Teetar Singh : 50 ఏళ్ల‌లో 20 సార్లు ఓడాడు..అయినా మ‌ళ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి

Teetar Singh: రాజ‌స్థాన్‌లోని క‌రాన్‌పూర్(Karanpur) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల(General Elections) నేప‌థ్యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తీత‌ర్ సింగ్(Teetar Singh) తాజాగా మ‌రోసారి పోటీలో నిల‌బ‌డ్డాడు. ఎన్నిక‌ల‌న్న‌కా అభ్య‌ర్థులు పోటీలో నిల‌బ‌డ్డం స‌హ‌జం. కాక‌పోతే తీత‌ర్ సింగ్ ప్రత్యేక‌త ఏంట‌టే ఇప్ప‌టికి 20 సార్లు ఆయ‌న ఎన్నిక‌ల్లో త‌న అదృష్టాన్నీప‌రీక్షించుకుంటూ వ‌చ్చారు. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్న ఇది నిజం. ఐదు ద‌శాబ్దాలుగా ఆయ‌న పోటీలో నిల‌బ‌డుతూనే ఉన్నారు. దీంతో తాజాగా మ‌రోసారి పోటీలో […]

Share:

Teetar Singh: రాజ‌స్థాన్‌లోని క‌రాన్‌పూర్(Karanpur) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల(General Elections) నేప‌థ్యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తీత‌ర్ సింగ్(Teetar Singh) తాజాగా మ‌రోసారి పోటీలో నిల‌బ‌డ్డాడు. ఎన్నిక‌ల‌న్న‌కా అభ్య‌ర్థులు పోటీలో నిల‌బ‌డ్డం స‌హ‌జం. కాక‌పోతే తీత‌ర్ సింగ్ ప్రత్యేక‌త ఏంట‌టే ఇప్ప‌టికి 20 సార్లు ఆయ‌న ఎన్నిక‌ల్లో త‌న అదృష్టాన్నీప‌రీక్షించుకుంటూ వ‌చ్చారు. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్న ఇది నిజం. ఐదు ద‌శాబ్దాలుగా ఆయ‌న పోటీలో నిల‌బ‌డుతూనే ఉన్నారు. దీంతో తాజాగా మ‌రోసారి పోటీలో నిల‌బ‌డ్డంతో తీత‌ర్ సింగ్ పేరు మ‌రోసారి వార్త‌లో నిలిచింది.

ఎన్నిక‌ల్లో పోటీచేసి నాయ‌కులుగా గుర్తింపు పొందాల‌నే ఆశ అంద‌రికీ ఉంటుంది. రాజస్థాన్‌లోని క‌రాన్‌పూర్(Karanpur) నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 78ఏళ్ల తీతర్‌సింగ్‌కు కూడా అదే కోరిక‌. అయితే, అందుకోసం ఆయ‌న ఏకంగా యాభై ఏళ్ల‌లో 20 సార్ల‌కు పైగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. అలా నిల‌బ‌డిన ప్ర‌తిసారి ఓట‌మిని చ‌వి చూస్తునే ఉన్నారు. అయినా స‌రే అత‌నిలోని పోటీ చేయాల‌నే ప‌ట్టుద‌ల ఈ వ‌య‌సులో కూడా అస్స‌లు త‌గ్గ‌లేదు. 

అందుకే తాజాగా మ‌రో సారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. తీత‌ర్‌సింగ్‌కు ముగ్గురు కూతుర్లు, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. వారి మ‌న‌వ‌ళ్ల‌కు కూడా పెళ్లిళ్లు అయిపోయాయి. ఆస్తిపాస్తులేవీ లేవు. సాధార‌ణ రోజుల్లో మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చ‌ట్టం(Employment Guarantee Act) కింద తాను రోజువారీ కూలీగా ప‌నిచేస్తున్నాని ఆయ‌న చెప్పారు. ఎన్నిక‌లు రాగానే ప్ర‌చారం చేస్తుంటాన‌ని చెప్పాడు.

ద‌ళిత వ‌ర్గానికి చెందిన తీత‌ర్ సింగ్(Teetar Singh) 1970 నుంచి ర‌క‌ర‌కాల ఎన్నిక‌ల్లో పోటీ చేస్తూ వ‌స్తున్నారు. ఈ సారి ఎన్నిక‌ల బ‌రిలో కూడా ఆయ‌న త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. తీత‌ర్ సింగ్ 50 ఏళ్ల నుంచి పంచాయ‌తీ ఎన్నిక‌ల(Panchayat Election) నుంచి అసెంబ్లీ, పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల వ‌ర‌కు అన్నింట్లో పోటీచేశారు. ప్ర‌భుత్వం త‌మ‌కు భూములు ఇవ్వాల‌ని, స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని తీత‌ర్ సింగ్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ ఎన్నిక‌లు త‌మ హ‌క్కుల గురించి జ‌రుగుతున్న పోరాట‌మ‌ని, ఇదేదో పేరుకోసం చేస్తున్న‌ది కాద‌ని అత‌ను పేర్కొన్నాడు.

తీత‌ర్ సింగ్ మ‌న్రేగా(Mgnrega)లో ఒక కూలీగా ప‌నిచేస్తున్నాడు. 1970లో కెనాల్ క‌మాండ్ ఏరియాలో త‌న‌కు భూమి ఇవ్వ‌లేద‌ని, త‌న‌లాంటి వాళ్లు చాలా మంది భూముల్ని కోల్పోయి నిస్స‌హాయ స్థితిలో ఉన్నార‌ని, అందుకే అప్ప‌టి నుంచి ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాని తీత‌ర్ సింగ్(Teetar Singh) అన్నాడు. తనకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారని.. మనవళ్లకు కూడా పెళ్లిళ్లు అయ్యాయని ఆయన తెలిపారు. తన వద్ద డిపాజిట్ అమౌంట్‌(Deposit Amount) రూ.2,500 నగదు ఉందని, అయితే భూమి, ఆస్తి, వాహనాలు లేవని తెలిపారు. ఎన్నిసార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసినా, ఇంత‌ వ‌ర‌కు ఏ ప్ర‌భుత్వం త‌న‌కు గ‌జం భూమి కూడా ఇవ్వ‌లేదని వాపోయారు. 

నేను ఎన్నికల్లో పోటీ చేయడం ఇది 32వ సారి. నా నాలుగు తరాలు గడిచిపోయినా మా కుటుంబాల జీవితాలు మారలేదు. బీజేపీ(BJP), కాంగ్రెస్‌లు(Congress) అధికారంలోకి వచ్చినా, పోయినా  పేదలకు లాభం జరగలేదు. గ్రామాలు డెవలప్ కాలేదు. పేద ప్రజలకు ప్రభుత్వం భూమి పంచాలి. వారి జీవితాలు మారేలా పథకాలు అమలు చేయాలి. ఈ ఆలోచనలే నన్ను ఎన్నికల్లో పోటీ చేసేలా ప్రేరేపిస్తున్నాయి. నేను ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే నియోజకవర్గంలోని గ్రామాలలో రోడ్లను బాగు చేయిస్తాను. ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేయిస్తాను. భూమిలేని పేద కూలీలకు భూమిని పంచుతానని తీత‌ర్‌సింగ్‌(Teetar Singh)  పేర్కొన్నాడు.  తీత‌ర్‌సింగ్‌కు 2008 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 938 ఓట్లు పోల‌వ‌గా, 2013 ఎన్నిక‌ల్లో 427, 2018 ఎన్నిక‌ల్లో 653 ఓట్లు పోల‌య్యాయి. ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ప్ర‌తిసారీ, తీత‌ర్‌సింగ్‌ త‌న డిపాజిట్ డ‌బ్బులను కూడా కోల్పోయేవారు. అయినా, విజ‌యం అత‌నిని వ‌రించ‌లేదు.