ఇది హైదరాబాదా.. న్యూయార్కా.? నేను ఇండియాలోనే ఉన్నానా రజనీకాంత్ వ్యాఖ్యలు

ఎన్టీఆర్ శతజయంతోత్సవాలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నటుడు రజినీకాంత్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటుడు రజనీకాంత్ ఎన్టీఆర్ శతజయంతోత్సవాలు వేడుకలో మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తనకు ఉండే సంబంధాన్ని వివరించారు.  అనుభవం ఏం మాట్లాడాలో చెబుతుందన్నారు. జనాన్ని చూస్తుంటే రాజకీయం గురించి మాట్లాడాలనిపిస్తుంది కానీ, వద్దురా రజిని అని అనుభవం ఆపుతుంది అంటూనే రజనీకాంత్ తన మనసులోని మాటను బహిరంగంగా వెల్లడించారు. విజయవాడ […]

Share:

ఎన్టీఆర్ శతజయంతోత్సవాలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నటుడు రజినీకాంత్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటుడు రజనీకాంత్ ఎన్టీఆర్ శతజయంతోత్సవాలు వేడుకలో మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తనకు ఉండే సంబంధాన్ని వివరించారు.  అనుభవం ఏం మాట్లాడాలో చెబుతుందన్నారు. జనాన్ని చూస్తుంటే రాజకీయం గురించి మాట్లాడాలనిపిస్తుంది కానీ, వద్దురా రజిని అని అనుభవం ఆపుతుంది అంటూనే రజనీకాంత్ తన మనసులోని మాటను బహిరంగంగా వెల్లడించారు. విజయవాడ వేదిక మీద నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర అభివృద్ధిని ఆకాశానికి ఎత్తేశారు. 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కి షూటింగ్ కి వచ్చినప్పుడు నైట్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వైపు వెళ్ళాను. అప్పుడు ఆ అభివృద్ధి చూసి నేను ఇండియాలో ఉన్నానా.? న్యూయార్క్ లో ఉన్నానా.? అర్థం కాలేదు అని రజనీకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను చూసిన హైదరాబాదుకు ఇప్పటి హైదరాబాదుకు ఎక్కడా పొంతనలేదని ఆయన అన్నారు. హైదరాబాద్ ఇండియాలోనే ఎకనామికల్ గా బాగా ఎదిగిందని అందరికీ తెలుసు. నేను విన్నాను. తెలంగాణ సీఎం మాన్యశ్రీ కే చంద్రశేఖర రావు కూడా ఇదే విషయం చెప్పారు అంటూ నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా నిజాయితీగా తన మనసులోని అభిప్రాయాన్ని స్పష్టం చేశారు రజినీకాంత్.

దివంగత నందమూరి తారకరామారావు శతజయంతోత్సవాల్లో పాల్గొనడానికి శుక్రవారం విజయవాడ వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నైజాం ఇలా ఉంటే నిత్యం హైదరాబాదును తానే డెవలప్ చేశానని అడిగినా అడగకపోయినా అందరి ముందు నిస్సిగ్గుగా చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు పక్కన ఉండగానే రజినీకాంత్ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని కీర్తించడం గమనార్హం. ఒక్క రజనీకాంతే కాదు , ఎందరెందరో దశాబ్దాల తరువాత హైదరాబాద్ ను చూసిన వారంతా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.  తాజాగా బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మ, ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లి యు, ఆదిత్య టాక్రే, చత్రపతి శివాజీ మునిమనమడు శంబాజీ రాజా , ఒడిశా సీఎం పట్నాయక్, ఆస్ట్రేలియా యూకే పోలీస్ బృందాలు కూడా హైదరాబాదును చూసి ప్రశంసలు కురిపించాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా పెరుగుతుందే తప్ప తరగతి మాత్రం కాదు అంతలా హైదరాబాదుని అభివృద్ధి చేశారు కేసీఆర్ ఒక తెలుగు పత్రిక అధిపతి కూడా హైదరాబాద్ను కేసీఆర్ తీర్చిదిద్దిన విధానాన్ని చూసి ఇంతకన్నా ఎవరు చేయగలరని కితాబ్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.

హైదరాబాద్ నగరం గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు. హైదరాబాదులో ఉన్నానా న్యూయార్క్ లో ఉన్నానా అని ఇక్కడే అభివృద్ధి గురించి ఆయన మాట్లాడారని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి పక్క రాష్ట్రాలలో ఉంటున్న రజిని కాంత్ కు అర్థమైంది కానీ, ఇక్కడ గజినీలకు మాత్రం అర్థం కావడం లేదని ప్రతిపక్షాలపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు.
సంగారెడ్డి జిల్లాలో కంది మండల పరిధిలోని కాశీపూర్ లో బసవ భవన్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ గురించి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల గురించి హరీష్ రావు ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలపై సాటైర్లు వేశారు.  రాష్ట్రం నుంచి వచ్చిన సినీ హీరో రజనీకాంత్ కు హైదరాబాద్ అభివృద్ధి గురించి అర్థమైంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండే గజినీలకు మాత్రం అర్థం కావట్లేదు అంటూ సెటైర్లు వేశారు.