Milk: పాలు పొంగడానికి కారణమేమిటి?

పాలు (Milk) మరిగిస్తున్నప్పుడు, మన ఎంత సేపు వేచి ఉన్నా పొంగని పాలు (Milk), మనం కళ్ళు మూసి తెరిచేలోగా పొంగిపోతూ (Overflow) ఉంటాయి. అందుకే పాలు (Milk) మరిగేంతవరకు స్టవ్ దగ్గర చాలా మంది కచ్చితంగా ఉంటారు. అయితే తాను మరిగే వరకు తన దగ్గరే నిలబడమంటున్న పాలు (Milk), అసలు ఎందుకు పొంగుతాయో (Overflow)! అసలు పాలు (Milk) పొంగకుండా ఉండాలంటే ఏం చిట్కా (Tip) వాడాలో? అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందామా..  […]

Share:

పాలు (Milk) మరిగిస్తున్నప్పుడు, మన ఎంత సేపు వేచి ఉన్నా పొంగని పాలు (Milk), మనం కళ్ళు మూసి తెరిచేలోగా పొంగిపోతూ (Overflow) ఉంటాయి. అందుకే పాలు (Milk) మరిగేంతవరకు స్టవ్ దగ్గర చాలా మంది కచ్చితంగా ఉంటారు. అయితే తాను మరిగే వరకు తన దగ్గరే నిలబడమంటున్న పాలు (Milk), అసలు ఎందుకు పొంగుతాయో (Overflow)! అసలు పాలు (Milk) పొంగకుండా ఉండాలంటే ఏం చిట్కా (Tip) వాడాలో? అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందామా.. 

పాలు పొంగడానికి కారణమేమిటి?: 

పాలు (Milk) మరగపట్టే సమయంలో, పాలు (Milk) పొంగిపోకుండా (Overflow) ఉండేందుకు మనం ఎప్పుడూ జాగ్రత్త వహించాలి. చాలామంది తక్కువ మంటపై వేడి చేసేలా చూసుకుంటూ ఉంటారు. పాలు (Milk) మరిగించేటప్పుడు అసలు ఎందుకు పొంగుతాయో (Overflow) మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం పాలు (Milk) మాత్రమే ఎందుకు పొంగుతాయి (Overflow)? నీళ్లు (Water) ని మరగపెట్టేటప్పుడు ఎందుకు పొంగవు? Quoraలో ఒక వినియోగదారు ఈ ప్రశ్న (Question) అడిగారు. ఇది చాలా మందికి ఆసక్తిని కలిగించింది. Quoraలో ఒక యూజర్ చెప్పినదానికి ప్రకారం, ఒక వివరణ ఏమిటంటే, పాలలో కొవ్వు, ప్రోటీన్లు, విటమిన్లు మరియు కార్బోహైడ్రేట్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో 87 శాతం నీరు మరియు 5 శాతం ప్రొటీన్లు, 5 శాతం లాక్టోస్ లేదా మిల్క్ షుగర్ వంటివి పాలను తీపి రుచిగా మార్చడానికి బాధ్యత వహిస్తుంది. 7 శాతం కొవ్వు ఉంటుంది. కొవ్వు వేడెక్కినప్పుడు, అది నీటి కంటే తేలికైనందున అది తేలుతుంది. దీని కారణంగానే పాలు (Milk) మరిగించేటప్పుడు, పాల మీద పైభాగంలో క్రీము పొరను ఏర్పరుస్తుంది. నీరు, మరోవైపు, ఆవిరి బుడగలు కింద ఉండిపోతాయి.

పాలు (Milk) మరిగించడం వల్ల, అందులోని నీటి కంటెంట్ 100 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నప్పుడు, మరగడం అనేది ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే మరింత ఆవిరిని ఉత్పత్తి చేస్తుంది, ఈ సమయంలో ఆవిరి బుడగలు మరిన్ని ఎక్కువగా ఏర్పడతాయి. ఈ ప్రక్రియ ఎక్కువ అయినప్పుడు, పైభాగంలోని కొవ్వు మరియు క్రీము పొరను పైకి లేపుతుంది, దీని వలన అది పాలు (Milk) మరిగేటప్పుడు పొంగిపోవడం (Overflow) జరుగుతుంది. నీరు మరిగే సమయంలో, ఆవిరి బుడగలు ఉపరితలంపైకి చేరిన వెంటనే పేలిపోయి నీటిలో కలిసిపోతాయి, అందువల్ల నీరు పొంగిపోదు (Overflow).

పాలు పొంగకుండా ఉండడానికి చక్కని చిట్కా: 

మీరు పాలు (Milk) మరిగించేటప్పుడు.. పొంగిపోవడం (Overflow) వంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి, సమయం తగ్గించుకునేందుకు, ఇక్కడ ఒక సులభమైన పరిష్కారం, చిట్కా (Tip) ఉంది. పాలను ఎప్పుడూ తక్కువ, సన్నని మంటపై మరిగించేలా మాత్రమే చూసుకోండి. పాలు (Milk) మరిగించే సమయంలో పొంగిపోతాయేమో (Overflow) అని భయం లేకుండా.. ఆ సమయంలో మీరు వేరే పని కూడా చేసుకునే అవకాశం ఇస్తూ, ఈ చిట్కా (Tip) మీకు సహాయం చేస్తుంది. అయితే ఇదే సమయంలో మరో చిట్కా (Tip) ఏంటంటే, పాలు (Milk) మరిగించేటప్పుడు పాల పాత్రపై పొడవాటి హ్యాండిల్ చెంచా పెట్టండి. ఇలా చేయడం ద్వారా కూడా పాలు (Milk) పొంగకుండా ఉంటాయి.

పాలు (Milk) కాకుండా, సూప్, చాక్లెట్ సాస్ లేదా పాస్తా వంటి ఆహారం వండేటప్పుడు కూడా ఒక్కోసారి పొంగే అవకాశం ఉంటుంది. సముద్రపు నీరు కూడా, ఏదైనా సందర్భంలో మరిగించేటప్పుడు, అది స్వచ్ఛమైన నీరు కానందున పొంగే (Overflow)అవకాశం ఉంది. ఒక Quora వినియోగదారు చెప్పిన దాని ప్రకారం.. ఫిజీ డ్రింక్స్ (Drinks) గ్లాసులో పోసినప్పుడు నురగలు వస్తాయని గుర్తు చేశాడు. వినియోగదారు ప్రకారం, చక్కెర, పండ్ల రసాలు లేదా ఆహార రంగు వంటివి కలిగి ఉన్న కార్బోనేటేడ్ డ్రింక్స్ (Drinks) ఏవైనా సరే.. గ్లాసులో వేసేటప్పుడు.. గ్యాసెస్ డిసాల్వ్ అయిపోతాయి కాబట్టి అవి నురుగుగా మారి పైకి పొంగుతాయి (Overflow).