విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డాగా మారిన కోటా

చాలామంది విద్యార్థులు ముఖ్యంగా కోటా అనే ప్రదేశానికి కోచింగ్ కోసం వచ్చిన చాలామంది, చదువు ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకునే క్రమం రోజురోజుకీ ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. కేవలం ఒక్క సంవత్సరంలోనే 27 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. ఆత్మహత్యలకు ముఖ్య కారణం ఒత్తిడి అని, సమస్యలను చెప్పుకోవడానికి పక్కన తమ ఆత్మీయులు లేకపోవడమే అని నిపుణులు భావిస్తున్నారు.  ఆత్మహత్యలకు అడ్డాగా మారిన కోటా:  IITలు, వైద్య కళాశాలలకు అర్హత సాధించడానికి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో అధిక విజయాల […]

Share:

చాలామంది విద్యార్థులు ముఖ్యంగా కోటా అనే ప్రదేశానికి కోచింగ్ కోసం వచ్చిన చాలామంది, చదువు ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకునే క్రమం రోజురోజుకీ ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. కేవలం ఒక్క సంవత్సరంలోనే 27 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. ఆత్మహత్యలకు ముఖ్య కారణం ఒత్తిడి అని, సమస్యలను చెప్పుకోవడానికి పక్కన తమ ఆత్మీయులు లేకపోవడమే అని నిపుణులు భావిస్తున్నారు. 

ఆత్మహత్యలకు అడ్డాగా మారిన కోటా: 

IITలు, వైద్య కళాశాలలకు అర్హత సాధించడానికి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో అధిక విజయాల రేటుతో ముందున్న పట్టణం కోటా.. గత కొన్నేళ్లుగా విద్యార్థుల ఆత్మహత్యలతో మరో రికార్డ్ సృష్టించింది.. ఈ ఏడాదిలోనే సుమారు 27 ఆత్మహత్యలు ఇక్కడే నమోదయ్యాయి. 

గతేడాది 15 మంది యువకులు ఆత్మహత్య చేసుకునే తమ ప్రాణాలు కోల్పోయారు. గతంలో కూడా, చాలా మంది తీవ్రమైన సిలబస్ ఒత్తిడి.. పనిభారం, పోటీ, కుటుంబం మరియు తాము సక్సెస్ అవ్వకపోతే సమాజం ఏమనుకుంటుందో అని అంచనాలతో నలిగిపోయి తమ జీవితాలను ముగించారు. కోటా వ్యవస్థలో నలుగురు వాటాదారులు ఉన్నారు – వాళ్లే తల్లిదండ్రులు, ప్రభుత్వం, కోచింగ్ సెంటర్లు మరియు హాస్టల్ యజమానులు. కోచింగ్‌ సెంటర్లు, హాస్టల్‌ యజమానులకు డబ్బుల బెడద. కోచింగ్ సెంటర్‌లు కొంతమంది టాపర్‌లను చూసుకునిసంబరాలు చేసుకుంటాయి.. అదే సమయంలో ఓడిపోయినవారిని పక్కన పెడతారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా సంక్షోభం ముదిరేలా మరో పక్క చేస్తున్న క్రమం కనిపిస్తుంది. అయితే ఇక్కడ కేవలం నష్టపోయేది తల్లిదండ్రులు మాత్రమే.. తమ డబ్బు పోవడమే కాకుండా.. ప్రయోజకులవుతారని కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేసిన బిడ్డలు, ప్రాణాలతో మిగిలి ఉండటం లేదు.

సైకాల‌జిస్ట్ ఇందిరా రాయ్ మండల్ మాట్లాడుతూ.. కోటా అనే ప్రదేశం ముఖ్యంగా పిల్లల చదువుల కోసం మంచి పని చేస్తున్నప్పటికీ.. కోచింగ్ పేరుతో ఎంతో మంది టాపర్స్ ని తయారు చేస్తున్నప్పటికీ.. మరోపక్క పిల్లల కోరికలను అణగద్రొక్కే విధంగా ఆ కోటాలో ఉన్న వ్యవస్థ పని చేస్తుందని గుర్తు చేశారు. దీని కారణంగానే చాలామంది ఆత్మహత్యలకు గురవుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా కోటా ప్రదేశంలో కోచింగ్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి అర్హత దొరకడం కష్టమని.. వారు కొంతమంది టాపర్స్ ని మాత్రమే ఎంచుకోవడానికి ముందుగా ఒక పోటీ పరీక్ష నిర్వహిస్తారని.. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే కోటాలో కోచింగ్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. సుమారు ప్రతియాట మూడు లక్షల మంది స్టూడెంట్స్ ఐఐటి, జేఈఈ, మెడికల్ ప్రవేశాల గురించి కోటా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతూ ఉంటారని, అయితే ప్రతి ఏటా 2.5 లక్షల రూపాయలు కట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కోచింగ్ తీసుకుంటున్నారని వెల్లడించారు. 

ఆ సిల‌బ‌సే చదవాలట: 

విద్యార్థులు తమ 12వ తరగతి బోర్డు పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ సెంటర్లు సపోర్ట్ చేయమని స్పష్టం చేశారు.. అంతేకాకుండా కేవలం వారి IIT లేదా మెడికల్ ప్రవేశ పరీక్షపై దృష్టి కేంద్రీకరించాలని కోచింగ్ సెంటర్లు కోరారు. 12వ తరగతిలో స్కోర్‌లు.. ప్రవేశ పరీక్షలు రాయడానికి అర్హత సాధిస్తాయి కాబట్టి, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లతో టై-అప్ ఉన్న డమ్మీ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకుంటారు. అంతేకాకుండా ఇటువంటి డమ్మీ స్కూల్లో.. నిజానికి అటెండెన్స్ కూడా అవసరం లేదని కొంతమంది చెప్పుకుంటారు. 

ఈ క్రమంలోనే..మెడికల్ మరియు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల సిలబస్‌ ప్రిపేర్ అధికారులకు.. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు మధ్య సంబంధం ఉందా? ఈ పరీక్షలను క్లియర్ చేయడానికి 11,12 తరగతిలో ఉన్న సిలబస్ ఎందుకు సరిపోదు? కొత్త విద్యా విధానం 2020 ఉన్నప్పటికీ, స్కూల్లో చెప్పే సిలబస్, నీట్ లేదా IIT,JEE సిలబస్‌తో సరిచేయడానికి రీడిజైన్ చేయడానికి CBSE లేదా మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఎందుకు ప్రయత్నించలేదు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లేనంతసేపు.. తప్పకుండా దేశవ్యాప్తంగా ప్రజలను దోచుకునే కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల పుట్టుకొస్తాయని, మరింత మంది స్టూడెంట్స్ సిలబస్ ఒత్తిడికి గురవలసిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా ఆత్మహత్యలు జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్క పిల్లవాడిని తమ తల్లిదండ్రులు.. ఒత్తిడికి గురవకుండా చూసుకోవాలని.. ఒత్తిడి లేకుండా చేసే ఏదైనా ప్రయత్నం, తప్పకుండా సక్సెస్ అవుతుందని తెలుసుకోవాలంటున్నారు.