాల్‌మార్ట్‌ ను ఎంచుకుంది.  

ఆ తర్వాత రితి అనుకున్నట్టుగానే ఇంటర్న్‌ షిప్‌గా వాల్‌మార్ట్ లో జాయిన్ అయింది. ఆరు నెలలు ఉండే ఈ ఇంటర్న్‌ షిప్‌ ప్రోగ్రామ్‌లో ఆమెకు నెలకు రూ.85 వేల స్టైపండ్‌  ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ‘‘నేను వాల్‌మార్ట్‌ ఇంటర్న్‌ షిప్‌ ఆఫర్‌‌ను అందుకున్నప్పుడు సంతోషంగా ఉన్నాను. దానిలో కచ్చితంగా చేరాలనే ఉద్దేశంతో ఎవరు అడ్డుచెబుతున్నా.. అందులో గ్రోత్ ఉండదని హెచ్చరిస్తున్నా పట్టించుకోలేదు. నా నిర్ణయంతో మా అమ్మానాన్న హ్యాపీగా లేరని నాకు తెలుసు. ఇది నాకు వచ్చిన జాబ్‌ ఆఫర్ల కంటే తక్కువ జీతం వచ్చే ఉద్యోగమని కాదు.. ఆరు నెలల ఇంటర్న్‌ షిప్‌ ముగిసిపోయిన తర్వాత ఏం చేయాలని వారు బాధపడ్డారు. ఇది నా దృష్టిలో నేను తీసుకున్న చాలా కఠినమైన నిర్ణయం” అని రితి చెప్పింది.   

అంతకుముందు బెంగళూరుకు చెందిన ఫైనాన్స్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌‌ అయిన శరణ్ హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్‌లో శరణ్‌తో ఫైనాన్స్‌ గా చాలా ఫేమస్‌. అతను తన జర్నీని చాలా సాధారణంగా ప్రారంభించి, ఇప్పుడు అసాధారణ స్థాయికి ఎదిగాడు. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్ (క్యాట్‌) లో పరీక్షలో 98 పర్సంటేజ్‌ సాధించినప్పటికీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ మంగళూరులో జాయిన్‌ అవ్వాలన్న తన కలను మూడేళ్ల క్రితం వదులుకోవాల్సి వచ్చిందని ఇటీవల తన పోస్ట్‌ లో పేర్కొన్నాడు. 

ప్రతిష్టాత్మకమైన సంస్థలో అడ్మిషన్‌ రాకపోవడంతో, ఏం చేయాలో తెలియక శరణ్ అయోమయో స్థితిలో పడిపోయాడు. ఆ తర్వాత అమెరికాలో డిగ్రీ పూర్తి చేయాలని డిసైడ్‌ అయ్యాడు. తర్వాత అతనికి కొలంబియా యూనివర్సిటీలో సీటు వచ్చినప్పటికీ.. అందులో జాయిన్‌ అవ్వలేదు. కంటెంట్‌ క్రియేషన్‌లో తన కెరీర్‌‌ను కొనసాగించడానికి నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత శరణ్‌ కంటెంట్‌ క్రియేషన్‌లో ఎవ్వరూ ఊహించని స్థాయికి ఎదిగాడు. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన పర్సనల్ ఫైనాన్స్‌ అండ్‌ మనీ మేనేజ్‌మెంట్‌ గురించి ఎక్కువగా ఈయన కంటెంట్‌ ఉంటుంది. మీరు తరుచుగా ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తే, శరణ్‌కు సంబంధించిన ఫైనాన్స్‌ కంటెంట్‌ రీల్స్ లేదా పోస్ట్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఐఐఎం బెంగళూరు నుంచి అతనికి పిలుపు వచ్చింది.. అందులో జాయిన్‌ అవ్వాలని కాదు.. అక్కడికి చీఫ్‌ గెస్ట్‌ గా హాజరై స్పీచ్‌ ఇవ్వాలని ఆ సంస్థ శరణ్‌ను స్వాగతించింది.