Ratan Tata: రషీద్‌ ఖాన్‌కు రూ.10కోట్ల రివార్డ్‌ వార్తలపై రతన్‌ టాటా క్లారిటీ

తాను ఏ క్రికెటర్‌కు రివార్డు(Reward) ప్రకటించలేదని, క్రికెట్‌తో తనకు ఏ విధంగానూ సంబంధం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా (Ratan Tata) స్పష్టం చేశారు. తనపై సోషల్‌మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌(World Cup)లో అఫ్ఘానిస్థాన్‌(Afghanistan) సంచలనాలు నమోదు చేస్తోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను మట్టికరిపించిన అఫ్గాన్‌…. పాకిస్తాన్‌ను  ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. పాకిస్థాన్(Pakistan) చేతిలో పరాజయాల పరంపరకు తెరదించుతూ గ్రాండ్ విక్టరీ కొట్టిన అనంతరం అఫ్గాన్ […]

Share:

తాను ఏ క్రికెటర్‌కు రివార్డు(Reward) ప్రకటించలేదని, క్రికెట్‌తో తనకు ఏ విధంగానూ సంబంధం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా (Ratan Tata) స్పష్టం చేశారు. తనపై సోషల్‌మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌(World Cup)లో అఫ్ఘానిస్థాన్‌(Afghanistan) సంచలనాలు నమోదు చేస్తోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను మట్టికరిపించిన అఫ్గాన్‌…. పాకిస్తాన్‌ను  ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. పాకిస్థాన్(Pakistan) చేతిలో పరాజయాల పరంపరకు తెరదించుతూ గ్రాండ్ విక్టరీ కొట్టిన అనంతరం అఫ్గాన్ క్రికెటర్లు తమైదన శైళిలో సంబరాలు చేసుకున్నారు. నృత్యాలు చేస్తూ ఒకరినొకరు అభినందించుకుంటూ  సందడి చేశారు. అఫ్గాన్‌ క్రికెటర్ల సంబరాల్లో టీమిండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌(Irfan) కూడా కలిశాడు. అఫ్గాన్‌ టాప్‌ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌(Rashid Khan)తో కలిసి ఇర్ఫాన్‌ మైదానంలో చిందేశాడు. అయితే  అఫ్గాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా(Ratan Tata) రూ.10 కోట్లు రివార్డు ప్రకటించారంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే నిజంగానే రతన్‌ టాటా.. రషీద్‌ఖాన్‌కు రూ. 10 కోట్లు ఇచ్చారా అన్నదానిపై స్వయంగా ఆయనే స్పష్టత ఇచ్చారు.

 పాకిస్థాన్‌(Pakistan)పై విజయం సాధించిన తర్వాత స్టార్‌ స్పిన్నర్‌ రషీద్ ఖాన్‌(Rashid Khan)కు రతన్ టాటా రూ.10 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నార్న వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పాక్‌పై గెలిచిన తర్వాత రషీద్‌ ఖాన్‌ భారత జెండాను ఎగురవేసినట్లు కూడా ఒక వీడియోలో కనిపించింది. ఈ చర్యలతో రషీద్‌ఖాన్‌కు ఐసీసీ రూ.55 లక్షలు జరిమానా విధించిందని నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి రతన్‌ టాటా.. రషీద్‌ ఖాన్‌(Ratan Tata)కు రూ.10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించారని ఆ పోస్టుల్లో రాసుకొచ్చారు. ఐసీసీ(ICC) జరిమానా విధించిన తర్వాత రతన్‌ టాటా స్పందించారన్న వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. రషీద్‌ఖాన్‌(Rashid Khan)పై జరిమానా ఎత్తేయాలని ఐసీసీకి టాటా విజ్ఞప్తి చేశారని  ఆ వార్తల సారంశం. రషీద్‌కు రతన్‌ టాటా రూ.10 కోట్లు ఇచ్చారని కూడా బాగా ప్రచారం జరిగింది.

Also Read: Pakistan: షాదాబ్ ఖాన్ గాయం వట్టిదంటున్న మాజీ పాకిస్తాన్ ఆటగాడు

 అయితే ఈ వార్తలను రతన్‌ టాటా(Ratan Tata) ఖండించారు. ఇదంతా ఫేక్‌ న్యూస్‌ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఐసీసీ(ICC)తో తాను ఏ క్రికెటర్‌ తరఫున మాట్లాడలేదని, అలాంటి ఫార్వర్డ్‌ మెసేజ్‌లను నమ్మొద్దని స్పష్టం చేశారు. ఏ ఆటగాడి జరిమానా గురించి నేను ఐసీసీ సహా ఏ క్రికెట్‌ సంస్థలకు ఎలాంటి సూచనలు చేయలేదని సోషల్‌ మీడియా(Social Media) దిగ్గజం ఎక్స్‌లో టాటా ట్వీట్‌ చేశారు. ఏ ఆటగాడికి తాను రివార్డు(Reward)  కూడా ప్రకటించలేదని స్పష్టం చేశారు. క్రికెట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన నుంచి అధికారిక సమాచారం వస్తే తప్ప.. ఇలాంటి వాట్సప్‌ ఫార్వర్డ్‌ సందేశాలు, అసత్య వీడియోలను నమ్మొద్దని టాటా స్పష్టం చేశారు.

 ఇంగ్లండ్‌(England)పై గెలుపు గాలి వాటం కాదని పాక్‌పై గెలుపుతో అఫ్గాన్‌ నిరూపించింది. పాకిస్తాన్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్(Pakistan 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ 49 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (87: 113 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (65: 53 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్), రహ్మత్ షా (77 నాటౌట్: 84 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం (74: 92 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక పరుగులు సాధించాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (58: 75 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ కొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు.