ప్రియుడి కోసం పాక్ వెళ్లిన ఇండియ‌న్

ప్రస్తుతం నలుగురు పిల్లలతో సహా పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమ గురించి భారతదేశం మొత్తం వినే ఉంటుంది. ఇదే తరహాలో మరో గృహిణి జైపూర్ కి వెళ్తున్న అని చెప్పి, ఏకంగా భారతదేశం దాటి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా పరిచయమైన తన ప్రియుడిని కలిసేందుకు వెళ్ళింది అని తర్వాత తెలిసింది.  అసలు విషయం:  34 ఏళ్ల అంజు అనే గృహిణి, జైపూర్ వెళ్తున్న అని తన భర్తకు చెప్పి, 29 సంవత్సరాల నస్రుల్లా […]

Share:

ప్రస్తుతం నలుగురు పిల్లలతో సహా పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమ గురించి భారతదేశం మొత్తం వినే ఉంటుంది. ఇదే తరహాలో మరో గృహిణి జైపూర్ కి వెళ్తున్న అని చెప్పి, ఏకంగా భారతదేశం దాటి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా పరిచయమైన తన ప్రియుడిని కలిసేందుకు వెళ్ళింది అని తర్వాత తెలిసింది. 

అసలు విషయం: 

34 ఏళ్ల అంజు అనే గృహిణి, జైపూర్ వెళ్తున్న అని తన భర్తకు చెప్పి, 29 సంవత్సరాల నస్రుల్లా అనే వ్యక్తిని కలవడానికి పాకిస్తాన్ బోర్డర్ దాటింది. అయితే ఆమె పాకిస్తాన్లో అడుగుపెట్టిన అనంతరం పాకిస్తాన్ పోలీస్ కస్టడీలో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తనకి లీగల్ గా పాస్పోర్ట్ కూడా ఉండడం వల్ల అక్కడ పాకిస్తాన్ పోలీసులు ఆమెను విడిచిపెట్టారు.  అంజు కలవడానికి వెళ్ళిన తన ప్రియుడు నస్రుల్లా వైద్య రంగంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇద్దరూ కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ఫేస్ బుక్ ఫ్లాట్ ఫామ్ ద్వారా పరిచయం అయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే తాను పాకిస్తాన్ వెళ్ళింది కేవలం ఆ దేశాన్ని చూడడానికే అంటూ, తన స్నేహితుడు అయిన నస్రుల్లాను పెళ్లి చేసుకోవడానికి కాదు అని విచారణలో తెలిసింది.

సీనియర్ పోలీసు అధికారి ముష్తాక్ ఖాబ్ మరియు స్కౌట్స్ మేజర్ ద్వారా, అంజు దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేసిన తరువాతే, అంజుని అదేవిధంగా ఆమె స్నేహితుడిని విడుదల చేసినట్లు దిర్ పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి తెలిపారు. 

అంజు కుటుంబం ఏమంటుంది?: 

అయితే ఇక్కడ భారత దేశంలో ఈ విషయం మీడియా ముందుకు వెళ్లిన తర్వాత, రాజస్థాన్ పోలీసుల టీం కొంతమంది బివాడలో ఉంటున్న అంజు కుటుంబ సభ్యుల దగ్గరకి వెళ్లి, విషయాలు మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించారు. రాజస్థాన్లో జీవిస్తున్న అంజు వాళ్ళ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. 15 సంవత్సరాల వయసున్న కుమార్తె అలాగే ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజు భర్త తెలిపిన వివరాల ప్రకారం, అంజు గురువారం జైపూర్‌ వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయిందని, అయితే ఆ తర్వాత ఆమె పాకిస్థాన్‌లో ఉన్నట్టు కుటుంబ సభ్యులకు తెలిసిందన్నారు. అయితే, తన భార్య అంజు వేరే వ్యక్తితో సోషల్ మీడియాలో మాట్లాడుతున్నట్లు తనకి అస్సలు తెలీదు అన్నారు అంజు భర్త. అంతేకాకుండా అంజు దగ్గర విదేశాలకు వెళ్లేందుకు సరైన లీగల్ పాస్పోర్ట్ కూడా ఉన్నట్లు అంజు భర్త చెప్పారని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భివాడి సుజిత్ శంకర్ తెలిపారు. ప్రస్తుతానికి అంజు కుటుంబం పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు చేయలేనట్లు తెలుస్తోంది.

ఇలాగే పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమా : 

అయితే ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమా అనే ముస్లిం మహిళ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తుంది. సీమా కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన పెళ్లయిన గృహిణి. తనతో పాటు నలుగురు పిల్లలతో నేపాల్ ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. సీమ కూడా తన స్నేహితుడిని ఒక ఆన్లైన్ గేమ్ ద్వారా పరిచయమైనట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఈమె పాకిస్తాన్ నుంచి పక్క ప్లాన్ ప్రకారమే వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా సీమ మళ్లీ పాకిస్తాన్ తిరిగి వెళ్లేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో సీమా కుటుంబ సభ్యులు ఆమెని పాకిస్తాన్కు తిరిగి వచ్చేందుకు నిరాకరించారని, తేలింది. అయితే ఇది ఎంతవరకు సరైన సమాచారం అనే దాని మీద దర్యాప్తు జరుగుతుంది. మరోపక్క సిమా మాత్రం భారతదేశం నుంచి వెళ్లేది లేదని తేల్చి చెప్తుంది. సీమానీ పక్క ప్లాన్ ప్రకారం పాకిస్తాన్ వాళ్ళు పంపించారని, అంతేకాకుండా ఆమెకు మంచి ట్రైనింగ్ కూడా ఇచ్చారని, భారతీయ సాంప్రదాయ ప్రకారంగా ఎలా నడుచుకోవాలో అన్ని నేర్పించి పాకిస్థాన్ వారు పంపారని పోలీసు వారు అంచనా వేస్తున్నారు.