చంద్రబాబు అరెస్టు వెనక ముఖ్య కారణాలు ఇవే.. 

చంద్రబాబు నాయుడు, స్కిల్ డెవలప్మెంట్ స్కాం కింద సెప్టెంబర్ 9న అరెస్టు అయ్యారు.  అయితే సిఐడి చేసిన ఇన్వెస్టిగేషన్ ద్వారా,  చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగినట్లు వెల్లడైంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ₹ 371 కోట్ల కుంభకోణానికి  ముఖ్య ప్రధాన సూత్రధారి అని వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వర్గాలు ఆరోపించాయి.  అరెస్ట్ […]

Share:

చంద్రబాబు నాయుడు, స్కిల్ డెవలప్మెంట్ స్కాం కింద సెప్టెంబర్ 9న అరెస్టు అయ్యారు.  అయితే సిఐడి చేసిన ఇన్వెస్టిగేషన్ ద్వారా,  చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగినట్లు వెల్లడైంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ₹ 371 కోట్ల కుంభకోణానికి  ముఖ్య ప్రధాన సూత్రధారి అని వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వర్గాలు ఆరోపించాయి.

 అరెస్ట్ అయిన చంద్రబాబు:

హైదరాబాదుకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాలలో సెప్టెంబర్ 9, 2023 తెల్లవారుజామున చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారు. ఈ క్రమంలోని చంద్రబాబు నాయుడుని అదుపులోకి తీసుకునేందుకు నంద్యాలకు చేరుకున్న పోలీసులతో టీడీపీ మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు. చివరకు అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.

మీడియా ప్రతినిధులతో చేసిన ప్రసంగంలో, రాష్ట్ర CID సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ,  జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు నాయుడు నిజానికిప్రధాన నిందితుడు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ స్థాపనకు  సంబంధించి ఈ కేసు  నమోదయిందని ఆంధ్రా సీఐడీ అదనపు డీజీపీ ఎన్‌ సంజయ తెలిపారు. షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయడం అంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలోనే జరిగిందని అధికారి తెలిపారు. కుంభకోణాన్ని పక్కాగా ప్లాన్ చేసి, దర్శకత్వం వహించి, అమలు చేసారని  చంద్రబాబు నాయుడు  మీద ఆరోపణలు చేశారు అధికారులు. 

భారీ కుంభకోణం:

యువకులకు ఉద్యోగ శిక్షణ అందించేందుకు, అప్పటి ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ కుంభకోణానికి కేంద్రంగా నిలుస్తోంది. జర్మనీకి చెందిన ఇంజినీరింగ్ దిగ్గజం సీమెన్స్ తో అప్పటి టీడీపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. సీమెన్స్, ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియా లిమిటెడ్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో కూడిన కన్సార్టియం భాగస్వామ్యంతో రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ బాడీ ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయనుంది. సీమెన్స్ ఆరు ఎక్స్‌లెన్స్ సెంటర్‌లను స్థాపించే బాధ్యతను  అప్పగించడం జరిగిందని కూడా వర్గాలు తెలిపాయి.

3,356 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 శాతం వాటా  సమకూర్చుకుంటూ  జరిగినదే ఈ ఒప్పందం. సీమెన్స్ ప్రాజెక్ట్‌లో ఎలాంటి నిధులను పెట్టుబడి పెట్టనప్పటికీ, మూడు నెలల్లోనే ఐదు విడతలుగా ₹ 371 కోట్ల  కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 ఇది సబబు కాదంటున్న  చంద్రబాబు:

చంద్రబాబుని అరెస్ట్ చేసే క్రమంలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే ఆరోపణలలో తన పేరు ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 45 సంవత్సరాలు ప్రజల కోసం తాను పాటుపడ్డానని,  అయితే ప్రజల కోసం తన ప్రాణాలనైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని,  ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని,  చంద్రబాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి ఫైళ్లపై అప్పటి ప్రధాన ఆర్థిక కార్యదర్శి, సంతకం చేయలేదని,  అంతేకాకుండా, కుంభకోణానికి సంబంధించిన కీలకమైన డాక్యుమెంటరీ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 

కొంతమందిని అరెస్ట్ చేసిన ఈడి:

ఈ భారీ కుంభకోణానికి పాల్పడిన ప్రముఖులను ఇటీవలే ED దాడులు చేసి అరెస్టు చేసింది. సీమెన్స్ ఇండియా సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వికాస్ వినాయక్ ఖాన్విల్కర్, మాజీ ఆర్థిక సలహాదారు ముకుల్ చంద్ర అగర్వాల్‌లను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో స్కిల్లర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సురేష్ గోయల్ కూడా ఉన్నారు. వీరి మీద నిధుల దుర్వినియోగం మరియు మనీలాండరింగ్ కేసు నమోదు  చేయడం, నయీంను కూడా అరెస్ట్ చేయడం జరిగింది, దర్యాప్తు పురోగతిలో ఉంది.