రాహుల్ గాంధీతో పెళ్లికి రెడీ.. కానీ షరతులు వర్తిస్తాయి

దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో రాహుల్ గాంధీ ఒకరు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన, ప్రధాని పదవి ప్రధాన పోటీదారు అయిన ఆయన ఇప్పటి దాకా పెళ్లి చేసుకోలేదు. భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచినా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల బాధలు తెలుసుకుంటున్నా.. ఎక్కడికెళ్లినా.. ఆయన పెళ్లి గురించిన ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ‘ఎప్పడు పెళ్లి చేసుకుంటారు?’ అని ఎవరైనా అడిగితే.. ఓ నవ్వు నవ్వేసి తప్పించుకుంటారు […]

Share:

దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో రాహుల్ గాంధీ ఒకరు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన, ప్రధాని పదవి ప్రధాన పోటీదారు అయిన ఆయన ఇప్పటి దాకా పెళ్లి చేసుకోలేదు. భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచినా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల బాధలు తెలుసుకుంటున్నా.. ఎక్కడికెళ్లినా.. ఆయన పెళ్లి గురించిన ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ‘ఎప్పడు పెళ్లి చేసుకుంటారు?’ అని ఎవరైనా అడిగితే.. ఓ నవ్వు నవ్వేసి తప్పించుకుంటారు రాహుల్. లేదంటే మంచి అమ్మాయి దొరికితే చేసుకుంటానంటారు. ఇటీవల ఇదే ప్రశ్న ఆయన తల్లి, కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీకి కూడా ఎదురైంది. ‘మంచి అమ్మాయిని చూడండి చేసేద్దాం’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు సోనియా. ఈ నేపథ్యంలో ఓ ఊహించని వ్యక్తి నుంచి రాహుల్ గాంధీకి పెళ్లి ప్రపోజల్ వచ్చింది. అది కూడా వివాదాస్పద శృంగార తార షెర్లిన్ చెప్రా నుంచి ఈ ప్రతిపాదన రావడం గమనార్హం.

నేను సిద్ధమే కానీ..

రాహుల్ గాంధీని పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధమని బాలీవుడ్ తార, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ షెర్లిన్ చోప్రా ప్రకటించింది. అయితే ఇందుకు ఓ షరతు పెట్టింది. ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన షెర్లిన్ చోప్రా..రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానని, కానీ పెళ్లి తర్వాత తన పేరును మార్చుకోనని చెప్పుకొచ్చింది. తన పేరులో చోప్రా అనే పెట్టుకుంటానని, గాంధీని పెట్టుకోనని స్పష్టం చేసింది. ఈ షరతుకు ఒప్పుకుంటే పెళ్లికి సిద్ధమని చెప్పింది. ఈ వ్యాఖ్యలు కాస్తా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సెమీ పోర్న్ స్టార్.. 

షెర్లిన్ చోప్రా సెమీ పోర్న్ స్టార్ రీతిలో సినిమాలు చేసింది, చేస్తోంది. హైదరాబాద్‌కు చెందిన షెర్లిన్.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా పలు సినిమాల్లో నటించింది. తెలుగులో ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ సహా పలు చిత్రాల్లో నటించింది. ‘ప్లేబాయ్’ మ్యాగజైన్‌కు నగ్నంగా పోజులిచ్చిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కింది. హిందీ బిగ్‌బాస్‌కు వెళ్లింది. ఎంటీవీ స్ప్లిట్‌విల్లాకూ వెళ్లింది. కేవలం హీరోయిన్‌గానే కాదు.. నిర్మాతగా, సింగర్‌‌గానూ షెర్లిన్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 

ఇక వివాదాస్పద ‘కామసూత్ర 3డీ’ పెద్ద చర్చనీయాంశమైంది. 2013–14 టైమ్‌లో రూపొందించిన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. అప్పట్లో విడుదలైన ట్రైలర్‌‌ పెను దుమారమే రేపింది. తను నటించిన సినిమాల్లో అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడదు షెర్లిన్. ఫ్రెండ్స్‌ ఫరెవర్, రెడ్ స్వస్తిక్, జవానీ దివానీ తదితర 20 దాకా సినిమాల్లో నటించినా ఎక్కడా పెద్దగా ఫేమ్ రాలేదు. ఇటీవల పౌరాష్‌పూర్‌‌ –2 అనే వెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ప్రమోషన్లలో బిజీగా ఉన్న షెర్లిన్.. రాహుల్‌తో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి కావాల్సిన పబ్లిసిటీని పొందింది. దీంతో చర్చంతా రాహుల్ పెళ్లి చుట్టూ తిరిగింది. అయితే ఈ వ్యాఖ్యలపై రాహుల్ స్పందించలేదు.

సోనియానూ అడిగారు

ఇటీవల ఢిల్లీ 10 జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి హర్యానాకు చెందిన మహిళా రైతులు, వారి పిల్లలు వచ్చారు. రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు వాళ్లను ‘ఢిల్లీ దర్శన్‌’ పేరుతో ప్రత్యేకంగా పిలిపించి దేశరాజధానిలోని ప్రసిద్ధ కట్టడాలను చూపించారు. తర్వాత సోనియా ఇంటికి భోజనం కోసం వారంతా వెళ్లారు. గాంధీ కుటుంబంతో వారు సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా ఓ పెద్దావిడ రాహుల్ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ‘రాహుల్‌కు పెళ్లి చేద్దామా?’ అంటూ మెల్లగా సోనియాను అడిగారు. దీంతో సోనియా.. ‘మీరే అమ్మాయిని చూడండి’ అని బదులిచ్చారు. ఈ సమయంలో అక్కడే ఉన్న రాహుల్ ‘అవుతుంది.. అవుతుంది..’ అనడంతో అందరూ నవ్వేశారు. ఇప్పుడు షెర్లిన్ చోప్రా వ్యాఖ్యలతో మరోసారి రాహుల్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. మరి రాహుల్ ఇప్పుడైనా క్లారిటీ ఇస్తారా?