అఖిలేష్ యాద‌వ్‌ను కౌగిలించుకున్న ర‌జినీకాంత్

సూపర్ స్టార్ ర‌జినీకాంత్ గురించి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో సూపర్ స్టార్ రజిని నటించిన జైలత్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతానికి అంచనాలకు మించిన కలెక్షన్ రాబడుతోంది. లక్నో లో ఉన్న తన నివాసంలో ఇటీవల యోగి ఆదిత్యనాథ్ కాళ్ళకి నమస్కారం చేస్తూ కనిపించాడు రజినీకాంత్. అఖిలేష్ యాదవ్- రజినీకాంత్ స్నేహం:  సూపర్ స్టార్ రజనీకాంత్ లక్నోలోని […]

Share:

సూపర్ స్టార్ ర‌జినీకాంత్ గురించి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో సూపర్ స్టార్ రజిని నటించిన జైలత్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతానికి అంచనాలకు మించిన కలెక్షన్ రాబడుతోంది. లక్నో లో ఉన్న తన నివాసంలో ఇటీవల యోగి ఆదిత్యనాథ్ కాళ్ళకి నమస్కారం చేస్తూ కనిపించాడు రజినీకాంత్.

అఖిలేష్ యాదవ్- రజినీకాంత్ స్నేహం: 

సూపర్ స్టార్ రజనీకాంత్ లక్నోలోని తన ఇంటిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అనంతరం, ప్రముఖ నటుడు రజిని గడిచిన ఆదివారం నాడు లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను అతని నివాసంలో కలిసినట్లు అఖిలేష్ యాదవ్ పోస్ట్ ద్వారా తెలుస్తోంది.

“హృదయాలు కలిసినప్పుడు, ఒకరికొకరు కౌగిలించుకుంటారు” అంటూ అఖిలేష్ యాదవ్ తాను రజినీకాంత్ ను కలుసుకున్నప్పుడు ఆప్యాయంగా కౌగిలించుకున్న ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇప్పుడు యోగి కాళ్లకు నమస్కరించిన రజిని ఫోటో, అదే విధంగా అఖిలేష్ యాదవ్ తో కౌగిలించుకున్న తీయించుకున్న రజిని ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతేకాకుండా ఫోటో షేర్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ఈ విధంగా రాసుకోవచ్చారు..మైసూర్‌లో తాను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, రజనీకాంత్‌ను తెరపై చూసినప్పుడు తనకి కలిగిన ఆనందం ఇప్పటికీ చెక్కుచెదరలేదని. అంతేకాకుండా తాము 9 సంవత్సరాల క్రితం వ్యక్తిగతంగా కలుసుకున్నామని, అప్పటి నుండి స్నేహితులుగా ఉన్నాము అని ఎస్పీ చీఫ్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.

జైలర్ సినిమా విజయం అనంతరం తన స్నేహితుడిగా భావించిన అఖిలేష్ యాదవ్ ను కలుసుకున్నందుకు తనకి కూడా ఎంతగానో సంతోషంగా అనిపిస్తుందని రజిని తెలిపారు. తొమ్మిదేళ్ల క్రితం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో అఖిలేష్‌ని కలిశానని.. అప్పటి నుండి, తమ మధ్య ఉన్న స్నేహం కొనసాగుతుందని.. అంతేకాకుండా తాము ఫోన్లో మాట్లాడుకుంటామని, షూటింగ్ కోసం ఐదేళ్ల క్రితం ఇక్కడికి వచ్చానని, కానీ అఖిలేష్ లక్నోలో లేకపోవడంతో తనని కలవడం కుదరలేదని చెప్పారు రజిని. ఐదేళ్ల తర్వాత ప్రస్తుతం ఇలా తన స్నేహితుడైన అఖిలేష్ యాదవ్ ని కలవడం సంతోషంగా ఉంది అంటూ విలేకరులతో మాట్లాడారు రజిని.

ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తన సినిమా “జైలర్” ప్రమోషన్ కోసం రజనీకాంత్ శుక్రవారం లక్నో చేరుకున్నారు. శనివారం సీఎం ఆదిత్యనాథ్‌ను కలిసి ఆయన పాదాలను తాకి ఆశీస్సులు రజిని తీసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత, రజనీకాంత్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య షహీద్ పాత్‌లోని ఒక సినిమా మాల్‌లో “జైలర్” చూశారు.

జైలర్ విశేషాలు: 

జైలర్ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి, రజనీకాంత్ ఫ్యాన్స్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఎదురు చూడ సాగరు. ఈ సందర్భంగా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రత్యేక సన్నాహాలు చేయడం జరిగింది. 2023 ఆగస్టు 10న జైలర్ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా మొదటి రోజే కలెక్షన్ల వర్షం చూసింది. జైలర్ సినిమా మొదటి రోజు కలెక్షన్ 49 కోట్లుగా ఉందని, అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని అఫీషియల్ గా రిలీజ్ అయ్యే నివేదికల ప్రకారం తేలనుంది. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడు రూ.25 కోట్లు రాబట్టవచ్చని, కర్ణాటక నుంచి రూ.11 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మార్కెట్‌లో రూ.7 కోట్లు రాబట్టవచ్చని అంచనా. జైలర్ సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచే హడావిడి మొదలైంది, జైలర్ సినిమా రిలీజ్ కారణంగా చెన్నై అలాగే బెంగళూరులోని పలు ప్రాంతాలలో కొన్ని ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో జైలర్ సినిమా కోసం ఉచిత టికెట్లు పంపిణీ కూడా చేశారు.