రాజస్థాన్ లో మరో అంజూ…!

అంజూ ఈ పేరు తెలియని వారు మన దేశంలో ఉండరు. అంతలా అంజూ అందరికీ సుపరిచితురాలైంది. ఇంతకీ ఈమె ఏదో దేశానికి ఘన కార్యం చేసి ఫేమస్ కాలేదు తన ఫేస్ బుక్ లవర్ కోసం కట్టుకున్న భర్త, అత్తిల్లు, పుట్టిల్లు, పుట్టిన పిల్లలు అందర్నీ వదిలేసి పాకిస్తాన్ కు చెక్కేసింది. వేరే దేశానికి వెళ్లినా అందరూ లైట్ తీసుకునే వారేమో కానీ అంజూ వెళ్లింది పాకిస్తాన్ కు కావడంతో అంతా ఫైర్ అవుతున్నారు. అంజూ చేసిన […]

Share:

అంజూ ఈ పేరు తెలియని వారు మన దేశంలో ఉండరు. అంతలా అంజూ అందరికీ సుపరిచితురాలైంది. ఇంతకీ ఈమె ఏదో దేశానికి ఘన కార్యం చేసి ఫేమస్ కాలేదు తన ఫేస్ బుక్ లవర్ కోసం కట్టుకున్న భర్త, అత్తిల్లు, పుట్టిల్లు, పుట్టిన పిల్లలు అందర్నీ వదిలేసి పాకిస్తాన్ కు చెక్కేసింది. వేరే దేశానికి వెళ్లినా అందరూ లైట్ తీసుకునే వారేమో కానీ అంజూ వెళ్లింది పాకిస్తాన్ కు కావడంతో అంతా ఫైర్ అవుతున్నారు. అంజూ చేసిన ఘటనను ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఏదో దేశం దాటి వెళ్లిపోయింది సరే గుట్టుచప్పుడు కాకుండా ఉంటుందా అంటే అంజూ అక్కడ చేసే వేషాలు చూస్తే ఎవరికైనా సరే తనంటే కోపం రాక మానదు. అటువంటి చిల్లర చేష్టలు వేస్తున్న అంజూను దేశం ఇప్పట్లో క్షమించే ప్రసక్తే లేదని అంతా అనుకుంటున్నారు. 

రాజస్థాన్ లో మరో ఘటన…

పాకిస్తాన్ కు ఫేస్ బుక్ లవర్ ను కలిసేందుకు వెళ్లిన అంజూది కూడా రాజస్థాన్ రాష్ట్రం కావడం విశేషం. మరో ఘటన కూడా రాజస్థాన్ రాష్ట్రంలోనే జరిగింది. ఇది విన్న పలువురు అసలు దేశం ఎటు పోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. పూర్తిగా బరి తెగించి ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భివాడి జిల్లాకు చెందిన అంజూకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. ఆమె వయసు కూడా  30+ కావడం గమనార్హం. ఆమెకు ఈ వయసులో ప్రేమ గుర్తుకు వచ్చింది. వచ్చిన వెంటనే ఏ మాత్రం తన భర్త, పిల్లల గురించి ఆలోచించుకుండా తన దారిన తాను 29 సంవత్సరాల పాకిస్తాన్ దేశీయుడు నస్రుల్లా కోసం పరుగు తీసింది. తన స్నేహితుడిని కలిసేందుకు జైపూర్ కు వెళ్తున్నానని భర్తకు చెప్పిన అంజూ, గోవాకు వెళ్తున్నానని తన ఆఫీసులో చెప్పింది. ఇలా ఇద్దరికి రెండు విషయాలు చెప్పిన అంజూ జూలై 21న రాజస్థాన్ సరిహద్దు దాటి పాక్ లోకి ప్రవేశించింది. అక్కడ తన ఫేస్ బుక్ లవర్ నస్రుల్లాతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. మొదట నస్రుల్లా తనకు మంచి మిత్రుడని అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని చెప్పిన అంజూ గంటల వ్యవధిలోనే మాట మార్చింది. నస్రల్లా కోసం తాను మతం మార్చుకోవడంతో పాటు పేరును కూడా మార్చేసుకుంది. 

వెలుగులోకి మరో అంజూ.. 

రాజస్థాన్ లోని దుంగార్ పూర్ జిల్లాలో మరో అంజూ బాగోతం బట్టబయలైంది. స్థానికంగా ఉండే  ఓ మహిళ ఇంట్లోని నగలు, డబ్బులతో తన స్నేహితుడితో కలిసి కువైట్ కు పారిపోయిందని ఆ మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీపికా పాటిదార్ అనే మహిళ తన స్నేహితుడు ఇర్ఫాన్ తో కలిసి కువైట్ వెళ్లినట్లు ఆ మహిళ భర్త కంప్లైంట్ చేశాడు. ఆ మహిళ బురఖా ధరించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం తనకు తెలిసిందని అతడు వాపోయాడు. 

నువ్వక్కడ నేనిక్కడ.. 

ఈ కేసులో ఉన్న దీపికా పాటిదార్ అనే భర్త పని నిమిత్తం ముంబైలో ఉండే వాడు. దీపికా పాటిదార్ కు ఇద్దరు సంతానం. ఆమె వారి బాగోగులు చూసుకుంటూ రాజస్థాన్ లోనే ఉండేది. ఆమె వైద్యం కోసం గుజరాత్ కు వెళ్లేదని ఆ భర్త పోలీసులకు తెలిపాడు. ఇటీవల జూలై 10వ తేదీన గుజరాత్ కు వైద్యం కోసమని వెళ్లిన తను ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేశాడు. అప్పుడు ఇంట్లోని లక్షల డబ్బు, నగలు మాయం అయినట్లు గుర్తించానని అతడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. వైద్యం కోసమని గుజరాత్ కు వెళ్లే దీపికాకు ఇర్పాన్ తో ఎలా పరిచయం ఏర్పడిందని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అంతే కాక వీరికి పాస్ పోర్ట్ వీసాలు ఎలా సమకూరాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంజూ లాంటి కేసులు పెరగడం సభ్య సమాజానికి అంత మంచిది కాదని దీనిని ముక్తకంఠంతో అందరూ వ్యతిరేకించాలని పలువురు సోషలిస్ట్ వర్కర్స్ అంటున్నారు.